ట్యురిన్‌లో జరిగిన సైక్లింగ్ పోటీల్లో ఎరిట్రియాకు చెందిన బినియం గిర్మే చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన టూర్ డి ఫ్రాన్స్ (ఫ్రాన్స్‌లో జరిగే పురుషుల మల్టీ స్టేజ్ సైకిల్ రేసు) స్టేజ్ టైటిల్ గెలిచిన తొలి నల్లజాతి ఆఫ్రికన్ రైడర్‌గా రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరిగిన మూడో దశ స్ప్రింట్‌లో గిర్మే విజయం సాధించాడు. ఇంటర్‌మార్చే వాంటీ జట్టుకు చెందిన గిర్మే.. ఫెర్నాండో గవిరియా, ఆర్నాడ్ డి లీ కంటే ముందే రేస్ ఫినిష్ చేసి టైటిల్ గెలిచాడు.
Biniam Girmay makes history as the first African rider to win a Tour de France stage🇪🇷 pic.twitter.com/AB8xvzyxox
— Typical African (@Joe__Bassey) July 3, 2024
24 ఏళ్ల గిర్మేకు ఇది రెండో టూర్. గిర్మే 2022లో గిరో డి'ఇటాలియా స్టేజ్ టైటిల్ గెలిచాడు. మరోవైపు టూర్ డి ఫ్రాన్స్‌లో రిచర్డ్ కరాపాజ్.. తదేజ్ పొగాకర్ నుంచి పసుపు జెర్సీని (రేస్ లీడర్) దక్కించుకున్నాడు. తద్వారా కరాపాజ్ ఈ ఘనత సాధించిన మొదటి ఈక్వెడారియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంకో వైపు గిర్మే గెలుపుతో స్టేజ్ విజయాల రికార్డు బద్దలు కొట్టాలన్న మార్క్ కావెండిష్ ఆశలు అడియాశలయ్యాయి.
టూర్ డి ఫ్రాన్స్ గెలిచిన అనంతరం గిర్మే మాట్లాడుతూ.. నేను సైక్లింగ్ ప్రారంభించినప్పటి నుండి ఈ టైటిల్ గురించి కలలు కంటున్నాను. రెండో ప్రయత్నంలోనే టైటిల్ గెలవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది వ్యక్తిగతంగా నాకు, నా ప్రాంతానికి (ఆఫ్రికా) గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment