cycling competition
-
"టూర్ డి ఫ్రాన్స్" టైటిల్ గెలిచిన బినియం గిర్మే.. తొలి ఆఫ్రికన్‌గా రికార్డు
ట్యురిన్‌లో జరిగిన సైక్లింగ్ పోటీల్లో ఎరిట్రియాకు చెందిన బినియం గిర్మే చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన టూర్ డి ఫ్రాన్స్ (ఫ్రాన్స్‌లో జరిగే పురుషుల మల్టీ స్టేజ్ సైకిల్ రేసు) స్టేజ్ టైటిల్ గెలిచిన తొలి నల్లజాతి ఆఫ్రికన్ రైడర్‌గా రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరిగిన మూడో దశ స్ప్రింట్‌లో గిర్మే విజయం సాధించాడు. ఇంటర్‌మార్చే వాంటీ జట్టుకు చెందిన గిర్మే.. ఫెర్నాండో గవిరియా, ఆర్నాడ్ డి లీ కంటే ముందే రేస్ ఫినిష్ చేసి టైటిల్ గెలిచాడు.Biniam Girmay makes history as the first African rider to win a Tour de France stage🇪🇷 pic.twitter.com/AB8xvzyxox— Typical African (@Joe__Bassey) July 3, 202424 ఏళ్ల గిర్మేకు ఇది రెండో టూర్. గిర్మే 2022లో గిరో డి'ఇటాలియా స్టేజ్ టైటిల్ గెలిచాడు. మరోవైపు టూర్ డి ఫ్రాన్స్‌లో రిచర్డ్ కరాపాజ్.. తదేజ్ పొగాకర్ నుంచి పసుపు జెర్సీని (రేస్ లీడర్) దక్కించుకున్నాడు. తద్వారా కరాపాజ్ ఈ ఘనత సాధించిన మొదటి ఈక్వెడారియన్గా రికార్డుల్లోకెక్కాడు. ఇంకో వైపు గిర్మే గెలుపుతో స్టేజ్ విజయాల రికార్డు బద్దలు కొట్టాలన్న మార్క్ కావెండిష్ ఆశలు అడియాశలయ్యాయి.టూర్ డి ఫ్రాన్స్ గెలిచిన అనంతరం గిర్మే మాట్లాడుతూ.. నేను సైక్లింగ్ ప్రారంభించినప్పటి నుండి ఈ టైటిల్ గురించి కలలు కంటున్నాను. రెండో ప్రయత్నంలోనే టైటిల్ గెలవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది వ్యక్తిగతంగా నాకు, నా ప్రాంతానికి (ఆఫ్రికా) గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. -
సైక్లింగ్ తెచ్చిన అవకాశాలు..
కోల్‌కతా: గాయపడిన తన తండ్రిని సైకిల్ పై కూర్చొబెట్టుకొని ఢిల్లీ నుంచి దర్భంగా వరకు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన బిహార్‌కు చెందిన విద్యార్థిని జ్యోతి కుమారికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ ఎత్తేశాక జ్యోతిని సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే ట్రయల్స్‌కు పంపుతామని, అయితే చదువే తమ మొదటి ప్రాధాన్యమని ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ తెలిపారు. వలస కార్మికులంతా ఇళ్లకు తిరిగి వెళుతుంటే తమకు మరో మార్గం లేక పాత సైకిల్ కొని ప్రయాణం సాగించినట్లు తెలిపారు. దారి మధ్యలో తాము ట్రక్కులు, ట్రాక్టర్లను పట్టుకొని ప్రయాణం చేసినట్లు తెలిపారు. దర్భంగా జిల్లా కలెక్టర్ జ్యోతిని ఇటీవల పిండారుచ్ హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. ఆమెకు కొత్త సైకిల్, యూనిఫాం, షూ అందించారు. జ్యోతి చదువుయ్యే ఖర్చును భరిస్తామని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. మరోవైపు జ్యోతికి సైక్లింగ్ లో ట్రైనింగ్, స్కాలర్ షిప్ ఇచ్చే అవకాశాలను పరిశీలించాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ క్రీడల మంత్రి కిరెన్ రిజిజును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. -
ఆసియా సైక్లింగ్ పోటీలకు దత్తాత్రేయ, ఆదిత్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన కె.దత్తాత్రేయ, ఆదిత్య మెహతాలిద్దరూ ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బహ్రెయిన్ బయల్దేరనున్నారు. దత్తా త్రేయ ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో, ఆదిత్య ఆసియా పారా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు బహ్రెయిన్‌లో ఈ పోటీలు జరుగుతాయి. దత్తాత్రేయ దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి కాగా, ఆదిత్య మెహతా గతంలో అంతర్జాతీయ సైక్లింగ్ పోటీల్లో రెండు రజత పతకాలు గెలిచాడు.