![Ashirwad Saxena Won Silver-Bronze Medals National Cycling Championship - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/27/Ashirwad-Saxena.jpg.webp?itok=4Yih77oy)
జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా రెండు పతకాలతో ఆకట్టుకున్నాడు. జైపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఆశీర్వాద్ రజతం, కాంస్యం సాధించాడు. అండర్–16 విభాగం 2000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్ ఈవెంట్‌లో ఆశీర్వాద్ మూడో స్థానంలో నిలిచాడు. ఆశీర్వాద్, చిరాయుష్ పట్వర్ధన్, ఎ.రామకృష్ణలతో కూడిన తెలంగాణ బృందం టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో రజతం సాధించింది. భారత స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలోని ఖేలో ఇండియా శిబిరంలో ఈ ముగ్గురు శిక్షణ పొందారు.
Comments
Please login to add a commentAdd a comment