మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల అక్రమ వినియోగం
గుట్టురట్టు చేసిన సౌత్–వెస్ట్ జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్
నలుగురు నిందితుల అరెస్టు, భారీగా సరుకు స్వాదీనం
ఇలాంటి స్టెరాయిడ్స్ వినియోగం ప్రమాదకరం: డీసీపీ
సాక్షి, సిటీబ్యూరో/విజయనగర్‌కాలనీ: వైద్య రంగంలో అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా విక్రయిస్తున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువగా కండలు పెంచడానికి కొందరు యువకులు వీటిని బ్లాక్‌లో కొని మరీ వినియోగిస్తున్నారు. జిమ్‌లలో అత్యధిక సమయం గడపటానికి స్టెరాయిడ్‌గా ఈ మందులు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. ఉత్తరాది నుంచి మెఫెంటరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్న నలుగురు నిందితులను సౌత్–వెస్ట్ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ అందె శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. వీరి నుంచి 217 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
జిమ్ ఏర్పాటుతో ఆరి్థక ఇబ్బందులు
మహారాష్ట్రకు చెందిన రషీద్ ఖాన్ నగరానికి వలసవచ్చి జిర్రాలోని నట్‌రాజ్ నగర్‌లో నివసిస్తున్నాడు. తొలినాళ్లల్లో జిమ్ ట్రైనర్‌గా, ఆపై పర్సనల్ ట్రైనర్‌గా పని చేసిన రషీద్ మెహదీపట్నంతో సొంతంగా ఆర్‌కే జిమ్ పేరుతో వ్యాయామశాల ఏర్పాటు చేశాడు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో జిమ్ మూసేశాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. జిమ్‌లకు వచ్చే యువత ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్స్‌గా వాడుతున్న మెఫెంటరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్లకు నగరంలో భారీ డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని అక్రమంగా విక్రయిస్తూ 2022లో చంద్రాయణగుట్ట పోలీసులకు చిక్కాడు. అయినప్పటికీ పంథా మార్చుకోని ఇతగాడు అదే విధానం కొనసాగించాడు.
ఆన్‌లైన్‌లో ఖరీదు చేసి దళారుల ద్వారా...
కొన్నాళ్లుగా రషీద్ మెట్ఫార్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు ఇండియా మార్ట్ వెబ్‌సైట్ ద్వారా ఖరీదు చేసి, కొరియర్‌లో నగరానికి రప్పిస్తున్నాడు. వీటిని తన స్నేహితుడైన థెరపిస్ట్ మహ్మద్ అఫ్తాబ్ హుస్సేన్, విద్యార్థి మహ్మద్ హబీబుద్దీన్, టెక్నీíÙయన్ మహ్మద్ రెహ్మత్ ద్వారా విక్రయిస్తున్నాడు. దళారులుగా పని చేస్తున్న వీరికి కొంత కమీషన్ ఇస్తున్నాడు. జిమ్‌లకు వెళ్తున్న యువత నిరీ్ణత బరువు కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి ఈ ఇంజెక్షన్లు స్టెరాయిడ్‌గా పని చేస్తున్నాయి. ఈ గ్యాంగ్ ఒక్కో ఇంజెక్షన్ రూ.2000 వరకు అమ్ముతోంది. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. అయితే వీళ్లు అక్రమంగా సేకరించి తమ జిమ్‌లో అమ్ముతున్నారు.
భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు...
ఈ నలుగురూ చేస్తున్న దందాపై సౌత్–ఈస్ట్ జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.బాలస్వామికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్‌ఐ బి.అజిత్‌సింగ్ తమ బృందంతో దాడి చేసి నలుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 217 ఇంజెక్షన్లు, వాహనం, సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఆసిఫ్‌నగర్ ఠాణాకు అప్పగించారు. ఇలాంటి ఇంజెక్షన్లు, టాబ్లెట్స్‌ను స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటాయని అదనపు డీసీపీ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. దీన్ని వైద్యుల చీటీ లేనిదే అమ్మడం అక్రమం అని స్పష్టం చేస్తున్నారు. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment