allegedly
-
కండల కోసం ఆశపడితే ఖతం!
సాక్షి, సిటీబ్యూరో/విజయనగర్‌కాలనీ: వైద్య రంగంలో అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా విక్రయిస్తున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువగా కండలు పెంచడానికి కొందరు యువకులు వీటిని బ్లాక్‌లో కొని మరీ వినియోగిస్తున్నారు. జిమ్‌లలో అత్యధిక సమయం గడపటానికి స్టెరాయిడ్‌గా ఈ మందులు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. ఉత్తరాది నుంచి మెఫెంటరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్న నలుగురు నిందితులను సౌత్–వెస్ట్ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ అందె శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. వీరి నుంచి 217 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిమ్ ఏర్పాటుతో ఆరి్థక ఇబ్బందులుమహారాష్ట్రకు చెందిన రషీద్ ఖాన్ నగరానికి వలసవచ్చి జిర్రాలోని నట్రాజ్ నగర్లో నివసిస్తున్నాడు. తొలినాళ్లల్లో జిమ్ ట్రైనర్‌గా, ఆపై పర్సనల్ ట్రైనర్‌గా పని చేసిన రషీద్ మెహదీపట్నంతో సొంతంగా ఆర్కే జిమ్ పేరుతో వ్యాయామశాల ఏర్పాటు చేశాడు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో జిమ్ మూసేశాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. జిమ్‌లకు వచ్చే యువత ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్స్‌గా వాడుతున్న మెఫెంటరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్లకు నగరంలో భారీ డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని అక్రమంగా విక్రయిస్తూ 2022లో చంద్రాయణగుట్ట పోలీసులకు చిక్కాడు. అయినప్పటికీ పంథా మార్చుకోని ఇతగాడు అదే విధానం కొనసాగించాడు. ఆన్లైన్లో ఖరీదు చేసి దళారుల ద్వారా... కొన్నాళ్లుగా రషీద్ మెట్ఫార్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా ఖరీదు చేసి, కొరియర్లో నగరానికి రప్పిస్తున్నాడు. వీటిని తన స్నేహితుడైన థెరపిస్ట్ మహ్మద్ అఫ్తాబ్ హుస్సేన్, విద్యార్థి మహ్మద్ హబీబుద్దీన్, టెక్నీíÙయన్ మహ్మద్ రెహ్మత్ ద్వారా విక్రయిస్తున్నాడు. దళారులుగా పని చేస్తున్న వీరికి కొంత కమీషన్ ఇస్తున్నాడు. జిమ్‌లకు వెళ్తున్న యువత నిరీ్ణత బరువు కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి ఈ ఇంజెక్షన్లు స్టెరాయిడ్‌గా పని చేస్తున్నాయి. ఈ గ్యాంగ్ ఒక్కో ఇంజెక్షన్ రూ.2000 వరకు అమ్ముతోంది. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. అయితే వీళ్లు అక్రమంగా సేకరించి తమ జిమ్‌లో అమ్ముతున్నారు.భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు... ఈ నలుగురూ చేస్తున్న దందాపై సౌత్–ఈస్ట్ జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్ ఇన్స్పెక్టర్ ఎస్.బాలస్వామికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్ఐ బి.అజిత్‌సింగ్ తమ బృందంతో దాడి చేసి నలుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 217 ఇంజెక్షన్లు, వాహనం, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఆసిఫ్‌నగర్ ఠాణాకు అప్పగించారు. ఇలాంటి ఇంజెక్షన్లు, టాబ్లెట్స్‌ను స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటాయని అదనపు డీసీపీ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. దీన్ని వైద్యుల చీటీ లేనిదే అమ్మడం అక్రమం అని స్పష్టం చేస్తున్నారు. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆయన కోరారు. -
వెంబడించి వేధించడంతో..పోకిరిని చెప్పుతో..
కాలేజీ నుంచి హాస్టల్‌కి వెళ్తున్న విద్యార్థిని ఓ వ్యక్తి వెంటపడి వేధించడం ప్రారంభించాడు. ఓపిక నశించిన ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చెప్పుతో ఎడాపెడా వాయించింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థిని హాస్టల్ నుంచి కాలేజికి వెళ్తుండగా ఓ యువకుడు ఆమె వెంటపడి వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె అందరి ముందే అతడి చెంప చెల్లుమనిపించింది. తన కాలికి ఉన్న చెప్పుతో అతడి ముఖంపై ఎడాపెడా వాయించి తన కోపం తీర్చుకుంది. ఇక ఆ యువకుడు చేసేదేం లేక చూస్తు కూర్చున్నాడు. తనను వదిలేయమని ప్రాథేయపడ్డాడు. అయితే స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నజీర్‌గా గుర్తించారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: అదుపుతప్పి..వాహనాలపైకి దూసుకెళ్లి..) -
ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు?.. బండి సంజయ్ నివేదికలో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని నలుగురు కలెక్టర్లపై డీవోపీటీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. నలుగురు కలెక్టర్లు ధరణి పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, అడ్డగోలుగా దోచుకుంటున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘సీఎం కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెడుతున్నారు. ఆధారాలు సేకరిస్తున్నాం త్వరలో బయటపెతాం. ఆ నలుగురు కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తున్నాం. ఆ కలెక్టర్లకే అన్ని పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ నివేదిక బయటపడితే మిగతా కలెక్టర్లు తలదించుకుంటారు’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, కలెక్టర్లకు సంబంధించిన అక్రమాలపై ఆధారాలను బండి సంజయ్ ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ నలుగురు కలెక్టరు ఎవరై ఉంటారని వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. చదవండి: మీరా మాకు నీతులు చెప్పేది? కేంద్రంపై హరీష్ రావు ఫైర్ -
షాకింగ్ ఘటన: కన్నకొడుకే కాలయముడిలా కుటుంబ సభ్యులందర్నీ...
న్యూఢిల్లీ: ఒక యువకుడు కుటుంబ సభ్యులందర్నీ హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన దక్షిణ ఢిల్లీలోని పాలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం...25 ఏళ్ల కేశవ్ గత రాత్రి కుటుంబ సభ్యులందర్నీగొంతు కోసి చంపేసినట్లు తెలిపారు. ఒక పదునైన ఆయుధంతో పలుమార్లు దాడి చేసి హతమార్చాడని వెల్లడించారు. మృతులు కేశవ్ నానామ్మ దేవనా దేవి(75), తండ్రి దినేష్(50), తల్లి దర్శన, కూతురు ఊర్వశిగా గుర్తించారు. వారందరూ వేర్వేరు గదుల్లో విగత జీవులుగా పడి ఉన్నారు. కేశవ్ తల్లిదండ్రులిద్దరు బాత్రుంలోనూ, చెల్లెలు, నానమ్మ వేర్వేరు గదుల్లో అతడి చేతిలో హత్యకు గురయ్యారని పోలీసులు చెప్పారు. గుర్గాన్లో ఉద్యోగం చేస్తున్న కేశవ్ ఒక నెలక్రితమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని, దీపావళి నుంచే ఇంట్లో ఉంటున్నాడని చెప్పారు. అతను డ్రగ్స్‌కు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. నిందితుడు గత రాత్రి సుమారు 10.30 గం.ల ప్రాంతంలో ఈ ఘటనకు ఒడిగట్టినట్లు చెప్పారు. అదే ఇంటిలో ఉంటున్న పక్కింటి వాళ్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే ఇంతలో కేశవ్ తప్పించుకునేందుకు పథకం వేస్తుండగా అతని బంధువులు అడ్డకోవడంతో తాము అతన్న అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు) -
ఘోరం: ఎందుకలా చూస్తున్నారు అని ప్రశ్నించాడని...కొట్టి చంపేశారు
ముంబై: ఒక వ్యక్తి తనను తదేకంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించాడని ముగ్గురు వ్యక్తుల దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన ముంబైలో మాతుంగ ప్రాంతంలోని రెస్టారెంట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.....కాల్సెంటర్లో పనిచేసే రోనిత్ భలేకర్ తన స్నేహితుడితో మద్యం మత్తులో ఉన్నప్పుడూ ఈ దారుణం జరిగింది. భలేకర్ అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఒకర్నీ తనను ఎందుకు తదేకంగా చూస్తున్నారంటూ గొడవపడ్డాడు. దీంతో వారు కోపంతో అతన్ని బెల్టుతో పదేపదే కొట్టి ఛాతీ, కడుపుపై దారుణంగా తన్నారు. దీంతో సదరు వ్యక్తి భలేకర్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఈ ఘటనతో భయపడిన నిందితులు బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అతను ఆస్పత్రి చేరక మునుపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో షాహు నగర పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది?) -
నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు
న్యూఢిల్లీ: నకిలీ వెబ్సైట్లతో మోసాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు నాలుగు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించి సుమారు 12 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. తమ కంపెనీ పేరుతో కొందురు వ్యక్తులు నకిలీ వెబ్సైట్లు సృష్టించి ఈమెయిల్ ఐడీలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారంటూ పలు కంపెనీలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో సదరు కంపెనీల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ప్రారంభంలో సుమారు ఏడుగురుని అదుపులోకి తీసకున్నట్లు వెల్లడించారు. నిందితులు షమ్మీ, ఆలం ఖాన్, అతుల్ దీక్షిత్, ప్రేమ్ దత్, ఢిల్లీ నివాసితులు, సర్దార్ అమిత్ సింగ్, మోను కుమార్, సందీప్ చౌదరి, గోపాల్ కుమార్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. నిందితులందరూ బిహార్‌లు నివాసితులని చెప్పారు. తదుపరి ఆపరేషన్‌లో మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో సదరు నిందితులు ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి, ఈమెయిల్ ఐడీలు క్రియోట్ చేసుకుని క్లయింట్లకు మెసేజ్‌లు, కాల్లు చేయడం వంటివి చేసి వారితో లావాదేవీలు జరిపినట్లు తేలింది. అంతేగాదు కంపెనీ మార్కుతో కూడిన ఆమోద లేఖలను సైతం బాధితులకు పంపి మోసగించినట్లు వెల్లడించారు. దీంతో పలువురు బాధితులు ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయినట్లు పోలీసులు చెప్పారు. (చదవండి: సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం...టోపీ లాగి కాలర్ పట్టుకుని...) -
కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: బ్లాక్ మనీ చట్టం కింద పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ ఖాతాల్లో రూ. 814 కోట్ల మేర రహస్యంగా దాచిన నిధులపై రూ. 420 కోట్ల పన్నులను ఆయన ఉద్దేశపూర్వకంగా ఎగవేశారని అభియోగాలు మోపింది. ఆయన కావాలనే విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించలేదని ఆరోపించింది. (భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి) దీనికి సంబంధించి ఆగస్టు తొలినాళ్లలో ఐటీ శాఖ అంబానీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2012-13 నుంచి 2019-20 అసెస్మెంట్ సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించి విదేశాల్లోని అసెట్లను వెల్లడించక పోవడం ద్వారా అనిల్ అంబానీ పన్నులు ఎగవేశారని పేర్కొంది. ఆగస్టు 31లోగా అభియోగాలపై సమాధానమివ్వాలని సూచించింది. డైమండ్ ట్రస్ట్, నార్తర్న్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్లిమిటెడ్ (ఎన్‌ఏటీయూ) అనే రెండు విదేశీ సంస్థల కూపీ లాగితే వాటి అంతిమ లబ్ధిదారు అనిల్ అంబానీయేనని తేలినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి : అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు! -
మహిళా జడ్జీకి లాయర్ల బెదిరింపు
తిరువనంతపురం: కొందరు లాయర్లు తనను బెదిరించారంటూ ఓ మహిళా జడ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ నిందితుడి బెయిల్ రద్దు విషయమై మాట్లాడేందుకు తన చాంబర్‌కు వచ్చిన లాయర్లు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ దీపా మోహన్ లిఖిత పూర్వకంగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును పోలీసులకు పంపారు. దీనిపై స్పందించిన పోలీసులు తిరువనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తోపాటు 12 మందిపై దాడి, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాల కింద పలు కేసులు పెట్టారు. ‘ఒక నిందితుడి బెయిల్ రద్దు, రిమాండ్‌పై చర్చించేందుకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ జయచంద్రన్ మరికొందరితో కలిసి నా బాంబర్‌కు వచ్చారు. సదరు నిందితుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తారా లేదా అంటూ బెదిరించారు. మహిళ కాకపోయుంటే మిమ్మల్ని కొట్టి ఉండేవాళ్లం. బయటికి వస్తే అంతుచూస్తామంటూ జయచంద్రన్ వెళ్లిపోయారు’అని బాధిత జడ్జీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర జ్యుడీషియల్ అధికారుల సంఘం కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, మహిళా జడ్జీ ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ తిరువనంతపురం బార్ అసోసియేషన్ శుక్రవారం విధులు బహిష్కరించింది. -
వాట్సాప్‌లో ట్రిపుల్ తలాఖ్
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని ఓ మాస్టారు వాట్సాప్ కాల్లో ట్రిపుల్ తలాఖ్ చెప్పిన ఉదంతమిది. కాళ్లవేళ్ల పడి బతిమిలాడినా భర్త వినకపోవడంతో పాఠశాల ముందు బాధితురాలు «ధర్నాకు పూనుకుంది. వివరాలు... హైదరాబాద్ టోలీచౌకీ ఎండీ లైన్స్‌లో నివాసముండే మొహమ్మద్ ముజామిల్ (29), యూసుఫ్‌గూడకు చెందిన సుమయ్యబాను దంపతులు. గతేడాది జనవరి 6న వీరి వివాహం జరిగింది. వివాహ సమయంలో 10 లక్షల కట్నకానుకలు ముట్టజెప్పారు. అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహం జరిగిన నెల తర్వాత సుమయ్యబానును అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. భర్త కూడా తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. గతేడాది ఫిబ్రవరి 20న ముజామిల్ దంపతులకు కుమార్తె జన్మించింది. ఇంటికి వెళితే దాడులు.. సెప్టెంబర్‌లో ఆమె తన పాపతో కలసి టోలిచౌకీలోని అత్తారింటికి వెళ్లింది. అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని సూటిపోటీ మాటలనేవారు. కడుపు నిండా తిననివ్వకుండా ఆమె మీద భౌతికంగా దాడి చేయసాగారు. పాలు అందక పాప ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు నవంబర్ 11న వచ్చి తల్లిపిల్లను తీసుకెళ్లి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ట్రిపుల్ తలాఖ్ అంటూ విడాకులు.. భర్త, అత్తామామలు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరిది కూడా కట్నంకోసం వేధిస్తుండటంతో నవంబర్ 23న బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో భర్త, అత్తమామ, మరిదిలపై కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన ముజామిల్ నవంబర్ 28న ఆమెకు వాట్సాప్ కాల్ చేసి ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. పాపను చూసిన పాపాన పోలేదు: సుమయ్యబాను న్యాయం కావాలంటూ బాధితురాలు సుమయ్యబాను తన భర్త నిర్వహిస్తున్న పాఠశాల వద్ద సోదరుడు ఆదిల్‌ఖాన్‌తో కలసి ధర్నా చేసింది. అత్తింటివారు ఏనాడూ తన పాపను చూసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాఖ్ చెప్పిన తన భర్తలో మార్పు వస్తుందనే ఆశతో రోజూ ఫోన్ చేసి ప్రా«ధేయపడ్డానని చెప్పింది. తన భర్తకు వేరొకరితో ఉన్న అక్రమ సంబంధం గురించి నిలదీసిన నాటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది. -
ఆరోపణలు నిరూపిస్తే.. ఉరేసుకుంటా: సుమన్
సాక్షి, హైదరాబాద్: తన రాజకీయ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేక బురద జల్లుతున్నారని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. ఆరోపణలను రుజువు చేస్తే అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఉరేసుకుంటానని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంచిర్యాలకు చెందిన వారు తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారు కేసులు కూడా పెట్టా రని వెల్లడించారు. మహిళలపై గౌరవ మర్యాదలతో ఆరోపణలు చేస్తున్న వారిని బజారుకు ఈడ్చవద్దనే ఇప్పటిదాకా ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలిపారు. ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ఈ ప్రచారం తనపై మానసిక దాడిగా పరిగణిస్తున్నానని.. ఆరోపణలను నిరూపిస్తే అంబేడ్కర్ సాక్షిగా ప్రాణత్యాగానికి సిద్ధమని సుమన్ సవాల్ చేశారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలు అవాస్తవం
ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు అవాస్తవ మని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. వారు తనపై విమర్శలు చేసినా... మాట్లాడిన భాష హుందాగా ఉందని, మంత్రి జూపల్లి కృష్ణారావు వారిని చూసి నేర్చుకోవాలని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పంప్ హౌస్‌లలో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికే జూపల్లి తనను దుర్భాషలా డుతూ మాట్లాడారని, ఆయనకు తాను క్షమాపణ చెప్పే సమస్యే లేదన్నారు. దేవుడి మాన్యాలు కాజేసిన వారిని, బ్యాం కులు లూటీ చేసిన వారిని ఏమనాలో అవే వ్యాఖ్యలు తాను చేశాన న్నారు. గురు వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూపల్లి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయ డంవల్ల తాను కూడా విమర్శలు చేయా ల్సి వచ్చిందన్నారు. తాను చేసిన ఆరోప ణలపై బహిరంగ చర్చకు సవాల్ విసిరితే తోక ముడిచిన జూపల్లి.. ఇప్పుడు తనపై విమర్శలు చేయిస్తున్నారన్నారు. -
పొట్టకూటి కోసం వెళ్లి ఇరుక్కుపోయింది
-
నాపై విమర్శలు హేయం
ఆర్బీఐ గవర్నర్ రాజన్ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్... తనపై వస్తున్న ఆరోపణలను హేయమైనవిగా పేర్కొన్నారు. దురుద్దేశాలతో చేసిన ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. ఇలాంటి ఆరోపణల్ని తాను పట్టించుకోలేవటం లేదని స్పష్టంచేశారు. దేశం కోసం మూడేళ్లుగా తాను చేయాల్సిందంతా చేశానన్నారు. పరిష్కరించకుండా మిగిలిన అంశం... బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య మాత్రమేనన్నారు. పూర్తి సంతృప్తిగా, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహించిన తాను ఈ మేరకు సంతోషంగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్‌గా సెప్టెంబర్ 4వ తేదీన పదవీ విరమణ చేస్తున్న రాజన్ ఒక బిజినెస్ చానెల్‌తో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... పునర్నియామకంపై ఇలా... మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత, మరో మూడేళ్లు బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ చర్చల ప్రక్రియ ఏదీ ఒక పరిపక్వ దశకు రాలేదు. అయితే పునర్నియామకం గురించి కానీ, లేదా ప్రభుత్వంలో నా కెరియర్ విషయంపై కానీ నేనెప్పుడూ ఆందోళన చెందలేదు. మిగిలిన పని చాలా ఉందని నేను చెప్పాను. దీనర్థం మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమని కాదు. మంచి టీమ్ ప్లేయర్‌గా... నా పదవీ కాలంలో దేశం కోసం చేయాల్సిందంతా చేశాను. నేను ఈ విషయంలో ఒక అత్యుత్తమ టీమ్ ప్లేయర్‌ని. నేను చేపట్టిన పనిలో 90 నుంచి 95 శాతం పూర్తిచేశా. నా కార్యకలాపాల నిర్వహణలో పూర్తి స్వేచ్ఛగా ఉన్నా. ప్రభుత్వంతో పలు విషయాల్లో పోరాడాల్సి వచ్చిందన్న కొందరి భావన పూర్తి అవాస్తవం. గత ప్రభుత్వంతో, ప్రస్తుత ప్రభుత్వంలోని వ్యక్తులతో నాకు మంచి సంబంధాలున్నాయి. భవిష్యత్ గురించి... నేను పదేపదే చెప్పేదేమంటే, స్వభావ సిద్ధంగా నేను అధ్యాపకుడిని. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు ఒక పార్శ్వం మాత్రమే. పదవీ విరమణ తర్వాత ఏం చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. వ్యవస్థాగత సంస్కరణలు అవసరం దేశం పటిష్ట, సుస్థిర వృద్ధి సాధించడానికి వేదికగా వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. అలాగే నేను ద్రవ్యోల్బణంపై అధిక దృష్టి సారించానన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో నేను ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. ఇది చాలా కీలకమైన అంశం. దేశంలో డిమాండ్ వృద్ధి చెదంటానికి ద్రవ్యోల్బణం కట్టడి చాలా అవసరం. దీనిపై ఆర్బీఐ, ప్రభుత్వం అత్యధిక దృష్టి సారించాలి. -
బైక్ ఓవర్ టేక్ చేశాడని
-
హైటెక్ పెన్ వచ్చేసింది!
వర్చువల్ రియాల్టీ కెమెరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా సహజంగా దృశ్యాలను సాక్షాత్కరింపజేసే ఎన్నో ఆధునిక పరికరాలూ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే మనం అనుకున్న, కనిపించిన రంగును స్కాన్ చేసి తనలో నింపుకునే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ పెన్ ఇప్పుడు మనముందుకొచ్చేసింది. చిత్రకారులు, డిజైనర్లు తమకు కావలసిన రంగులను ఎలాంటి మిక్సింగ్ లేకుండానే రూపొందించుకొని, కాన్వాస్ పై కళారూపాలను చిత్రించే అవకాశం దగ్గరలోనే ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ పికింగ్ పెన్ అందుబాటులోకి వచ్చేసింది. కుంచె, రంగుల అవసరం లేకుండానే ప్రకృతి చిత్రాలను, కళారూపాలను ఆవిర్భవింపచేసే అవకాశం కనిపిస్తోంది. మనకు దగ్గరలో కనిపించిన ఏ వస్తువునైనా స్కాన్ చేసి, దాని రంగును తనలోకి తీసుకోగలిగే ఈ హైటెక్ పెన్ ఇప్పుడు కళాకారులకు సైతం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ పెన్ లో పొందుపరచిన కలర్ సెన్సార్, మైక్రో ప్రాసెసర్లు మనం అనుకున్న రంగులను గుర్తించి స్కాన్ చేస్తాయి. ఆకులు, పూలు, పళ్ళు వంటి రంగురంగుల ప్రకృతి దృశ్యాలతోపాటు ఎటువంటి వస్తువు పైన పెట్టినా.. పెన్ లోని సెన్సార్ ఆ వస్తువులోని రంగును స్కాన్ చేసి, అదే రంగును షేడ్ తో సహా మనకు అందిస్తుంది. చిత్రాన్ని స్కాన్ చేసుకున్న అనంతరం పిక్చర్ లోని కలర్ కు అనుగుణంగా పెన్ లోని స్మార్ట్ ఇంక్ కాట్రిజ్ రంగులను మార్చుకుంటుంది. ఈ కాట్రిజ్ లో ఉండే ఇంకుతో మైళ్ళకొద్దీ రాసేందుకు వీలవుతుందని సృష్టికర్తలు చెప్తున్నారు. అంతేకాదు ఈ స్క్రిబుల్ పెన్ ఇంక్.. నీటిని పీల్చదని, వెలిసిపోదని చెప్తున్నారు. ఈ స్మార్ట్ పెన్ కూడ రెండు రకాలుగా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని, ఒకటి.. నిజమైన ఇంకుతో పేపర్ మీద రాసుకునేందుకు వీలుగానూ, మరోటి చిత్రాలను స్కాన్ చేసి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో వాడుకునేందుకు గాను వీలుంటుందంటున్నారు. యూఎస్బీ కేబుల్ తో ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏడు గంటల పాటు పని చేస్తుందని చెప్తున్నారు. 249 డాలర్లతో అంటే సుమారు 17 వేల రూపాయలతో ఈ స్మార్ట్ పెన్ ను ఆన్ లైన్లో ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వెబ్ సైట్లో వివరించారు. -
అసభ్యంగా ప్రవర్తించిన ఆప్ ఎమ్మెల్యే..
న్యూఢిల్లీః నియోజకవర్గంలో నీటి సమస్యపై మాట్టాడేందుకు వచ్చిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేష్ మొహానియా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. స్థానిక నీటి సమస్యపై ఎమ్మెల్యేకు వివరించేందుకు కొద్ది రోజులుగా ఆయన ఆఫీస్ కు వెడుతున్న ఓ మహిళ... సదరు ఎమ్మెల్యే.. తనతోపాటు వచ్చిన మహిళలను సైతం నెట్టివేసి, అవమానించారని పేర్కొంది. మొహానియాపై కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ సంగమ్ విహార్ నియోజకవర్గం ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహానియా మహిళలతో ఆసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. తాను నీటి సమస్యపై మాట్లాడేందుకు తరచుగా ఆయన కార్యాలయానికి వెడుతున్నానని, అయినప్పటికీ కనీసం గుర్తు కూడ పట్టనట్లుగా చేసిన మొహానియా తనపై అసభ్యంగా ప్రవర్తించారని, తనతోపాటు వచ్చిన వారిని కూడ అక్కడినుంచీ నెట్టివేశారని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. నియోజకవర్గ ప్రజలన్న కనీస మర్యాదకూడ లేకుండా మొహానియా మహిళలపై దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించడం అన్యాయమని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సదరు మహిళ పోలీసులను డిమాండ్ చేసింది. మొహానియా కార్యాలయానికి వచ్చిన మహిళలందరినీ ఆయన బయటకు గెంటి అవమానించారని, అయితే తాము కూడ అదేతీరులో ప్రవర్తించాల్సి వచ్చిందని, కొడుతుంటే చేతులు కట్టుకొని కూర్చునేవారు ఎవరుంటారంటూ బాధితురాలు ప్రశ్నించింది? మొహానియా ప్రవర్తనపై విచారించి, ఆయన్ను వెంటనే ఆరెస్టు చేయడంతోపాటు, తమ ప్రాంతంలోని నీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వాపోయింది. -
పసి ప్రాణం ఖరీదు 5 లక్షలు!
♦ వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి ♦ మృతుడి తల్లిదండ్రుల ఆరోపణ ♦ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయింపు సంగారెడ్డి టౌన్: డబ్బు కోసం పసివాడి ప్రాణాలతో వైద్యులు ఆడుకున్నారు. ఇదేమని అడిగదితే రూ.5 లక్షల వెలకట్టారంటూ బాధితులు బోరున విలపించారు. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం తొగర్పల్లికి చెందిన బీ రాజు, లావణ్య దంపతుల కుమారుడు వర్శిత్ (6) వాంతులు చేసుకుంటుండటంతో గురువారం గాయత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ చక్రపాణి బాబును పరిశీలించి చికిత్స ప్రారంభించారు. ఆ తర్వాత హడావుడిగా అంబులెన్సును పిలిపించి, బాబుకు ఆక్సిజన్ పెట్టి హైదరాబాదుకు తీసుకెళ్లాలని చెప్పారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి డాక్టర్లు పరిశీలించి బాబు మృతిచెంది చాలా సేపైనట్టు వెల్లడించారు. డాక్టర్ చక్రపాణి నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడంటూ బాధితులు చిన్నారి మృతదేహంతో గాయత్రి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ముందే చికిత్స తమ వల్ల కాదని చెప్పి ఉంటే వేరే చోటకు తీసుకెళ్లే వారమని చిన్నారి బాబాయి శ్రీనివాస్ విలపించారు. తన అన్నకు ఈఎస్ఐ కార్డు ఉండటంతో డబ్బులు గుంజేందుకే వైద్యం చేస్తున్నట్టు నటించారని, ఇదేమని అడిగితే ఆస్పత్రి సిబ్బంది ఎదురుదాడికి దిగారని ఆయన ఆరోపించారు. కాగా, ఆసుపత్రి నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ కుమార్‌రాజ చిన్నారి ప్రాణానికి పరిహారంగా రూ.5 లక్షలిస్తామని బేరమాడారని బాధితులు ఆరోపించారు. కోర్టుకెళ్లండి: డాక్టర్ చక్రపాణి బాబుకు మెదడు వాపు వ్యాధి ఉందని, ప్రాథమిక చికిత్స అందించి ఆపై హైదరాబాదు తీసుకెళ్లాలని చెప్పామని గాయత్రి చిల్డ్రన్ నర్సింగ్ హోమ్ వైద్యుడు చక్రపాణి చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లే సరికి బాబు ప్రాణాలతోనే ఉన్నాడన్నారు. బాధితులు కోర్టుకెళ్లాలని, కోర్టు తీర్పు ప్రకారం పరిహారం చెల్లిస్తామని అన్నారు. -
మొదటిసారి బాల నేరస్థుడిపై కొత్త చట్టం అమలు?
జువనైల్ జస్టిస్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తొలిసారి ఓ టీనేజర్‌కు శిక్షపడే అవకాశం కనిపిస్తోంది. గత డిసెంబర్లో సవరించిన బిల్లులో జువనైల్ తీర్పుల విషయంలో 16 ఏళ్ల వయసును ప్రామాణికంగా పరిగణించారు. తీవ్రమైన నేరాలు చేసినప్పుడు ఆ వయసున్న వారిని కూడా పెద్దలుగానే భావించి శిక్ష విధించాలన్నది చట్టం ఉద్దేశం. అయితే ఇంతకుముందు ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసి.. చంపిన కేసులో హోంలో శిక్ష అనుభవిస్తూ.. మర్యాదపూర్వక ప్రవర్తనతో హోమ్ నుంచి విడుదలైన బాల నేరస్థుడు... తిరిగి ఓ వృద్ధ మహిళను హత్య చేశాడు. దీంతో అతడిపై కొత్త జువైనల్ చట్టం అమలు చేయాలని జువనైల్ జస్టిస్ బోర్డుకు పోలీసులు ఫిర్యాదుచేశారు. టీనేజర్‌ను పెద్దవాడిగానే ట్రీట్ చేయాలంటూ జువనైల్ జస్టిస్ బోర్డుకు ఢిల్లీ పోలీసులు అర్జీ పెట్టారు. అతడో మహిళను చంపి కరెక్షన్ హోం నుంచి విడుదలై తిరిగి మరో 13 ఏళ్ల బాలుడ్ని హత్య చేశాడని... అతడిని వయోజనుడిగా భావించాలని కోరారు. బాలుడు పదోతరగతి పరీక్షలు రాయాలంటూ తల్లిదండ్రులు బెయిల్ కు అభ్యర్థించడంతో గతనెలలో అతడి విడుదలకు హోం అంగీకరించింది. అనంతరం నిన్నఢిల్లీ బీకే గుప్తా కాలనీలోని ఓ వృద్ధ మహిళను హతమార్చిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసుల అభ్యర్థనను జువనైల్ జస్టిస్ బోర్డు అంగీకరిస్తే అతడు కొత్త చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. -
లోకాయుక్త పంజా
రాష్ట్ర వ్యాప్తంగా 23 చోట్ల ఏకకాలంలో సోదాలు రూ.7 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఆదాయం కన్నా 201 రెట్లు ఆస్తులున్న ఐఎఫ్ఎస్ అధికారి సాక్షి, బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్న ఏడుగురు ప్రభుత్వ అధికారులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లపై రాష్ట్ర లోకాయుక్త శుక్రవారం ఏకకాలంలో దాడులు చేసింది. బెల్గాం, చిక్కమగళూరు, దార్వాడ, గుల్బర్గా, తుమకూరు, యాదగిరి జిల్లాలో 23 చోట్ల సోదాలు చేపట్టింది. దాదాపు రూ.7 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్.ఎన్ సత్యనారాయణరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ స్థిర, చరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు నాలుగురెట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. వివరాలు... బెల్గాంలో ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇర్షద్ అహ్మద్ షంశుద్దీన్ కిత్తూర్ రూ.1.12 కోట్ల స్థిర, రూ. 63 లక్షల చరాస్తులను కలిగి ఉన్నారు. వీటి విలువ అతని ఆదాయం కంటే 247.78 శాతం అధికం. కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్, శివమొగ్గాలో డిప్యుటేషన్‌పై అ సిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈ హలెశెప్పా ఆదాయం కంటే 127 శాతం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. హుబ్లీలో హుబ్లీ-దార్వాడ డెవెలప్‌మెం ట్ అథారిటీలో మేనేజర్ పరమేశ్వర ప్ప హుచ్చప్పగౌడ విభూతి రూ.51, 73,000 విలువైన స్థిరాస్తులు, రూ.33, 49,610 విలువ జేసే చరాసు లు ఉన్నాయి. ఆదాయం కంటే 166 శా తం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. గుల్బర్గాలోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శరణప్ప బోవినకెరి ఆదాయం కంటే 171 రెట్ల ఆస్తులు కూడబెట్టారు. గుల్బర్గా, కర్ణాటక గృహమండలిలో ఆఫీస్ సూపరింటెండెంట్ శివపుట్టప్ప రూ.2.12 కోట్ల విలువైన స్థిర,చరాస్తులు కూడబెట్టారు. వీటి విలువ అతనికి వచ్చే ఆదాయంతో పోలిస్తే 146 రెట్లు ఎక్కువ. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ బెంగళూరులో మేనేజింగ్ డెరైక్టర్, ఐఎఫ్ఎస్ ర్యాంకు అధికారి ఏసీ కేశవమూర్తి రూ.1.39 కోట్ల స్థిరాస్తులు, రూ.2.86 కోట్ల విలువజేసే చరాస్తులను కూడబెట్టారు. వీటి విలువ అతని ఆదాయం కన్నా 201.53 రెట్లు అధికం. గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుభాష్ చంద్ర తనకు వచ్చే ఆదాయంతో పోలిస్తే 278 రెట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. -
మహిళా ఫోటో జర్నలిస్ట్ పై అత్యాచారం