
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని నలుగురు కలెక్టర్లపై డీవోపీటీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. నలుగురు కలెక్టర్లు ధరణి పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, అడ్డగోలుగా దోచుకుంటున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
‘‘సీఎం కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెడుతున్నారు. ఆధారాలు సేకరిస్తున్నాం త్వరలో బయటపెతాం. ఆ నలుగురు కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తున్నాం. ఆ కలెక్టర్లకే అన్ని పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ నివేదిక బయటపడితే మిగతా కలెక్టర్లు తలదించుకుంటారు’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, కలెక్టర్లకు సంబంధించిన అక్రమాలపై ఆధారాలను బండి సంజయ్ ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ నలుగురు కలెక్టరు ఎవరై ఉంటారని వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
చదవండి: మీరా మాకు నీతులు చెప్పేది? కేంద్రంపై హరీష్ రావు ఫైర్
Comments
Please login to add a commentAdd a comment