మౌన దీక్ష ఆనంతరం విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ధరణి అనే దరిద్రపుగొట్టు పోర్టల్ తెచ్చి ప్రజలను సీఎం కేసీఆర్ ఇబ్బందుల పాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. తన జన్మదినం సందర్భంగా ధరణి, పోడుభూముల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం ఆయన కరీంనగర్ లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మౌనదీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. సమస్యలున్న ప్రాంతాల్లో కుర్చీ వేసుకుని మరీ వాటిని పరిష్కరిస్తాననే కేసీఆర్ ప్రగల్భాలను ఎండగట్టేందుకే మౌనదీక్ష వేదికపై ‘మహారాజా కుర్చీ’ వేశామన్నారు. గతంలో ధరణి, పోడుభూముల సమస్యలను పరిష్కరిస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందో చెప్పాలని నిలదీశారు.
కేసీఆర్ నోరు తెరి స్తే అన్నీ అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. ఈ పోర్టల్‌తో ప్రశాంతంగా ఉన్న ఊళ్లలో చిచ్చురేపారని, భూము ల కబ్జాకే దీనిని తీసుకువచ్చారన్నారు. వేల కోట్ల రూపాయల భూములను సీఎం, ఆయన కుటుంబసభ్యుల పేరిట మార్పిడి చేసుకున్నారని, కాబట్టే.. ధరణిలో మార్పులకు ఆయన సిద్ధంగా లేరన్నారు.
50 శాతం మేర తప్పులతడక
15 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలు ధర ణి పోర్టల్‌లో నమోదు కాలేదని, నమోదైన వాటిలోనూ 50 శాతం మేర తప్పుల తడకలేనని సంజ య్ అన్నారు. నిన్నటిదాకా జర్నలిస్టులను కసురుకున్న కేసీఆర్.. ఇప్పుడు బతిమిలాడుకుంటున్నారంటే అది బీజేపీ పోరాట ఫలితమేన్నారు.
‘పోడు’పై మొన్న ఒకలా.. ఇప్పుడు మరోలా..
పోడుభూములు సాగు చేసుకోవాలని చెప్పేది కేసీఆరే.. తీరా పంటలు వేసుకున్నాక పోలీసులు, ఫారె స్ట్, రెవెన్యూ వాళ్లని పంపి కేసులు పెట్టించి, అరెస్టు చేయించేది కూడా ఆయనేనని సంజయ్ మండిపడ్డారు. ఇదేం తీరని ప్రశ్నించిన గిరిజన బాలింతలు, మహిళలపై దాడులు చేసి, చేతులకు బేడీలు వేసి జైలుకు పంపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ రాత్రిపూట ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చార ని, అదేమాట పగటిపూట అంటే అప్పుడు మాట్లాడుతామని ఎద్దేవా చేశారు. అనంతరం కార్యకర్తలు, నాయకుల మధ్య సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment