
(ఫైల్ ఫొటో)
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సమాజం చీదరించుకుని ఒడగొట్టిన కేసీఆర్‌కు బుద్ధిలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ కేసీఆర్.. నిస్సిగుగా అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్‌ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేందుకు సహకరించిందే కేసీఆర్. ఆఫ్ట్రాల్ ఏడు మండలాలు పోతే పోనీ అన్నాడు కేసీఆర్.
పెడితే పెళ్లి లేదంటే చావు కోరే వ్యక్తి కేసీఆర్. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి వినోద్ కుమార్. అయినా ఆయన్ని నిజయితీ పరుడు అంటూ ప్రచారం చేస్తున్నారు.కేసీఆర్‌పై సహారా, ఈఎస్‌ఐ కేసులు కూడా ఉన్నాయి. అందుకే నాడు కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్‌ని తొలగించారు. కనీసం పార్లమెంట్ కూడా రాకపోతే.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేసీఆర్ రాజీనామా చేయమన్నారు’ అని సంజయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment