
కరీంనగర్, సాక్షి: పార్టీకోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన కరీంనగర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
‘‘కేసీఆర్ దశ గ్రహ యాగాలు చేయాలి. కేసీఆరే ఓ దశమ గ్రహం. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం యాగాలు చేయాలి. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి.. బిడ్డ కోసం యాగాలు చేస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబంకు ఇక నోఎంట్రీ బోర్డే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను దృష్టి మరల్చడానికే హైడ్రా పేరుతో కూల్చివేతలు. బీజేపీలో చేరడానికి ఇంకా చాలా మంది సిద్దంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటులోనే బీజేపీ అత్యధిక సభ్యత్వం నమోదు కావాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment