
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతులు గడపదాటవని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు.ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌తో కలిసి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వేలకోట్ల అవినీతి డబ్బుతో నాయకులను, ప్రజలను కొనాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయ్యాక 88 వేల మంది రైతులు చనిపోయారని అన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచుకుంటున్నారని, హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment