టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆరోపణలు అవాస్తవం | MLA Vamsi Chand Reddy fired on trs mla's and mlc's | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆరోపణలు అవాస్తవం

Published Fri, Feb 17 2017 2:36 AM | Last Updated on Tue, Oct 30 2018 5:28 PM

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆరోపణలు అవాస్తవం - Sakshi

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆరోపణలు అవాస్తవం

ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: తనపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు అవాస్తవ మని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. వారు తనపై విమర్శలు చేసినా... మాట్లాడిన భాష హుందాగా ఉందని, మంత్రి జూపల్లి కృష్ణారావు వారిని చూసి నేర్చుకోవాలని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పంప్‌ హౌస్‌లలో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికే జూపల్లి తనను దుర్భాషలా డుతూ మాట్లాడారని, ఆయనకు తాను క్షమాపణ చెప్పే సమస్యే లేదన్నారు.

దేవుడి మాన్యాలు కాజేసిన వారిని, బ్యాం కులు లూటీ చేసిన వారిని ఏమనాలో అవే వ్యాఖ్యలు తాను చేశాన న్నారు. గురు వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూపల్లి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయ డంవల్ల తాను కూడా  విమర్శలు చేయా ల్సి వచ్చిందన్నారు. తాను చేసిన ఆరోప ణలపై బహిరంగ చర్చకు సవాల్‌ విసిరితే తోక ముడిచిన జూపల్లి.. ఇప్పుడు తనపై విమర్శలు చేయిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement