నీళ్లు తరలిస్తుంటే ఏం చేస్తున్నారు? | MLA Vamsi Chand comments on Minister JUPALLY | Sakshi
Sakshi News home page

నీళ్లు తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?

Published Sat, Dec 31 2016 12:25 AM | Last Updated on Tue, Oct 30 2018 5:28 PM

నీళ్లు తరలిస్తుంటే ఏం చేస్తున్నారు? - Sakshi

నీళ్లు తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?

జూపల్లికి ఎమ్మెల్యే వంశీచంద్‌ ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: కరువుతో అల్లాడు తున్న పాలమూరు జిల్లాకు నీరివ్వ కుండా డిండి రిజర్వాయరుకు నీళ్లు తీసుకుపోతుంటే జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. మీడియా పాయింట్‌ వద్ద శుక్రవారం  మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గం లోని 62వేల ఎకరాలకు నీళ్లు అంది స్తా మన్న టీఆర్‌ఎస్‌.. మోసం చేస్తోందన్నారు. 

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అడగ్గానే కల్వకుర్తి ఆయకట్టుకు నీరివ్వకుండా ఆయకట్టులో లేని డిండి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోతున్నారని ఆయన విమర్శిం చారు. ఈ విషయమై మంత్రి  జూపల్లి   కృష్ణారావు ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి జూపల్లికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా కోసం మాట్లాడాలని కోరారు. జూపల్లి అసమర్థత, చేతకాని తనంతోనే పాలమూరుకు మరోసారి అన్యాయం జరుగుతోందని వంశీచంద్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement