minister jupally
-
జూపల్లి వారసులపై సీబీ‘ఐ’
సాక్షి, హైదరాబాద్: వారిద్దరూ మంత్రి కుమారులు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను తమ పలుకుబడితో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కంపెనీలను ఏర్పాటు చేసి ఆ భూములను బ్యాంకుల్లో తనకా పెట్టారు. మార్కెట్ విలువ కన్నా నాలుగొంతులు అధిక విలువ చూపి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో స్టేట్ ఆఫ్ ఇండి యా నుంచి కోట్ల రుణాలు తీసుకొని కంపెనీల్లోకి మళ్లించారు. రుణాలు చెల్లించకపోవడంతో తన ఖా పెట్టిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాం కు అధికారులు సిద్ధమయ్యారు. అప్పుడే అసలు కథ బయటపడింది. తనఖా పెట్టిన ఆస్తులకు, తీసుకున్న రుణాలకు పొంతన లేకపోవడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుల ఈ ‘తనఖా’మాయాజాలంపై సీబీఐ రంగంలోకి దిగింది. అసలేం జరిగింది? మంత్రి జూపల్లి కుమారులు వరుణ్, అరుణ్ ఇద్దరూ వ్యాపార రంగంలో ఉన్నారు. 2011లో వారు శైలి ఇన్ఫ్రా లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ స్థాపించారు. దాన్ని 2015లో క్రిద్యా ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీదకు మార్చారు. ఈ కంపెనీ తీసుకున్న బ్యాంకు రుణాలకు జూపల్లి అరుణ్, వాసిరెడ్డి కిరణ్‌రెడ్డి హమీదారులుగా ఉన్నారు. అరుణ్.. అమీర్‌పేట్‌లోని రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్లోని మూడు ఫ్లాట్లు, గండిపేట కిస్మత్‌పూర్‌లోని 3.2 ఎకరాల భూమి, గగన్‌పహాడ్‌లోని ఇల్లును తనఖా పెట్టి 2015 నాటికి ఎస్బీఐ నుంచి రూ.64.80 కోట్ల రుణం పొందారు. వీటిని చెల్లించకపోవడంతో ఏడాదిన్నర క్రితం ఎస్బీఐ అరుణ్‌కు నోటీసులు ఇచ్చింది. 2016లో తనఖా పెట్టిన ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రకటన ఇచ్చింది. తనఖా పెట్టిన ఈ ఆస్తులను బ్యాంకు అధికారులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పరిశీలించగా రూ.7.75 కోట్లే ఉందని తేలింది. దీంతో బ్యాంకు అధికారులు నోరెళ్లబెట్టాల్సిన వచ్చింది. కంపెనీ కోసం తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి ఈ ఏడాది జనవరికల్లా రూ.86.30 కోట్లకు చేరింది. మార్కెట్ విలువలో గోల్మాల్ చేసి అరుణ్ బ్యాంకు రుణం పొందినట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. తనఖా పెట్టిన మొత్తం ఆస్తు ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.17.79 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఆస్తులను స్వాధీనం చేసుకున్నా బ్యాంకుకు రూ.68.50 కోట్ల నష్టం మిగలనుంది. గతేడాదే సీబీఐ నోటీసు బోగస్ పత్రాలతో కోట్లు రుణం పొందిన జూపల్లి వారసులపై సీబీఐ దృష్టి సారించింది. దీనిపై ప్రధాని కార్యాలయానికి ఇప్పటికే ఫిర్యాదు అంది నట్లు తెలిపింది. గత జూలై 28నే జూపల్లి అరుణ్‌కు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలంటూ గతేడాది ఆగస్టు 18న సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ సంజయ్ దూబే అరుణ్‌కు జారీ చేసిన నోటీసులో తెలిపారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూపల్లి అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, పూర్తి వివరాలను వెల్లడించలేమని ఢిల్లీలోని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదీ మాయాజాలం.. సాధారణంగా ఎవరైనా భూములు కొన్న సందర్భంలో మార్కెట్ విలువ కన్నా రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా చూపిస్తారు. కానీ జూపల్లి అరుణ్ మాత్రం రిజిస్ట్రేషన్ విలువను మార్కెట్ విలువ కన్నా అధికంగా చూపాడు. అదీగాకుండా తనఖా పెట్టిన ఆ భూమిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. కిస్మత్‌పూర్‌లోని 3.27 ఎకరాల భూమి మార్కెట్ విలువ ప్రకారం రూ.78.48 లక్షలుంంటే.. అరుణ్ దాని రిజిస్ట్రేషన్ విలువను రూ.3.30 కోట్లుగా చూపాడు. అలాగే గగన్‌పహాడ్‌లోని ఇల్లు మార్కెట్ విలువ ప్రకారం రూ.1.93 కోట్లు ఉంటే రిజిస్ట్రేషన్‌లో రూ.2.5 కోట్లుగా చూపించారు. -
వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్న జానా, ఉత్తమ్
సాక్షి, చౌటుప్పల్ (మునుగోడు): ప్రస్తుతం బీరాలు పలుకుతున్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. యాదాద్రి భువనగికి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి మరోసారి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఈ విషయాన్ని ఇప్పటికే జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం వెల్లడించాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. -
ఆ కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై), నాబార్డ్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే సదరు కాంట్రాక్టర్ల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాబార్డ్, పీఎంజీఎస్‌వై పనుల పురోగతిపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా జరుగుతున్న పనులు, జాప్యానికి గల కారణాలపై ఈఈ, ఎస్ఈలతో చర్చించారు. ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన పనులను పూర్తి చేయడం ద్వారా కేంద్రం నుంచి అదనంగా నిధులను పొందేందుకు వీలుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోను మార్చి 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 151 పనులకు టెండర్లు పూర్తి.. పీఎంజీఎస్‌వై కింద దాదాపు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని జూపల్లి వెల్లడించారు. ఇందులో రూ.300 కోట్ల విలువైన పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని, మిగిలిన పనులను కూడా జూన్ 30లోగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 154 పనులను పూర్తి చేసే లక్ష్యం రూపొందించుకున్నామని, ఇందులో 151 పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. -
నిధుల్లేక నీరసిస్తున్న స్థానిక సంస్థలు
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు పెట్టారు. దీంతో తాము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి సడక్ యోజన అమలు, ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పనులకు సంబంధించి సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.1,318 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.601 కోట్లే విడుదల చేశారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిధుల్లేక గ్రామ పంచాయతీలు బలహీనపడిపోతున్నాయని టీఆర్ఎస్ సభ్యుడు భూపాల్‌రెడ్డి చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాలుగు జిల్లా పరిషత్ సమావేశాలకు వెళ్లొస్తే వాస్తవం తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. సర్పంచులు, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వాపోయారు. 14వ ఆర్థిక సంఘంలో మార్పుల వల్ల నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు పోతున్నాయని, దీంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు రావట్లేదని టీఆర్ఎస్ సభ్యుడు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇస్తున్నట్లే జిల్లా పరిషత్‌లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని టీఆర్ఎస్ సభ్యుడు భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, పాత చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధికి త్వరలోనే సమగ్ర పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. 2015–17 కాలంలో స్థానిక సంస్థలకు రూ.1,146.94 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకే వెళ్తున్నాయని, మండల, జిల్లా పరిషత్‌లకు రావట్లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీ రహదారులు ఘోరంగా ఉన్నాయని షబ్బీర్ అలీ విమర్శించగా.. మంత్రి జూపల్లి బదులిస్తూ 20–30 ఏళ్లలో చేసిన దానికంటే ఒక్క ఏడాదిలోనే వేల కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర మంత్రులు జోక్యం చేసుకోవడంతో షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘సంబంధిత మంత్రికి జవాబు ఇవ్వడం రాదా? లేదా ఆయన శాఖ ఏమైనా మారిందా?’అంటూ విరుచుకుపడ్డారు. పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలి.. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) స్థానంలో పాత పద్ధతిని పునరుద్ధరించాలని టీఆర్ఎస్ సభ్యుడు జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగుల అభద్రతా భావంతో బతుకుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో తినుబండారాల ధరలు 6 నుంచి 10 రెట్లు అదనంగా ఉంటున్నాయని, వీటిని కట్టడి చేయాలని సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. చౌక దుకాణాల్లో బియ్యం తప్ప వేరే ఇవ్వడం లేదని, దీంతో వేలాది మంది డీలర్లకు కనీస కమీషన్లు కూడా రావట్లేదని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, గ్రూప్–1 ఫలితాలను నిలుపుదల చేయడంపై వాయి దా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని షబ్బీర్‌అలీ కోరగా.. మండలి చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించారు. ఉస్మానియా భూముల లీజుకు రూపాయా?: ప్రభాకర్‌రావు ఉస్మానియా వర్సిటీలో కొన్ని భూములను ఏడాదికి ఎకరం రూపాయికే లీజుకు ఇవ్వడంపై ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. కొందరికి ఎకరానికి రూపాయి, ఇంకొందరికి రూ.40, మరికొందరికి రూ.50 లక్షలకు లీజుకు ఇచ్చారని, వ్యత్యాసమెందుకు ఉందన్నారు. 24 ప్రభుత్వ, తదితర సంస్థలకు 187.5 ఎకరాలు లీజుకు ఇచ్చామని కడియం శ్రీహరి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 4 సంస్థలు లీజుకు అడగగా, వాటికి లీజు రేట్లను పెంచే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో పెట్రోల్ బంకుల టాయిలెట్లు పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి కె.తారకరామారావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో టాయిలెట్ల పరిస్థితిపై పలువురు అడిగిన ప్రశ్నలపై మంత్రి మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు ఉపయోగపడేలా వాటి యాజమాన్యాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రంలో 1,152 మంది అనాథ పిల్లలున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. అందులో 37 మందికి బీసీ–ఎ సర్టిఫికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు. సరైన స్థలంలోనే కలెక్టరేట్ల నిర్మాణం: తుమ్మల ప్రజామోదం లేకుండా ఎక్కడా కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండలిలో హామీ ఇచ్చారు. నిజామాబాద్ కలెక్టరేట్ కోసం అనువైన ప్రదేశం ఎంపిక చేయలేదని భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కలెక్టరేట్ల స్థలాల మంజూరుపై బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ మార్పుపై పొంగులేటì ప్రశ్నించారు. నిర్మల్‌లో కొండ మీద స్థలంపై విమర్శలు రావడంతో శంకుస్థాపన చేయలేదని తుమ్మల పేర్కొన్నారు. -
రెండేళ్లలో ఎల్ఈడీ కాంతులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంపిక చేసిన 60 మంది సర్పంచ్‌లకు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. 2019 మార్చి 31 నాటికి ప్రతి గ్రామానికి ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో 60 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామన్నారు. ఇందుకోసం కేంద్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఎఫ్‌ఎస్‌ఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ బల్బులు అమర్చడం వల్ల గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడదని, పెట్టుబడి లేకుండా పంచాయతీలు విద్యుత్ ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. థర్డ్ వైర్ సౌకర్యం ఉన్న పంచాయతీలు ముందుకు వస్తే ఈఎఫ్‌ఎస్‌ఎల్.. ఆయా గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. పంచాయతీలు సొంతంగా లేదా విద్యుత్ శాఖ ద్వారా లేదా 14వ ఫైనాన్స్ నిధుల నుంచి థర్డ్ వైర్ సౌకర్యం కల్పించుకోవచ్చన్నారు. 72 గంటల్లో పునరుద్ధరణ బల్బుల పనితీరును ఆన్లైన్ ద్వారా ఈఎఫ్‌ఎస్‌ఎల్ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వెలగని బల్బులను 72 గంటల్లో తిరిగి పునరుద్ధరిస్తారని, అలా పునరుద్ధరించకుంటే.. రోజుకి బల్బుకి రూ.5 చొప్పున పంచాయతీకి కంపెనీ చెల్లిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు సంస్థతో 5, 7, 10 ఏళ్లు ఒప్పందం కుదుర్చుకోవచ్చని తెలిపారు. ఒప్పందాన్ని బట్టి ఆదా అయిన డబ్బులో 80 శాతం సంస్థకు, 20 శాతం పంచాయతీకి దక్కుతుందన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు ఉపయోగించుకోవాలన్నారు. -
దేశానికే ఆదర్శంగా నైపుణ్య శిక్షణ
- తెలంగాణలో ఉపాధికి కొదవ లేదు - ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవంలో జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఉపాధి కల్పనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా 10 కోట్ల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని, వాటిని దక్కించుకునేందుకు నైపుణ్యం అవసరమన్నారు. శనివారం ఇక్కడి హైటెక్స్‌లోని నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవానికి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేర్పు తెలంగాణ ప్రజల సొంతమని... అవకాశాలను అందిపుచ్చుకునే నైపుణ్యం అలవర్చుకుంటే ఉపాధికి కొదవ లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప సంస్థలన్నీ తెలంగాణలో కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయని జూపల్లి చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలకు ఏ మాత్రం కొదవ లేదని... కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య పథకం కింద దాదాపు 18 వేల మంది యువతీ యువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించామన్నారు. గతేడాది నైపుణ్య శిక్షణలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని ఈసారి మొదటి స్థానంలో నిలిపేలా శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. మంజూరు చేసిన దానికి అదనంగా మరో 50 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలాగే ప్రతి జిల్లాలోనూ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉపాధి అవకాశాలు దక్కించుకున్న వెయ్యి మంది యువతీ యువకుల విజయగాథలతో రూపొందించిన పుస్తకాన్ని జూపల్లి ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం శిక్షణ కేంద్రాల నిర్వాహకులు, ఉపాధి కల్పించిన సంస్థల ప్రతినిధులకు మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ సీఈవో నీతూ ప్రసాద్ పాల్గొన్నారు. -
తెలంగాణ సెర్ప్‌కు జాతీయ పురస్కారం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంలో విశేష కృషి చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు జాతీయ పురస్కారం దక్కింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 4వ జాతీయ దివస్ ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో బుధవారం జరిగింది. బ్యాంకుల సహకారంతో గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు తెలంగాణ సెర్ప్‌కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు ను సెర్ప్ డైరెక్టర్ బాలయ్యకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అందజేశారు. రాష్ట్రాల మధ్య పోటీ తత్వాన్ని పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం వివిధ సంస్థలు, బ్యాంకులకు కేంద్రం అవార్డులు ఇస్తోంది. గత మూడేళ్లలో గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో అగ్రగామిగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. సెర్ప్ ద్వారా 32 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణకు ఈ అవార్డు దక్కడం పట్ల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. -
పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ‘ఆసరా’
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.200 పింఛన్ రావాలంటే ఇంకొకరి చావుకోసం ఎదురు చూడాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక మా ప్రభుత్వ హయాంలో చిన్నచిన్న అవసరాలకు ఎవర్నీ దేహీ అనకుండా ‘ఆసరా’పథకం నిరుపేద వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. మొత్తంగా మూడేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపింది’అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడేళ్లలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. 17ఏళ్ల తన రాజకీయ జీవితం 14ఏళ్ల పాటు అసంతృప్తితోనే గడిచిందని, గత మూడేళ్ల పాలనలోనే ఎంతో సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే ఇందుకు కారణమని చెప్పారు. ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో, నాడు చెప్పిన ప్రతి మాటను ఆచరణలో చూపి, చేతలకు, మాటలకు బేధం లేదని చెప్పగలిగామన్నారు. రూ.3,775 కోట్లతో గ్రామీణ రహదారులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,775 కోట్లతో గ్రామీణ రహదారులకు శ్రీకారం చుట్టిందని, గత మూడేళ్లలో 18,169 రహదారి పనులను పూర్తి చేశామని మంత్రి జూపల్లి తెలిపారు. మిగిలిపోయిన రహదారులను కూడా వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేస్తామన్నారు. దాదాపు 37లక్షలమందికి ఆసరా పథకం కింద నెలకు రూ.వెయ్యి చొప్పున అందజేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 4 (ఆదివారం) నుంచి 1.08 లక్షలమంది ఒంటరి మహిళలకు ఆర్థికభృతిని అందించనున్నామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా పేదవర్గాలకు ఏటా రూ.2,500 కోట్ల మేరకు పనులను కల్పిస్తూ దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. 2018 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ తెలంగాణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం ఉపాధిహామీ పథకం కిందనే చేపట్టామన్నారు. -
జాతీయ జెండాకు సెల్యూట్ చేయని కలెక్టర్
- తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన - చర్చనీయాంశమైన కలెక్టర్ వ్యవహారశైలి సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన జెండావిష్కరణలో సెల్యూట్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పతాకావిష్కరణ చేశారు. అనంతరం మంత్రితోపాటు ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజులు జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయగీతం ఆలపించారు. ఇదే వేదికపై ఉన్న కలెక్టర్ మాత్రం సెల్యూట్ చేయలేదు. గతంలో జనవరి 26 గణతంత్ర వేడుకల్లోనూ కలెక్టర్ ఇలాగే వ్యవహరించారు. అటెన్షన్లో ఉంటే చాలు: జాతీయజెండా అంటే తనకు గౌరవమని, సెల్యూట్ చేయాలన్న నిబంధనేమీ లేదని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. అయితే.. అటెన్షన్లో నిలబడితే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తనకు శిక్షణ సమయంలో చెప్పారని, అదే పాటిస్తున్నానని వివరించారు. యూనిఫామ్‌లో ఉన్న పోలీస్ సిబ్బంది మాత్రం తప్పనిసరిగా సెల్యూట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. త్రివిధ దళాల్లోని వారికి సెల్యూట్ తప్పనిసరి అని, తమకు అవసరం లేదన్నారు. -
ట్రాన్స్‌కో జీఎం ఇంటర్వ్యూకు సీఎం, మంత్రి పీఆర్వోల హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)లో జనరల్ మేనేజర్(కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టు భర్తీకి సోమవారం విద్యుత్ సౌథలో ఇంటర్వూ్యలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సమాచార, ప్రజాసంబంధాల శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస్‌రావుతో కూడిన ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ పీఆర్వో కె.విజయ్‌కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయ పీఆర్వో చెన్నమనేని కళ్యాణ్, ఏపీ ట్రాన్స్‌కో పీఆర్వో అబ్దుల్ బషీర్, సంగారెడ్డి డీపీఆర్వో యామిని, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. హ్యూమానిటీస్‌లో డిగ్రీ, జర్నలిజంలో పీజీ, న్యాయశాస్త్రంలో డిగ్రీలతో పాటు జర్నలిజంలో కనీసం 15 ఏళ్ల అనుభవంతో పాటు ప్రభుత్వ పీఆర్వోగా కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులని నిబంధన పెట్టడంతో ఐదుగురు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఫలితాన్ని మంగళవారం ప్రకటించే అవకాశముంది. -
ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు సస్పెండ్
జైపూర్: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగపూర్(ఎస్) గ్రామంలో బుధవారం ఉపాధి హామీపనులను పరిశీలించిన మంత్రి స్థానిక శ్రమశక్తి సంఘ సభ్యులతో ముఖాముఖీ చర్చలో పాల్గొని వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. 100 రోజులు పని కల్పించకపోవడంతో బాధ్యులైన వీఆర్వో సుదర్శన్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న, గ్రామ కార్యదర్శి రాజేష్‌లను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఉన్నారు. -
మే నెల నుంచి పోస్టాఫీసుల ద్వారానే ఆసరా
అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్లను వచ్చేనెల నుంచి పూర్తిగా పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఆసరా లబ్ధిదారులకు బయోమెట్రిక్ లేదా ఐరిస్ విధానం ద్వారానే ఇకపై పింఛన్ల పంపిణీ జరగాలని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోపే లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పోస్టాఫీసులోనూ ఐరిస్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని తపాలా అధికారులను మంత్రి కోరారు. కూలీలకు జాబ్ కార్డులు ఇప్పించడంతో పాటు, పెద్ద ఎత్తున పనులు చేపట్టేలా మహిళా సంఘాలు చొరవ చూపాలని, ఆయా సంఘాలను చైతన్య పరిచేందుకు వీవోఏలను వినియోగించుకోవాలని సూచించారు. -
‘కార్బైడ్’పై కయ్యం
- సమస్యలు పరిష్కరించాలంటూ వ్యాపారుల మెరుపు సమ్మె - గడ్డిఅన్నారం మార్కెట్లో ఆగిన మామిడి, బత్తాయి కొనుగోళ్లు - అవస్థలు పడిన రైతులు - చైర్మన్ హామీతో సద్దుమణిగిన వ్యాపారుల ఆందోళన హైదరాబాద్: కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తమ సమస్యల పరిష్కారానికి రైతు మెడపై కత్తిపెట్టి మెరుపు సమ్మెకు దిగారు. మామిడి, బత్తాయి కొనుగోళ్లు నిలిపివేసి పాలకవర్గం, అధికారులతో బేరసారాలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన మామిడి, బత్తాయి కొనుగోళ్లు నిలిపిపేయడంతో వివిధ జిల్లాల నుంచి తమ పంటను తెచ్చిన రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. అసలే మద్దతు ధరరాక నష్టాల పాలవుతున్నామని.. సమ్మెతో తమ బతుకులు మరింత అన్యాయమవుతాయని మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఒక వైపు రైతులు, మరోవైపు వ్యాపారుల ఆందోళనలతో సోమవారం మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి సమాచారం తెలుసుకుని వచ్చిన మార్కెట్ చైర్మన్ పుటం పురుషోత్తంరావు వ్యాపారులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం కానరాలేదు. దీంతో సుమారు 604 వాహనాల్లో మామిడి(3వేల టన్నుల మామిడి), 270 లోడుల బత్తాయి (400 టన్నులు) కొనుగోళ్లు ఆగాయి. వ్యాపారులపై చర్య తీసుకోవాలి: మంత్రి జూపల్లి కొనుగోళ్లు ఆపేయడంతో ఇబ్బందులు పడుతున్నామని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతులు కొందరు విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకురాగా హుటాహుటిన గడ్డిఅన్నారం మార్కెట్‌కు చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొనుగోళ్లు నిలిచిపోవడానికి దారి తీసిన పరిస్థితిపై మార్కెట్ ఎస్జీఎస్ ఎల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు సమ్మె చేయడాన్ని తప్పుపట్టారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని, అవసరమైతే రైతుల నష్టాన్ని వ్యాపారుల నుంచి వసూలు చేసి వారి లైసెన్సులు రద్దు చేయాలన్నారు. రైతులు నష్ట పోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపార సంఘ నాయకులతో అధికారుల సమావేశం వ్యాపార సంఘం నాయకులతో పురుషోత్తంరావు, మార్కెటింగ్, పోలీస్ అధికారులు చర్చించారు. కార్బైడ్ నిషేధించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో తాము నష్టపోతున్నామని, గతంలో రద్దుచేసిన లైసెన్సులను పునరుద్ధరించాలని, అద్దె బకాయిపై న్యాయం చేయాలని అసోసియేషన్ ప్రతి నిధులు తాజుద్దీన్, అశోక్‌లు డిమాండ్ చేశారు. సమస్యలపై సమ్మె నోటీసు ఇచ్చినా అధికారులు స్పందించటం లేదని అందుకే మెరుపు సమ్మె చేయడం జరిగిందన్నారు. నెలరోజుల్లోగా తమ పరిధిలో ఉన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తానని చైర్మన్ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెటింగ్ జేడీ రవికుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ మలిపెద్ది వెంకట్రామ్రెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. కొనుగోళ్లు ఆలస్యమైతే తీవ్రంగా నష్టపోతాం ఏడాదంతా శ్రమకోర్చి పండించిన పంటను 100 కిలోమీటర్లు రవాణా చేసి తీసుకొస్తే వ్యాపారులు కొనకపోతే తీవ్రంగా నష్టపోతాం. ఎండ వేడికి లారీల్లోని మామిడి పాడైపోయి మరింత నష్టపోతాం. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – పైలా యాదిరెడ్డి, రైతు, ఒలిగొండ, యాదగిరిగుట్ట జిల్లా వ్యాపారుల తీరు అన్యాయం అప్పులు చేసి వడ్డీలు కట్టి పంట పండిస్తే మార్కెట్లోకి వచ్చిన తరువాత వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. గత సంవత్సరం మామిడి కిలో 50 నుంచి 70 ధర పలకగా ఈఏడాది 25 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మూలంగా తీవ్ర అన్యాయం జరుగుతోంది. – సుగూర్ శాంతన్, రైతు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌జిల్లా -
పోస్టాఫీసుల ద్వారానే ‘ఆసరా’ పింఛన్లు
లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా సర్కారు చర్యలు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచి ‘ఆసరా’ పింఛన్లను పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 2,551 గ్రామాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోందని, మండలంలో ఉండే ఒక బ్యాంక్ వద్దకే అన్ని గ్రామాల నుంచి లబ్ధిదారులు రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలోనూ బయోమెట్రిక్ విధానంతో పింఛన్లను అందించాలని నిర్ణయించామన్నారు. పంచాయతీలకు సమీపంలో తండాల్లోని లబ్ధిదారులు కూడా వారి ఇంటివద్దనే పింఛన్ సొమ్ము అందుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో.. వేలి ముద్రలు సరిపోలని వారికి పంచాయతీ కార్యదర్శి ద్వారా పింఛన్ సొమ్మును అందజేశామని, అందులోనూ అవకతవకలు జరుగుతున్నందున, ఐరిస్ విధా నాన్ని అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం గోపులాపూర్‌లో ఓ వృద్ధురాలికి గత 4 నెలలుగా పింఛన్ సొమ్ము ఇవ్వకుండా, అక్రమాలకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు మంత్రి జూపల్లి పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధిహామీ పనులు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,618 కోట్ల పనులు జరిగాయని, గత 10 సంవత్సరాలతో పోల్చితే అత్యధికంగా ఉపాధిహామీ నిధులు ఖర్చు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పదేళ్లలో దాదాపు రూ.3,827 కోట్లు ఖర్చు చేయక పోవడంతో ఆ నిధులు మురిగి పోయాయన్నారు. 2017–18లో సుమారు రూ. వెయ్యికోట్ల మేర సిమెంట్ రహదారుల నిర్మాణానికి వెచ్చించాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పనికోరిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ద్వారానే జాబ్ కార్డు మంజూరు చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బాలరాజు, రామ్మోహన్‌రెడ్డి, రవికుమార్, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ భాస్కర్ తదితరులున్నారు. -
ప్రాజెక్టు డిజైన్ మార్పుపై చర్చకు సిద్ధమేనా!
మంత్రి జూపల్లికి వంశీచంద్ సవాల్ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌజు డిజైన్ మార్పులో అవినీతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగచర్చకు సిద్ధ మేనా అని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సవాల్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముడుపుల కోసమే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పంపుహౌజుల డిజైన్లు మారుస్తు న్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలకు అనుకూలంగా జూపల్లి పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై బహిరంగచర్చకు సిద్ధమని, మంత్రి తాను చేసిన వాదన తప్పు అని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తా అని సవాల్ చేశారు. మంత్రికి రూ.50 కోట్లు ముడుపులుగా ముట్టాయని ఆరోపించారు. -
కాంట్రాక్టర్లతో హరీశ్, జూపల్లి కుమ్మక్కు: నాగం
నాగర్‌కర్నూల్: భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావులు కాంట్రాక్టర్లతో కుమ్మ క్కయ్యారని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.శుక్రవారం నాగర్‌కర్నూల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం ప్రజాధనం వృథా చేస్తోందని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా 18 ప్యాకేజీలు ఉంటే నాలుగు ప్యాకేజీలు అర్హతలేని వారికి కట్ట బెట్టారని ఆరోపించారు. ఇవ్వలేదని నిరూ పిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పు కుంటానని నాగం సవాల్ విసిరారు. డబ్బు లకు కక్కుర్తి పడి హరీశ్, జూపల్లి స్వప్ర యోజనాల కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు ప్రాజెక్టుల పేరుతో చేసిన అవినీతి బాగోతంపై తన వద్దనున్న ఆధారాలతో నాగర్ కర్నూలులో ఎగ్జిబిషన్ పెడతానని చెప్పారు. -
జూపల్లి రాజీనామా చేయాలి: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కుదించడం ద్వారా ప్రభుత్వం రైతుల పొట్టగొడుతుంటే జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. కల్వకుర్తి నియోజకవర్గం ఎడారిగా మారుతున్నా ఏమీ చేయలేని జూపల్లి పదవిలో కొనసాగడం ద్వారా ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని శుక్రవారం విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై ప్రణాళికసంఘం వైస్‌చైర్మన్ నిరంజన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. -
కార్యదర్శులే గ్రామాలకు కలెక్టర్లు
పంచాయతీ సెక్రటరీల సదస్సులో స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: జిల్లాలకు కలెక్టర్లు లానే.. గ్రామ పంచాయతీలకు కార్యదర్శులే స్థానిక కలెక్టర్లని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ (టీసీపార్డ్)లో ఆదివారం జరిగిన టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల సదస్సులో స్వామి గౌడ్ ప్రసంగించారు. గ్రామాలకు సర్పంచ్‌లు ముఖ్యమంత్రులైతే, వార్డు మెంబర్లు మంత్రు ల్లాంటి వారన్నారు. గ్రామాల అభివృద్ధికి వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత కార్యదర్శు లపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యదర్శు లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ శాఖకు జూపల్లి కృష్ణా రావు లాంటి సమర్థు డైన మంత్రి ఉన్నా రని, సమస్యల వద్దకే ఆయనే వెళ్లి పరిష్కరి స్తారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణతోనే వారికి నివాళి.. తెలంగాణ కోసం అమరులైన వారి ఆకాంక్షల ను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉంద ని, బంగారు తెలంగాణ సాధనే అమరులకు అసలైన నివాళి అని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని, అందరం సంఘటితంగా పనిచేసి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలని కోరారు. కష్టపడి కాకుండా ఇష్ట పడి పనిచేస్తేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు సులువుగా అధిగమించగలమన్నారు. ఇప్ప టికే టీఎస్ఐపాస్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయవంటి కార్యక్రమాలతో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, పంచాయతీ రాజ్ శాఖనూ ఆదర్శంగా నిలిపేందుకు కార్యదర్శులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. 2018 అక్టోబర్ 2నాటికి తెలంగాణను వంద శాతం బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా మార్చడంలో కార్యదర్శులు కీలకం గా వ్యవహరించాలన్నారు. గ్రామ కార్యద ర్శులను రేషనలైజేషన్ చేయడం ద్వారా పనిభారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి జూపల్లి చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం రూపొం దించిన నూతన సంవత్సర డైరీని, కేలండర్‌ను జూపల్లి, స్వామిగౌడ్ ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాదరావు, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, పంచాయతీ కార్యద ర్శుల సంఘం ప్రతినిధులు పర్వతాలు, శేషు, రాజేందర్, రామకృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ రికార్డులన్నీ ఇకపై ఆన్లైన్లోనే..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై డీపీవోలతో మంత్రి జూపల్లి సమీక్ష హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలను కంప్యూటరీకరించాలని పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్)లో శుక్ర వారం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఆస్తులు, పన్నుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్‌కు, డీపీవోలకు సూచించారు. 5వేల గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాల న్నారు. ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర సమాచా రంతో డేటా బ్యాంక్ నిర్వహించాలని సూచించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి. ఉపాధిహామీ కింద మంజూరైన గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా సర్పంచ్‌లను సమాయత్తం చేయాలని డీపీవోలను మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది గాంధీ జయంతిలోగా రాష్ట్రాన్ని 100% బహిరంగ మలవిసర్జన లేకుండా మార్చా లని, అన్ని గ్రామాల్లోనూ 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా కృషిచేయాలని అధికా రులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరి తగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పంచా యతీ సిబ్బందిని హేతుబద్ధీకరించడంతో పాటుగా ఇతర శాఖలకు డిప్యూటేషన్లనూ నిలిపివేశామని కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తెలిపారు. క్లష్టర్ గ్రామాల నుంచి సేకరించిన వివరాలను కమిషనరేట్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించారు. -
నీళ్లు తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?
జూపల్లికి ఎమ్మెల్యే వంశీచంద్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: కరువుతో అల్లాడు తున్న పాలమూరు జిల్లాకు నీరివ్వ కుండా డిండి రిజర్వాయరుకు నీళ్లు తీసుకుపోతుంటే జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గం లోని 62వేల ఎకరాలకు నీళ్లు అంది స్తా మన్న టీఆర్ఎస్.. మోసం చేస్తోందన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అడగ్గానే కల్వకుర్తి ఆయకట్టుకు నీరివ్వకుండా ఆయకట్టులో లేని డిండి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోతున్నారని ఆయన విమర్శిం చారు. ఈ విషయమై మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి జూపల్లికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా కోసం మాట్లాడాలని కోరారు. జూపల్లి అసమర్థత, చేతకాని తనంతోనే పాలమూరుకు మరోసారి అన్యాయం జరుగుతోందని వంశీచంద్ విమర్శించారు. -
పంచాయతీరాజ్‌లో పూర్తి నగదురహితం
జనవరి 10 నుంచి అమలు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో వచ్చేనెల పదో తేదీ నాటికి వంద శాతం నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇందుకు బ్యాంకర్లు, పోస్టల్ అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో వంద శాతం నగదు రహిత లావాదేవీల అమలుపై బుధవారం సచివాలయంలో బ్యాంకర్లు, పోస్టల్ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ రాష్ట్రంలో ప్రతినెల 35.96 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఇందులో 17.81 లక్షల పింఛన్లు పోస్టాఫీస్ ద్వారా, 13.63 లక్షల పింఛన్లు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నామన్నారు. మరో 4.52 లక్షల లబ్ధిదారులకు నేరుగా నగదు ఇస్తున్నామన్నారు. వీరికి ఈ నెలాఖర్లోగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో బ్యాంకు రెండు గ్రామాలను దత్తత తీసుకుని, ఈ నెల 31లోగా అందరికీ ఖాతా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. జనవరి పదిలోగా ఖాతాలను ఆధార్‌తో సీడింగ్ చేసి రూపే కార్డులు ఇవ్వాలన్నారు. ఇకపై ఆసరా పింఛన్‌దారులు, ఉపాధిహామీ కూలీలకు వచ్చేనెల పదినుంచి పూర్తిగా బయోమెట్రిక్ పద్ధతిలో డబ్బులు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. గ్రామ పంచాయతీల్లో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలని బ్యాంకర్లకు సూచించారు. -
పంచాయతీలకు వసూళ్లే వసూళ్లు
- వారంలో రూ.32.08 కోట్ల ఆస్తి పన్ను వసూలు - 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపు సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటుకు గ్రామ పంచాయతీల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో రూ.32,08,29,499 పన్ను వసూలైంది. వారం రోజుల్లో ఆస్తి పన్ను వసూలు తీరు పరిశీలిస్తే.. 11న అత్యధికంగా రూ.8.16 కోట్లు, శుక్రవారం రూ.2.45 కోట్ల పన్ను వసూలు జరిగింది. 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపులు జరిగాయి. కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.8.38కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.4.96 కోట్ల పన్ను వసూలైంది. సంగారెడ్డి జిల్లాలో రూ.2.54 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.1.75 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.1.32 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.1.23 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1.21 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.1.10 కోట్లు, నల్లగొండ జిల్లాలో రూ.1.07 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 10 వరకు రూ.73.50 కోట్ల ఆస్తి పన్ను వసూలవగా, వారం రోజుల్లోనే రూ.32.08 కోట్లు వసూలవడం గమనార్హం. ఈ నెల 24 వరకు పాత నోట్లతో పన్ను చెల్లించేందుకు ఉన్న వెసులుబాటును గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని బకారుులు చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. గ్రామాల్లో అన్ని కుటుంబాలు ఆస్తిపన్ను చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
బెల్ట్ షాపులు బంద్ పెట్టేదెప్పుడు?
• స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశంలో మంత్రి జూపల్లిని ప్రశ్నించిన మహిళలు • వీధికో బెల్ట్ షాపుంటే మా బతుకులెట్లా బాగుపడతారుు? సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాగానే బెల్ట్‌షాపులు బంద్ పెడ్తామన్నారు. గ్రామ్ర గామాన వీధికో షాపులెక్కన వెలిసినయ్. బెల్ట్ షాపులను సర్కారు బంద్ పెట్టకుంటే మా బతుకులెట్లా బాగుపడతాయ్ సారూ..’’ అంటూ మహిళలు మంత్రి జూపల్లి కృష్ణా రావును నిలదీశారు. మంగళవారం హైదరా బాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘స్త్రీనిధి’ బ్యాంకు రెండో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సాధికా రత కోసం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం సలహాలు, సూచనలివ్వాలని మంత్రి కోరారు. దీంతో పలువురు మహిళలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, స్త్రీనిధి బ్యాంకు అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపారు. నల్లగొండ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుమలత బెల్ట్ షాపుల అంశంపై నిలదీశారు. వడ్డీ రీరుుంబర్స్ ఏది? వడ్డీ లేని రుణాల (వీఎల్ఆర్) పథకం కింద తీసుకున్న రుణాలతో పాటు తాము చెల్లించిన వడ్డీని 11 నెలలైనా ప్రభుత్వం రీరుుంబర్స్ చేయలేదని సమావేశంలో జయశంకర్ జిల్లాకు చెందిన ఫర్హానాబేగం నిలదీశారు. ఏడాదిగా అభయహస్తం పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి చెప్పాలని వరంగల్ జిల్లా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు ప్రకాశమ్మ పట్టుబట్టారు.జిల్లాకో కలెక్టర్‌ను నియమించినపుడు స్త్రీనిధి బ్యాంక్‌లో రెండేసి జిల్లాలకు ఒక్కో డెరైక్టర్‌ను ఏర్పాటు చేస్తామ నడం సరికాదని సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళలు ఆక్షేపించారు. గ్రామ సమాఖ్యలకు ఇచ్చిన విధంగానే పట్టణ సమాఖ్యలకు కూడా వ్యాపారాలకు, పరిశ్రమల స్థాపనలకు రుణా లివ్వాలని సరూర్‌నగర్‌కు చెందిన పద్మ స్త్రీనిధి బ్యాంకు అధికారులకు సూచించారు. రుణ ప్రణాళికకు ఆమోదం... ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని పాలకమండలి చేసిన ప్రతిపాదనకు స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొత్తం రుణ ప్రణాళికలో రూ.1,450 కోట్లు సెర్ప్ ద్వారా, రూ.15 కోట్లు మెప్మా ద్వారా పంపిణీ చేయాలని నిర్ణరుుంచారు. నికరలాభం రూ.18.54 కోట్లలో ఒకశాతం విద్యానిధికి, ఒకశాతం స్వంత భవనాల ఏర్పాటుకు వెచ్చించాలని సమావేశం నిర్ణరుుంచింది. సిబ్బందికి 30 శాతం వేతనపెంపు, సెర్ప్ నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకోవడం, ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ వర్తింపు తదితర అంశాలను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. గ్రామాల్లో బ్యాంకుల తరపున మహిళా సమాఖ్యల సభ్యులు బిజినెస్ కరస్పెండెంట్లుగా పనిచేసే విధంగా బ్యాంక్ నియమావళిలో సవరణలు చేసేం దుకు ఆమోదం లభించింది. సమావేశంలో బ్యాంక్ పాలకమండలి అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి కమల, కోశాధికారి స్వరూప, ఎండీ జీవీఎస్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, సెర్ప్ సీఈవో నీతూకు మారి ప్రసాద్, డెరైక్టర్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంగళ్ రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికే అప్పుఇచ్చే స్థారుుకి చేరాలి: జూపల్లి స్త్రీనిధి బ్యాంక్ ఆదాయం ఏటా పెరుగుతుండడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యాంకు మూలధనంలో ప్రభుత్వ వాటా కంటే మహిళా సమాఖ్యల వాటానే ఎక్కువగా ఉందని, అవసరమైతే ప్రభుత్వానికీ అప్పు ఇవ్వగలిగే స్థారుుకి స్త్రీనిధి బ్యాంక్ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళలు కోరిన విధంగా రాష్ట్రంలో బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ పెరిగిందని చెప్పారు. అభయహస్తం పింఛన్లు, వడ్డీలేని రుణాల విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త జిల్లాలకు డెరైక్టర్ల ఎన్నికలను నెలరోజుల్లో పూర్తి చేయాలని స్త్రీనిధి బ్యాంక్ అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. -
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా అన్నివర్గాల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారు(డీఆర్డీవో)లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల నేపథ్యం లో నూతనంగా నియమితులైన డీఆర్డీవోలకు డీఆర్డీఏ, డ్వామా వంటి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాన్ని జూపల్లి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దరికి సంక్షేమ ఫలాలను చేర్చడమే చిన్న జిల్లాల ఏర్పాటు లక్ష్యమన్నారు. గ్రామాలు స్వయంసమృద్ధిని సాధించే విధం గా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి అన్ని జిల్లాల్లో అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డీఆర్డీవోలను ఆదేశించారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు మహిళా, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా, నూతన పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల ద్వారా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా మారిందని మంత్రి చెప్పారు. కొన్నేళ్లుగా నిస్తేజంగా మారిన మహిళా సంఘాలను సంఘటిత శక్తిగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఆర్డీవోలను ఆదేశించారు. 60 శాతం కుటుంబాలకు ఉపాధి ప్రతి గ్రామంలో కనీసం 60 శాతం కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జూపల్లి ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై కరపత్రాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, కూలీ లకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలని సూచించారు. -
గ్రూపు రాజకీయాలకు జూపల్లి ఆజ్యం
మాజీ ఎంపీ మందా జగన్నాథం ధ్వజం ఇటిక్యాల: అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నాగర్‌కర్నూ ల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం కొండేరులో ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అలంపూర్‌లో గ్రూపులను ఏర్పాటు చేసి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని, ఇక్కడ దళితులు పార్టీ ఇన్చార్జిలుగా ఉండటం ఆయనకు ఇష్టంలేదన్నారు. పార్టీకి చెందని నాయకులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులను అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రక్రియను టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు అడ్డుకోవడంతో జీర్ణించుకోలేక రాజీనామాల పేరిట తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అలంపూర్ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉంటే తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలని డిమాండ్ చేశారు.