సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)లో జనరల్ మేనేజర్(కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టు భర్తీకి సోమవారం విద్యుత్ సౌథలో ఇంటర్వూ్యలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సమాచార, ప్రజాసంబంధాల శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస్‌రావుతో కూడిన ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది.
ఈ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ పీఆర్వో కె.విజయ్‌కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయ పీఆర్వో చెన్నమనేని కళ్యాణ్, ఏపీ ట్రాన్స్‌కో పీఆర్వో అబ్దుల్ బషీర్, సంగారెడ్డి డీపీఆర్వో యామిని, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. హ్యూమానిటీస్‌లో డిగ్రీ, జర్నలిజంలో పీజీ, న్యాయశాస్త్రంలో డిగ్రీలతో పాటు జర్నలిజంలో కనీసం 15 ఏళ్ల అనుభవంతో పాటు ప్రభుత్వ పీఆర్వోగా కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులని నిబంధన పెట్టడంతో ఐదుగురు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఫలితాన్ని మంగళవారం ప్రకటించే అవకాశముంది.
ట్రాన్స్‌కో జీఎం ఇంటర్వ్యూకు సీఎం, మంత్రి పీఆర్వోల హాజరు
Published Tue, May 9 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
Advertisement
Advertisement