మొక్కలు నాటి నీళ్లుపోస్తున్న మంత్రి జూపల్లి
అలంపూర్‌రూరల్: బంగారు తెలంగాణ ఆవిర్భవించాలంటే గ్రామగ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. శనివారం టీఆర్‌ఎస్ తాలూకా ఇన్‌చార్జ్ మంద శ్రీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన హరితహారం కార్యక్రమమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్టాండ్, కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున కదలివచ్చి చెట్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందజగన్నాథం, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మల్లికార్జున్, తహసీల్దార్ మంజుల, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ టి.నారాయణరెడ్డి, సర్పంచ్ జయరాముడు, స్థానిక ఎస్‌ఐలు పర్వతాలు, గిరీష్‌కుమార్, టీఆర్‌ఎస్‌అధ్యక్షుడు మహేష్‌గౌడ్, నాయకులు విక్రమ్‌సేనారెడ్డి,ఆత్మలింగారెడ్డి, వడ్డేపల్లి శ్రీనివాసులు ఉన్నారు.