ఆ ముగ్గురూ మూర్ఖులే! | Minister JUPALLY fires on jaipal, REVANTH, NAGAM | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురూ మూర్ఖులే!

Published Sat, Aug 6 2016 1:55 AM | Last Updated on Fri, Oct 19 2018 7:27 PM

ఆ ముగ్గురూ మూర్ఖులే! - Sakshi

ఆ ముగ్గురూ మూర్ఖులే!

జైపాల్, రేవంత్, నాగంపై మంత్రి జూపల్లి ధ్వజం
కల్వకుర్తి: ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేయడం తగదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.

పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ముగ్గురూ మూర్ఖులుగా వ్యవహరిస్తూ అడుగడుగునా అడ్డం పడుతున్నారన్నారు. రైతులకు అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లిస్తున్నా.. కావాలనే కుట్రపూరితంగా ఆటంకాలు సృష్టిస్తూ పగటి వేషగాళ్ల వలే వ్యవహరిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement