spreading rumors
-
వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’ గోల
-
బీజేపీ అబద్ధాలను వ్యాపింపజేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పేమైనా ఉందా అని సిక్కులను ప్రశ్నించారు. ఎలాంటి భయాలు లేకుండా ప్రతీ ఒక్క భారతీయుడు నచి్చన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ భారత్‌లో ఉండకూడదా? అని రాహుల్ అన్నారు. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే బీజేపీ తన నోరు మూయించేందుకు విఫలయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటిలాగే బీజేపీ అబద్ధాలను ఆశ్రయిస్తోంది. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక నిరాశతో నా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్‌ను నిర్వచించే విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ.. గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను’ అని రాహల్ పేర్కొన్నారు. అమెరికాలో సిక్కును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. -
భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్
కాశ్మీర్‌లోని పత్రికా స్వేచ్ఛ గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాగూర్ ఫైర్ అయ్యారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్ కావాలనే తప్పుడు అభిప్రాయాలను ప్రచురిస్తోందన్నారు. భారత్ ప్రజాస్వామ్య విలువలపై బురద జల్లే ప్రయత్నం అని మంత్రి ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు సమాచార మంత్రి అనురాగ్ ట్వీట్లో.."ఈ న్యూయర్క్ టైమ్స్ తోపాటు ఇతర కొన్ని లింక్‌లలో విదేశీ మీడియా భారతదేశం గురించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీ గురించి అసత్య ప్రచారాలను చేస్తోంది ఇలాంటి అబద్ధాలు ఎక్కువ కాలం కొనసాగ లేవు. భారత్‌పై పగ పెంచుకున్న కొన్ని విదేశీ మీడియాలు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. భారత్‌లో పత్రిక స్వేచ్ఛకు ఇతర ప్రాథమిక హక్కుల వలే దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భారతదేశ ప్రజలు చాలా పరిణితి చెందినవారు. అలాంటి వాటిని అస్సలు అనుమతించరు. కాశ్మీర్‌లోని పత్రిక స్వేచ్ఛపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం పచ్చి అబద్ధం, ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. అయినా భారత గడ్డపై విదేశీ మీడియా తమ నిర్ణయాత్మక అజెండాను అమలు చేయాలని చూస్తోందని, దీన్ని భారతీయలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమతించరు. అని నొక్కి చెప్పారు (చదవండి: వామ్మో ఇదేం ఆచారం రా బాబు! అక్కడ అల్లుడిని గాడిదపై కూర్చొబెట్టి..) -
కేంద్రం కొరడా.. 22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం.. వాటి లక్ష్యమదే!
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. దేశ భద్రత, జాతీయ సమగ్రత, విదేశీ సంబంధాలకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో 22 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిషేధించింది. ఇందులో 18 భారతీయ, 4 పాకిస్థాన్‌కు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్లలో మొత్తం వ్యూయర్షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. సంబంధిత యూట్యూబ్ చానళ్లు టెలివిజన్ లోగోలు, యాంక్లరను ఉపయోగించి, తప్పుడు థంబ్‌నెల్స్‌తో వీక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రం తెలిపింది. ఐటీ రూల్స్ 2021ను ఉల్లంఘించిన కారణంతో తొలిసారిగా 18 యూట్యూబ్ చానెళ్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. వీటితోపాటు మూడు ట్విటర్ అకౌంట్లు, ఒక ఫేస్బుక్ అకౌంట్లను బ్లాక్ చేసింది. ఈ చానళ్లు భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్ వివాదం వంటి అంశాలపై సామాజిక మధ్యమాల ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే.. అంతేగాక ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొన్ని భారతీయ యూట్యూబ్ ఛానెల్‌లు తప్పుడు కంటెంట్‌ను పబ్లిష్ చేస్తున్నారని, ఇవన్నీ ఇతర దేశాలతో భారత్‌కున్న విదేశీ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపింది. ఇవి పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. నిఘా వర్గాల సహకారంతో సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: Viral Video: మండుటెండలో కోతి దాహం తీర్చిన పోలీస్.. ‘హ్యాట్సాఫ్ సార్’ -
ఆ ముగ్గురూ మూర్ఖులే!
జైపాల్, రేవంత్, నాగంపై మంత్రి జూపల్లి ధ్వజం కల్వకుర్తి: ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేయడం తగదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ముగ్గురూ మూర్ఖులుగా వ్యవహరిస్తూ అడుగడుగునా అడ్డం పడుతున్నారన్నారు. రైతులకు అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లిస్తున్నా.. కావాలనే కుట్రపూరితంగా ఆటంకాలు సృష్టిస్తూ పగటి వేషగాళ్ల వలే వ్యవహరిస్తున్నారన్నారు. -
అఖిలపక్షం తరవాతే మెట్రో మార్గం ఖరారు
హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి మెట్రో ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు మెట్రోకు కరెంటు కష్టాల్లేవు, ఉద్యోగాలపై అసత్య ప్రచారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరమే మారిన మెట్రోరైలు మార్గా న్ని ఖరారు చేయనున్నట్లు హెచ్ఎంఆర్ (హైదరాబాద్ మెట్రోరైల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్త అలైన్మెంట్తో సుల్తాన్‌బజార్, అసెంబ్లీ వద్ద మెట్రో మార్గంలో పెద్దగా దూరం పెరగలేదన్నారు. జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2)లో అదనంగా 3.2 కి.మీ దూరం పెరిగిందన్నారు. సోమవారం హెచ్ఎంఆర్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అలైన్మెంట్ మార్పుతో అవసరమైన ఆస్తుల సేకరణ, పెరిగే అంచనా వ్యయం పై స్వతంత్ర ఇంజనీరింగ్ ఏజెన్సీ లూయిస్ బెర్జర్ సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందన్నారు. తాజా మార్పుతో ఆస్తులు కోల్పోయే వారికి 2012 భూసేకరణ-పునరావాస చట్టం ప్రకారం పరిహార మిస్తామన్నారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో వికలాంగులకు వసతులు కల్పిస్తామన్నారు. మెట్రోకు తొలగిన అడ్డంకులు బేగంపేట్ గ్రీన్‌ల్యాండ్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రో పనులపై ఉన్న స్టేను ఇటీవలే హైకోర్టు తొల గించిందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు కరెంట్ కష్టాలు లేవని స్పష్టంచేశారు. ఉప్ప ల్, మియాపూర్ మెట్రో డిపోల్లో ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్రో ప్రా జెక్టుకు అన్నిరకాల అడ్డంకులు తొలగినట్లేనని తెలి పారు. మొత్తం 72 కి.మీ.కి గాను 40 కి.మీ. మార్గంలో పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని, 3 కారిడార్లలో 2,800 పిల్లర్లకుగాను 1,525 పిల్లర్ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. పిల్లర్లపై వయాడక్ట్ సెగ్మెంట్ల అమరిక 30 కి.మీ. పూర్తయిందన్నారు. నాగోల్-మెట్టుగూడ (8 కి.మీ)మార్గంలో స్టేషన్ల నిర్మాణం తుదిదశకు చేరుకుందన్నారు. ముంబై, ఢిల్లీ కంటే ఆధునిక కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం (సీబీటీసీ) సాంకేతికత ఆధారంగా మెట్రో రైళ్ల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. ఇందులో డ్రైవర్‌లెస్ టెక్నాలజీ ఉంటుందని, ఉప్పల్‌లోని కంట్రోల్ కేంద్రం ద్వారా 2 నిమిషాలకోమారు ఒకదాని వెనక మరొకటి వెళ్లేలా మెట్రో రైళ్ల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్లలో ఉద్యోగాలిప్పిస్తామంటూ సోషల్ మీడియా, వెబ్సైట్లలో జరుగుతున్న అసత్యప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రస్తుతానికి ఉద్యోగాల భర్తీ లేదని ఆయన స్పష్టంచేశారు. నేడు వికలాంగుల అవగాహన నడక ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హెచ్ఎంఆర్, వికలాంగుల హక్కుల వేదికల ఆధ్వర్యంలో మంగళవారం వికలాంగుల అవగాహన నడకను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఉదయం 7కి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పీపుల్స్‌ప్లాజా వరకు నడక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమా న్ని స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభిస్తారన్నారు.