కాంట్రాక్టర్లతో హరీశ్, జూపల్లి కుమ్మక్కు: నాగం | Nagam comments on Harsih rao and Jupally | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లతో హరీశ్, జూపల్లి కుమ్మక్కు: నాగం

Published Sat, Feb 11 2017 3:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కాంట్రాక్టర్లతో హరీశ్, జూపల్లి కుమ్మక్కు: నాగం - Sakshi

కాంట్రాక్టర్లతో హరీశ్, జూపల్లి కుమ్మక్కు: నాగం

నాగర్‌కర్నూల్‌: భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావులు కాంట్రాక్టర్లతో కుమ్మ క్కయ్యారని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.శుక్రవారం నాగర్‌కర్నూల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ  ప్రాజెక్టుల పేరుతో  ప్రభుత్వం ప్రజాధనం వృథా చేస్తోందని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా 18 ప్యాకేజీలు ఉంటే నాలుగు ప్యాకేజీలు అర్హతలేని వారికి కట్ట బెట్టారని ఆరోపించారు.

ఇవ్వలేదని నిరూ పిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పు కుంటానని నాగం సవాల్‌ విసిరారు. డబ్బు లకు కక్కుర్తి పడి హరీశ్, జూపల్లి స్వప్ర యోజనాల కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు ప్రాజెక్టుల పేరుతో చేసిన అవినీతి బాగోతంపై తన వద్దనున్న ఆధారాలతో నాగర్‌ కర్నూలులో ఎగ్జిబిషన్‌ పెడతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement