‘ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు’
పాలమూరులో వలసలు వెళ్లిన వారు తిరిగి రావడంతోనే నాగంకు ఆక్రోశం వస్తుందని హరీశ్ రావు అన్నారు. నాగం పాలమూరు ప్రజల ఉసురు తీసుకుంటున్నాడని, మతి కూడా భ్రమించిందని, బీజేపీలో ఆయన తన స్థానమేమిటో తెలుసుకోవాలని సూచించారు. గొర్రెల కొనుగోలులో అవినీతి గురించి మాట్లాడుతున్న నాగం నేతి బీరకాయాలో నెయ్యి లాంటి వాడని పోల్చి చెప్పారు. గొల్ల కురుమలు బెస్త గంగ పుత్రులను నాగం అవమానించారని అన్నారు.
ఒక వేళ బీజేపీ వైఖరి ఇదే అయితే లక్ష్మణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాగం, పందులు నక్కలు కుక్కల భాష మాట్లాడి బీసీలను అవమానించారని, బీసీ అయిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్..నాగం వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని కోరారు. కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు తమ నెత్తిన పాలు పోశాయని, తెలంగాణ ద్రోహుల పార్టీతో కాంగ్రెస్ పొత్తు తమకే లాభమన్నారు. అయినా పొత్తులు ఆయా పార్టీల ఇష్టమని అన్నారు.