భూ కుంభకోణాలపై నాగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చోటుచేసు కున్న వివిధ భూ కుంభకోణాలపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సూచించారు. ఈ అంశంపై తాము హైకోర్టును ఆశ్రయిం చనున్నట్లు తెలిపారు. మియాపూర్, ఇతర స్కాంలపై ఇంకా సీబీసీఐడీ నివేదిక ఇవ్వ కముందే సీఎం కేసీఆర్, ఒక్క గజం అన్యాక్రాంతం కాలేదని ఏ విధంగా తమకు తాము క్లీన్‌చిట్ ఇచ్చుకుంటారని ప్రశ్నించారు.
సోమవారం ఆయన పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ... అన్ని పత్రాలూ చూసే భూమి కొన్నామని చెప్పిన ఎంపీ కె.కేశవరావు ఆ తర్వాత ఆ ఒప్పం దాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి నంత మాత్రాన సమస్య పరిష్కారమై నట్లేనా? ఆయనపై ఏ చర్యా తీసుకోరా అని నాగం ప్రశ్నించారు.
హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి
Published Tue, Jun 20 2017 2:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM
Advertisement