గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి సరైన వివరాలు తెలుపకపోవడంతో.. ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించారు.
గద్వాల్ (మహబూబ్‌నగర్) : గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి సరైన వివరాలు తెలుపకపోవడంతో.. ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ మండలంలోని జమ్మిచేడ్ వద్ద జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో శనివారం జరిగింది.
గ్రామజ్యోతి కార్యక్రమానికి వెళ్లిన పౌర సరఫరాల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుకు గ్రామానికి సంబంధించి సరైన వివరాలు తెలపకపోవడంతో ఆగ్రహం చెందిన ఆయన వెంటనే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు గౌడ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.