వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్న జానా, ఉత్తమ్‌ | uttam, jana defeat next election | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్న జానా, ఉత్తమ్‌

Published Wed, Dec 27 2017 6:45 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

uttam, jana defeat next election

సాక్షి, చౌటుప్పల్‌ (మునుగోడు): ప్రస్తుతం బీరాలు పలుకుతున్న  సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. యాదాద్రి భువనగికి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీనే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఈ విషయాన్ని ఇప్పటికే జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం వెల్లడించాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా మంచినీరు అందిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement