
ఆ రెండు పార్టీలు చెంపలేసుకోవాలి: జూపల్లి
హైదరాబాద్: తమ హయాంలో ప్రజలకు చేసిన అన్యాయాలకు, పాపాలకు కాంగ్రెస్, టీడీపీలు రెండు చెంపలు వేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన పాపాలను కడిగేసుకోవడానికి వారికి ఒక జీవితకాలం సరిపోదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశ ంలో మంత్రి మాట్లాడారు.
మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పోడియం వద్దకు వచ్చి ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కులం పేరుతో దూషించడం వల్లే గొడవ జరిగిందని జూపల్లి వివరించారు. ఈ సంఘటనను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఏపీ సీఎం విదేశీ పర్యటనలకు రూ.22 కోట్లు వెచ్చించడంపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.