అమెజాన్ ద్వారా ఆన్‌లైన్ విక్రయాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులకు ఆన్‌లైన్ ట్రేడింగ్ సదుపాయం కల్పించడం ద్వారా కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ ఆన్‌లైన్ విక్రయ సంస్థ అమెజాన్ ద్వారా ‘టెస్కో’ ఉత్పత్తుల విక్రయాలను ఆప్కోహౌస్‌లో శుక్రవారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోచంపల్లి, నారాయణ్‌పేట్, గద్వాల్ తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు తయా రుచేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ప్రదర్శించడం వలన మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయన్నారు.
దళారుల ప్రమేయం తగ్గడం ద్వారా, రాష్ట్రంలోని 1.20లక్షల మంది కార్మికుల ఉత్పత్తులకు మంచి డిమాండూ వస్తుందన్నారు. టెస్కో ఉత్పత్తుల కోసం ‘షాప్.తెలంగాణఫ్యాబ్రిక్స్.కాం’ వెబ్‌సైట్ సందర్శిం చవచ్చన్నారు. హస్తకళల విక్రయాల కోసం ఇటీవల ప్రారంభించిన ఆన్‌లైన్‌ట్రేడింగ్ సత్ఫలితాలనిస్తుంద న్నారు. ఆధునిక ఉత్పత్తులు తయారు చేసేలా చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హ్యాండ్లూమ్స్ విభాగం డెరైక్టర్ ప్రీతీమీనా, జాయింట్ ఎండీ సైదా, టెస్కో జీఎం యాదగరి పాల్గొన్నారు.
చేనేత ఉత్పత్తులకు ఆన్‌లైన్ ట్రేడింగ్
Published Sat, Mar 19 2016 3:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM
Advertisement
Advertisement