ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు సస్పెండ్
Published Wed, May 3 2017 1:50 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
జైపూర్: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగపూర్(ఎస్) గ్రామంలో బుధవారం ఉపాధి హామీపనులను పరిశీలించిన మంత్రి స్థానిక శ్రమశక్తి సంఘ సభ్యులతో ముఖాముఖీ చర్చలో పాల్గొని వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. 100 రోజులు పని కల్పించకపోవడంతో బాధ్యులైన వీఆర్వో సుదర్శన్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న, గ్రామ కార్యదర్శి రాజేష్‌లను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఉన్నారు.
Advertisement