ఈజీఎస్ పనులు శాశ్వతంగా ఉంటాయి
కలెక్టర్ వాకాటి కరుణ
ఉపాధిహామీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు పంపిణీ
హన్మకొండ అర్బన్l: జిల్లాల విభజన జరిగి ఉద్యోగులు ప్రాంతాలుగా విyì పోయినా ఉపాధి హామీ పనులు మా త్రం శాశ్వతంగా ఉంటాయని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. కాజీపేట దర్గారోడ్డులోని డ్వామా కార్యాల యంలో శుక్రవారం 380 మంది ఈజీఎస్ ఉద్యోగులకు ఆమె హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 30వేల ఫారం పాండ్స్ నిర్మాణాలు లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివ కు 13వేలు పూర్తయ్యాయన్నారు. నవం బర్ వరకు ఫాంపాండ్స్ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అలాగే వాటి నిర్మాణాలతో లబ్ధి పొందుతున్న వారి వివరాలు వారంలో అందజేయాలన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన బచ్చన్నపేట ఏపీఓ మల్లేశం కుటుంబ సభ్యులకు కార్యాలయం ఉద్యోగులు సేకరించిన రూ. 50 వేలు, ఏపీఓల సంఘం నుంచి సేకరించిన రూ. 36 వేలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కాగా, ఇ టీవల రాష్ట్రస్థాయి హరితహారం అవార్డు అందుకున్న ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, ఏపీడీలు, ఏపీఓలు పాల్గొన్నారు.