
అన్ని స్థానాల్లో దూసుకెళ్లిన కారు
20 20
► ఊహకందని రీతిలో ఓటర్ల తీర్పు
► ప్రతిపక్షంలేని నగర పంచాయతీ
► కంగుతిన్న విపక్షాల ఐక్యకూటమి
► ఫలించిన మంత్రి జూపల్లి వ్యూహం
అచ్చంపేట మండల రిసోర్సు భవనంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. మొదటిరౌండ్ లెక్కింపు ప్రారంభం.. కాసేపట్లోనే ఒకటవ వార్డు ఫలితం వెల్లడి.. టీఆర్‌ఎస్ గెలిచిందని అధికారిక ప్రకటన. ఆ తర్వాత రెండో వార్డు, మూడో వార్డు, నాలుగో వార్డు.. ఇలా 20 వార్డుల వరకు ఒకటే ప్రకటన..అదే టీఆర్‌ఎస్ విజయం.. గులాబీ శ్రేణులు ఉరిమే ఉత్సాహం..బాణసంచా పేలుళ్లు.. మరోవైపు విపక్షాలకు ఎటూ పాలుపోని పరిస్థితి.. ఇదీ..అచ్చంపేటలో బుధవారం కౌంటింగ్ కేంద్రం వద్ద కనిపించిన దృశ్యాలు. అచ్చంపేట ‘నగర’వాసుల విలక్షణ తీర్పు విపక్షాల దిమ్మతిరిగేలా చేసింది.. ఊహించనిరీతిలో కారు యమస్పీడ్‌తో దూసుకెళ్లింది. నగర పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది.
అచ్చంపేట : అచ్చంపేట మండల రి సో ర్సు భవనంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. మొదటిరౌండ్ లె క్కింపు ప్రారంభం..కాసేపట్లోనే ఒకటవ వార్డు ఫలితం వెల్లడి.. టీఆర్‌ఎస్ గెలి చిం దని అధికారిక ప్రకటన. ఆ తర్వాత రెం డో వార్డు, మూడో వార్డు, నాలుగో వార్డు ఇలా 20 వార్డుల వరకు ఒకటే ప్రకట న..అదే టీఆర్‌ఎస్ విజయం.. గులాబీ శ్రేణులు ఉరిమే ఉత్సాహం.. విపక్షాలకు ఎటూ పాలుపోని పరిస్థితి.. అచ్చంపేట ‘నగర’వాసుల విలక్షణ తీర్పు విపక్షాల దిమ్మతిరిగేలా చేసింది.. ఊహిం చని రీతిలో కారు యమస్పీడ్‌తో దూసుకెళ్లిం ది. నగర పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అన్నిరౌండ్లలోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యమే కనిపించింది.
ఐక్య కూటమి ఎత్తులను చిత్తుచేస్తూ..
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఐక్యకూటమి ఎ త్తులను చిత్తుచేస్తూ అధికారపార్టీ అలవోకగా విజయం సాధించింది. పట్టణంలో ని 20వార్డులకు అన్నివార్డుల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అచ్చం పేట మండల రిసోర్సు భవనంలో భారీ బందోబస్తు మధ్య బుధవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రా రంభమైంది.
అచ్చంపేటలో 18,614 మంది ఓటర్లు ఉండగా ఈనెల6న జరి గిన పోలింగ్‌లో 13,193మంది తమ ఓ టుహక్కును వినియోగించుకున్నారు. మ రో 85మంది ఓటర్లు నోటాకు ఓటువేశా రు. 20 వార్డుల పరిధిలోని 20 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఐదు రౌండ్లలోనే పూర్తయింది. ఓటర్ల వి లక్షణ తీర్పును చూసి విపక్షాల కూటమి నాయకులు కంగుతిన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 20, కాంగ్రెస్ 13, టీడీపీ 4, బీ జేపీ 3వార్డుల్లో పోటీచేయగా స్వతంత్రులు17మంది ఎన్నికల బరిలో నిలిచారు.
ఆ మూడువార్డుల్లోనే పోటాపోటీ!
ఒకటో వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఎం.యాదయ్య టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంతుకు గట్టి పోటీఇచ్చారు. 8, 9, 14 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఐక్యకూటమి గట్టిపోటీ ఇచ్చారు. అతితక్కువగా 8వ వార్డులో 32, 9లో 33, 14లో 68 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. 4వ వార్డులో సుల్తాన్‌బీ 431ఓట్లు, 10వ వార్డులో జి.శివ 401ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 3వ వార్డులో చైర్మన్ అభ్యర్థి కె.తులసీరాం 279ఓట్ల మెజార్టీ విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్‌కు రెండురోజుల ముందే మారిన రాజకీయ సమీకరణలు టీఆర్‌ఎస్ గెలుపునకు బాటలు వేశాయని ప్రచారం జరుగుతోంది. కాగా, కొన్నివార్డులో స్వతంత్రులుగా పోటీలో నిలిచిన అభ్యర్థులను బరిలో నుంచి తప్పించి టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం కూడా కలిసొచ్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నా మినేషన్లు వేసింది మొదలుకుని అ చ్చంపేటలోనే మకాంవేసి వ్యూహాత్మకం గా వ్యవరించారు. సొంత సర్వేలు, ఇం టలిజెన్సీ నివేదికలు మొదలుకుని అ న్నింటినీ తమకు అనుకూలంగా మలుచుకుని టీఆర్‌ఎస్ గెలుపుకోసం శ్రమించారు.
నోటా ఓటు వినియోగించుకున్న ఓటర్లు
కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరణ ఓటు అవకాశం కల్పించింది. బరిలో ఉన్న అభ్యర్థులు తమకు ఎవరు నచ్చలేదని చెప్పేందుకు ఈవీఎంల్లో నోటా బటన్‌ను ఏర్పాటుచేసింది. నగరపంచాయతీ ఎన్నికల్లో 85మంది ఈ బటన్‌ను ఉపయోగించుకున్నారు. వార్డులో పోటీచేసిన అభ్యర్థులు తమకు నచ్చలేదని ఈ ఓటు ద్వారా తెలియజేశారు.