
సాక్షి, హైదరాబాద్: తన రాజకీయ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేక బురద జల్లుతున్నారని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. ఆరోపణలను రుజువు చేస్తే అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఉరేసుకుంటానని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మంచిర్యాలకు చెందిన వారు తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారు కేసులు కూడా పెట్టా రని వెల్లడించారు. మహిళలపై గౌరవ మర్యాదలతో ఆరోపణలు చేస్తున్న వారిని బజారుకు ఈడ్చవద్దనే ఇప్పటిదాకా ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలిపారు. ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ఈ ప్రచారం తనపై మానసిక దాడిగా పరిగణిస్తున్నానని.. ఆరోపణలను నిరూపిస్తే అంబేడ్కర్ సాక్షిగా ప్రాణత్యాగానికి సిద్ధమని సుమన్ సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment