Man Allegedly Harasses Karnataka College Student, Beaten With Slippers: Viral Video - Sakshi
Sakshi News home page

వెంబడించి వేధించడంతో..పోకిరిని చెప్పుతో కాలేజీ విద్యార్థిని..

Published Sat, Jun 10 2023 10:02 AM | Last Updated on Sat, Jun 10 2023 10:27 AM

 Karnataka College Student Beaten With Slippers Man Allegedly Harasses - Sakshi

కాలేజీ నుంచి హాస్టల్‌కి వెళ్తున్న విద్యార్థిని ఓ వ్యక్తి వెంటపడి వేధించడం ప్రారంభించాడు. ఓపిక నశించిన ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చెప్పుతో ఎడాపెడా వాయించింది. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థిని హాస్టల్‌ నుంచి కాలేజికి వెళ్తుండగా ఓ యువకుడు ఆమె వెంటపడి వేధించడం ప్రారంభించాడు.

దీంతో ఆమె కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె అందరి ముందే అతడి చెంప చెల్లుమనిపించింది. తన కాలికి ఉన్న చెప్పుతో అతడి ముఖంపై ఎడాపెడా వాయించి తన కోపం తీర్చుకుంది. ఇక ఆ యువకుడు చేసేదేం లేక చూస్తు కూర్చున్నాడు. తనను వదిలేయమని ప్రాథేయపడ్డాడు. అయితే స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నజీర్‌గా గుర్తించారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో అవుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. 

(చదవండి: అదుపుతప్పి..వాహనాలపైకి దూసుకెళ్లి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement