బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖమంత్రి మధు బంగారప్ప తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రికి కన్నడ రాదని ఓ విద్యార్ధి వ్యాఖ్యానించడంతో ఆయన సీరియస్ అయ్యారు. విద్యార్ధి మాటలను మూర్ఖత్వంగా పేర్కొంటూ.. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.. అసలేం జరిగిందంటే
కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహిక విద్యార్ధులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించే ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో సుమారు 25,000 మంది విద్యార్థులకు ఈ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మధు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. విద్యామంత్రికి కన్నడ రాదు అని అన్నారు. దీనిపై మంత్రి వెంటనే స్పందిస్తూ.. ‘ఏంటి నేను ఏమైనా ఉర్ధూలో మాట్లాడుతున్నానా? టీవీ ఆన్ చేసి చూడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సదరు విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hadn't Madhu Bangarappa publicly admitted that he doesn't know Kannada?? Why is the @INCKarnataka punishing the student who reminded him of this?? What are they trying to achieve here ?? What else can be expected of hopeless Congress??
ತನಗೆ ಕನ್ನಡ ಸರಿಯಾಗಿ ಬರುವುದಿಲ್ಲ ಎಂದು ಈ ಹಿಂದೆ… pic.twitter.com/FPXnFGExqy— Pralhad Joshi (@JoshiPralhad) November 21, 2024
ఇక మంత్రి ప్రవర్తనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కర్నాటక బీజేపీ అధికారిక ఎక్స్‌లో మంత్రిని ఓ విద్యార్థి ప్రశ్న అడిగే కార్టూన్‌ను పోస్ట్ చేసింది. మంత్రి విద్యార్థులను బోల్డ్ ప్రశ్నలు అడగమని చెబుతున్న ఫోటోకు ‘ప్రశ్నించేవారిని తెలివితక్కువవాడిగా పిలుస్తుంది మీరే’ అని సూచించే క్యాప్షన్‌ను పేర్కొంది.
ಅವಿದ್ಯಾಮಂತ್ರಿ @Madhu_Bangarapp ಅವರೆ,
ಜ್ಞಾನ ದೇಗುಲವಿದು ಧೈರ್ಯವಾಗಿ ಪ್ರಶ್ನಿಸು ಅಂತ ಹೇಳೋರು ನೀವೇ..!! ಪ್ರಶ್ನಿಸಿದವರನ್ನು ಸ್ಟುಪಿಡ್ ಅಂತ ಕರೆಯುವವರು ನೀವೇ..!!#DictatorCongress #UneducatedMinister pic.twitter.com/3ZY5kp3QB2— BJP Karnataka (@BJP4Karnataka) November 21, 2024
కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి, ఎంపీ ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో స్పందిస్తూ.. మధు బంగారప్ప తనకు కన్నడ రాదని బహిరంగంగా ఒప్పుకోలేదా? ఈ విషయాన్ని గుర్తు చేసిన విద్యార్థిని కర్ణాటక కాంగ్రెస్ ఎందుకు శిక్షిస్తోంది? వారు ఇక్కడ ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారు ? ఆశలేని కాంగ్రెస్ నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment