Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’ | Viral video: Drunk Man Harasses Women Beaten With Slippers | Sakshi
Sakshi News home page

Viral Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’

Published Fri, Dec 30 2022 3:43 PM | Last Updated on Fri, Dec 30 2022 4:28 PM

Viral video: Drunk Man Harasses Women Beaten With Slippers - Sakshi

బెంగళూరు: రోడ్లు, బస్సులు, రైళ్లల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు, యువతులు మహిళలు అనే తేడా లేకుండా పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఓ మహిళ మందుబాబును ఊరికే వదలకుండా అందరి ముందే బడిత పూజ చేసింది.

ధార్వాడ్‌ జిల్లాలో ఫుల్గా‌ తాగిన ఓ వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్న మహిళలను అడ్డగించి వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. అంతేగాక వారి ఫోన్‌ నెంబర్లు అడుగుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన ఓ మహిళ అతడిని పట్టుకొని ఏకంగా చెప్పుతో కొట్టింది. నడి రోడ్డుపై కూర్చొబెట్టి అతడి తల, ముఖంపై దాడి చేసింది.  అందరూ చూస్తుండగానే అతడి ముఖాన్ని పచ్చడి చేసింది.

చట్టు పక్కల ఉన్నవారు సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. మహిళ పిచ్చి పిచ్చిగా కొడుతున్నా.. సదరు వ్యక్తి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిని స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement