- తల్లిదండ్రుల ఆందోళన
- ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు
నాచారం: నాచారం ఈఎస్‌ఐ వైద్యుల నిర్లక్ష్యంతో ఐదు నెలల చిన్నారి తమకు దూరమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...నాచారం ఇందిరానగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, శైలజ దంపతులకు ఐదు నెలల క్రితం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పాప(సహస్ర) జన్మించింది. సహస్ర వారం రోజులుగా అస్వస్థతతకు గురికావడంతో సోమవారం నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు చిన్నారిని పరిశీలించి ఆమె ఆరోగ్యం క్షీణిం చిందని ఐసీయూలోకి మార్చారు. వివిధ రకాల పరీ క్షలు చేశారు.
అనంతరం విధులకువచ్చిన వైద్యుడు పాప ఆరోగ్యం బాగానే ఉందంటూ జనరల్ వార్డ్‌కు పంపించారు. ఆ తరువాత అర గంటకు ఆ చిన్నారి ఆ రోగ్యం మరింత క్షీణించింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు అక్కడి నర్సులకు తెలిపారు. దీంతో ఓ నర్స్ డా క్టర్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. చిన్నారికి ఏ చికిత్స చేయాలో ఫోన్‌లోనే వారికి తెలిపారు. బుధవా రం తెల్లవారుజామున పాప ఆరోగ్యం మరింత క్షీణించడంతో లోటస్ ఆస్పత్రికిపంపుతున్నామని తల్లిదండ్రులకు తెలిపారు.
అనంతరం ఓ ఇంజక్షన్ ఇచ్చారు. ఇం జక్షన్ ఇచ్చిన అరగంటకే చిన్నారి తుదిశ్వాస విడిచింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలను బలిగొందని, ఇం జక్షన్ వికటించి చిట్టి తల్లి మృతి చెందిందని ఆందోళన చేశారు. చిన్నారి మృతి చెందగానే ఆమెకు చికిత్స చేసి న వైద్యులు ఆస్పత్రి నుంచివెళ్లిపోయారని ఆరోపిం చారు. ఈమేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్ దేశ్‌పాండే వద్దకు వెళ్లి, పసిపాప మరణానికి కారణమైన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎంఎస్ విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు.