అనకాపల్లి, సాక్షి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. వివిధ అనారోగ్య సమస్యలో ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్స నిమిత్తం వైద్యులు మంగళవారం రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్లు ఇచ్చారు.
ఆ ఇంజక్షన్‌లు తీసుకున్న 17 మంది కొద్ది సేపటికే వాంతులు, వణుకుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా అస్పత్రికి తరలించారు.
వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బాధితులంతా నక్కపల్లి జానకయ్యే పేట, వెదుళ్ల పాలెం, తిమ్మాపురం డి ఎల్ పురం, ఉపమాక్ తదితర గ్రామాలకి చెందిన వారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment