Government Hospitals
-
నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. ఇంజక్షన్ వికటించి..
అనకాపల్లి, సాక్షి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. వివిధ అనారోగ్య సమస్యలో ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్స నిమిత్తం వైద్యులు మంగళవారం రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్లు ఇచ్చారు.ఆ ఇంజక్షన్లు తీసుకున్న 17 మంది కొద్ది సేపటికే వాంతులు, వణుకుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా అస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బాధితులంతా నక్కపల్లి జానకయ్యే పేట, వెదుళ్ల పాలెం, తిమ్మాపురం డి ఎల్ పురం, ఉపమాక్ తదితర గ్రామాలకి చెందిన వారని సమాచారం. -
ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో కంటి పరీక్షలు
-
బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే..
భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ హెల్మెట్ ధరించి పేషేంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ కనిపించారు. అంతకుముందు రోజున ఆ హాస్పిటల్ పైకప్పు నుండి పెళ్లలు ఊడి పడటమే అందుక్కారణమని చెబుతున్నారు అక్కడి సిబ్బంది. ఒడిశా బాలంగిర్ జిల్లా దండముండ హాస్పిటల్లో స్లాబు పెచ్చులు పెచ్చులుగా ఊడి కింద పడుతోంది. ఇదే ఆసుపత్రిలో కాంపౌండరుగా పనిచేస్తోన్న సుమంత నాయక్ సోమవారం పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాడు. ఖప్రాకోల్ బ్లాకులో విధులు నిర్వర్తిస్తుండగా తన పక్కన హఠాత్తుగా పైనుండి పెచ్చులు ఊడి పడ్డాయని తెలిపాడు. మెడికల్ వార్డులో తనతోపాటు మరికొంతమంది పేషేంట్లు ఉండగా ఈ సంఘటన జరిగిందని అదృష్టవశాత్తు తమకు ఏమీ కాలేదని, అందుకే బైక్ హెల్మెట్ ధరించే డ్యూటీకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అతడిలాగే ఆసుపత్రి సిబ్బందిలో చాలా మంది భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. వారితోపాటే ఈ డాక్టర్ కూడా హెల్మెట్ ధరించుకుని పేషేంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ దర్శనమిచ్చారు. ఆయన కూర్చున్న పైభాగంలో కూడా స్లాబు పెచ్చు ఊడిపోయిన దృశ్యం వీడియోలో చూడవచ్చు. ఇక్కడే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న బాలకృష్ణ పురోహిత్ మాట్లాడుతూ.. సరైన మెయింటెనెన్స్ లేక బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చిందని పై అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాను రాను మరింత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ఇక్కడి సిబ్బంది మాట్లాడుతూ ఐదేళ్ల క్రితమే నిర్మించిన అవుట్ పేషేంట్ వార్డులో పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. నాసిరకమైన నిర్మాణం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి As seen in the infrastructural realities of rural #Odisha A doctor is shown treating patients inside a medical facility in Bolangir while donning a helmet out of fear of falling concrete from the floor. Numerous issues need to be brought up, but because to babus' carelessness,… pic.twitter.com/sA40Wc3Q1q — Sashmita Behera (@incsashmita) July 6, 2023 -
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మారని తీరు
నిజామాబాద్ సిటీ : జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి లో పేషెంట్ల పట్ల సిబ్బంది తీరు మారలేదు. ఆపరేషన్ అయిన బాలుడు ఇంటికి వెళ్తుండగా కేర్ టేకర్లు కనీసం పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరానికి చెందిన పదేళ్ల బాలుడికి కడుపులో నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. గురువారం బాలు డిని డిశ్చార్జి చేశారు. ఆస్పత్రి గేట్ వరకు వీల్‌చైర్‌లో తీసుకెళ్లవలసిన పేషంట్ కేర్ టేకర్ ఎవరూ అందుబాటులో లేకపోవటంతో బాలుడిని తల్లి గేట్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లింది. అదే సమయంలో వీల్‌చైర్‌లో ఆస్పత్రి సిబ్బంది వాటర్ బాటిల్‌ను తీ సుకెళ్లటం కనిపించింది. ఆస్పత్రిలో కేర్ టేకర్లు, వీల్ చైర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేదని పేషెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఆస్పత్రి వైద్యులు నాణ్యమైన సేవలందిస్తూ గుర్తింపు పొందుతుంటే సిబ్బంది మాత్రం రోగులతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. -
నగర్ కర్నూల్: కొల్హాపూర్ ప్రభుత్వాస్పత్రిలో కొరవడిన వైద్యం
-
మునుగోడులో పెద్దదిక్కుగా ఉండే ఆస్పత్రిపై పాలకుల నిర్లక్ష్యం
-
చెత్తా చెదారం.. ఎలుకల సంచారం
వరంగల్‌లో పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక రోగిని ఇటీవల ఎలుకలు దారుణంగా కొరికి గాయపరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు ఐదేళ్ల క్రితం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచిన యువతి శవాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన ఘటన కూడా అప్పట్లో కలకలం రేపింది. మెదక్ ఆస్పత్రి మార్చురీలో కూడా మూడేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పందికొక్కులు పీక్కుతిన్నాయి. తాజాగా వరంగల్ ఘటనలో రోగి (కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇతను తర్వాత హైదరాబాద్ నిమ్స్‌లో చనిపోయాడు) కాళ్ల నుంచి రక్తస్రావం అయ్యేలా ఎలుకలు కొరికేయడం.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి, నిర్వహణపై చర్చకు తెరతీసింది. ఐసీయూలోనే ఇలా ఉంటే సాధారణ వార్డులు, గదులు ఎలా ఉంటాయోనన్న సందేహాలకు తావిచ్చింది. దీంతో ‘సాక్షి’.. రాజధాని హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రులతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోని సర్కారు దవాఖానాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించింది. సాక్షి, నెట్వర్క్/గాంధీ ఆస్పత్రి/నాంపల్లి /అఫ్జల్‌గంజ్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ కొరవడింది. అపరి శుభ్ర వాతావరణం రాజ్య మేలుతోంది. ఎటు చూసినా చెత్తాచెదా రం, ప్లాస్టిక్ కవర్లు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ అపరిశుభ్ర వాతావరణం ఎలుక లు, పంది కొక్కులు ఆస్పత్రులను తమ ఆవాసాలు గా చేసుకునేందుకు దోహదపడుతోంది. మరోవైపు రోగులు, వారి సహాయకులు.. తినగా మిగిలిన ఆహారాన్ని, ఇతర తినుబండారాలను పడవేస్తున్నారు. ఈ ఆహార వ్యర్థాల కోసం ఎలుకలు, పంది కొక్కులు ఆసుపత్రుల ఆవరణలో, వార్డుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆస్పత్రి ఆవరణను, వార్డులను శుభ్రంగా ఉంచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కుక్కలు, కోతులు, పాములు కూడా తిరుగుతున్నట్లు రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దుస్థితి. పాత ఐసీయూ వెనుక భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. పందులు, ఎలుకలకు ఆవాసంగా మారింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ నిలోఫర్ నగరంలోని ప్రముఖ నవజాత శిశువుల సంరక్షణా కేంద్రమైన నిలోఫర్ ఆసుపత్రి అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయింది. పాత, కొత్త, లోపల, బయట అనే తేడా లేకుండా ఆసుపత్రిలోని అన్నిచోట్లా అపరిశుభ్రత నెలకొంది. రోగులు, సహాయకులు పడేసే ఆహారం కోసం చుట్టుపక్కల ఉన్న బస్తీల నుంచి ఎలుకలు ఆసుపత్రి వైపు వస్తున్నాయి. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌లో ఉంటూ రాత్రివేళ ఆస్పత్రిలో సంచరిస్తున్నాయి. గాంధీ సెల్లార్లో ఫుల్లు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెల్లార్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అక్కడ మురుగునీరు చేరుతోంది. ప్రధాన భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గైనకాల జీ, లేబర్‌వార్డు, పీడియాట్రిక్, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ తదితర వార్డుల్లో ఎలుకల సంచా రం తరచూ కనిపిస్తోందని పలువురు రోగులు తెలిపారు. 2015లో నవజాత శిశువులకు వైద్యం అందించే ఎస్ఎన్సీయూ వార్డులో ఎలుకలు కనిపించడంతో అప్పట్లో చర్యలు చేపట్టారు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఘటనతో అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి అధికార యంత్రా ంగం ఎలుకల నివారణకు గుళి కల ప్రయోగం చేపట్టడంతో పాటు పలు వార్డుల్లో బోన్లు, ర్యాట్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. పందికొక్కులకు ‘చిరునామా’ జనగామ జిల్లా వందపడకల ఆస్పత్రి ఆవరణలో డ్రెయినేజీలను తోడేస్తున్నాయి. జనరేటర్ ఏర్పాటు చేసిన గది ఆవరణ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ముందు భాగం, జనరల్ వార్డు వెనకాల పెద్ద పెద్ద కన్నాలు ఏర్పడ్డాయి. ఎలుకల కోసం పాములు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం ముందు భాగాన్ని ఇటీవల అం దంగా తీర్చిదిద్దారు. కానీ లోపల వార్డులు, ఆసుపత్రి పరిసరాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. వెనుక భాగం చెత్తాచెదారం, చెట్ల పొదలతో నిండిపోయింది. గత ఏడాది డిసెంబర్ 21న రాత్రి సమయంలో పేషెంట్ కేర్‌టేకర్‌గా పనిచేసే వేముల సంపత్‌ను ఆసుపత్రి ప్రాంగణంలోనే పాము కాటేసింది. అంతకుముందు కూడా ఆసుపత్రిలో పనిచేసే మరొకరిని పాము కాటు వేసింది. వార్డుల్లో ఎలుకలు తిరుగుతుండడంతో వాటి కోసం పాములు వస్తున్నాయని చెబుతున్నారు. పాత భవనం కావడంతో వార్డుల్లో గోడలకు కన్నాలు ఉండడం, అం దులో ఎలుకలు, బొద్దింకలు చేరడంతో వాటి కోసం పాములు వస్తున్నాయి. వంద పడకల యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణ చుట్టూ పందికొక్కులు రంధ్రాలు చేశాయి. పగలు, రాత్రి తేడాలేకుండా సంచరిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆస్పత్రి మార్చురీలో 4 ఫ్రీజర్ బాక్స్‌లు ఉండగా అవి పనిచేయడం లేదు. దీంతో రెండు శవాలను కిందపడేశారు. వాటి ని పురుగులు, దోమలు, ఈగలు పీక్కు తింటుండటంతో గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. కాగా శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ‘సాక్షి’కి తెలిపారు. ఉస్మానియాలో కుక్కల వీరంగం పేదల పెద్దాసుపత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియాలో కుక్కలు, కోతులు, పిల్లుల బెడద ఎక్కువగా ఉంది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్కలు వీరంగం సృష్టిస్తుంటే, కోతులు రోగులు వారి సహాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆసుపత్రి నుండి రోగి కోలుకొని తిరిగి వెళ్లే సమయంలో కొబ్బరికాయలు కొడుతుండడంతో వాటి కోసం కోతులు ఎగబడుతున్నాయి. 2017లో ఆత్మహత్యకు పాల్పడిన అఫ్జల్‌సాగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు.. ముక్కు, పెదవుల్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన స్థితిలో ఉన్న యువతి శవాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. -
Karimnagar: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షలు..?
సాక్షి, కరీంనగర్: ఉన్నవి రెండే పోస్టులు.. వచ్చినవి 87 దరఖాస్తులు.. ఇంకేముంది చేతివాటానికి దారి దొరికింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు బేరసారాలు నడుస్తున్నట్లు తెలిసింది. రూ.2 లక్షలిస్తే చాలు అర్హతలున్నా.. లేకున్నా.. ఉద్యోగ నియామకపత్రం ఇంటికి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆసుపత్రిలో పనిచేసే ఓ కీలక అధికారి చక్రం తిప్పి చేతివాటం ప్రదర్శించారు. అదే అధికారి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ తన చతురతను ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు ఆ అధికారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అమ్మకం జరిగాయని పలువురు చర్చించుకుంటున్న నేపథ్యంలో... ఒక పోస్టును ఆసుపత్రిలోనే ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వ్యక్తికి కట్టబెట్టేందుకు అధికారులు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ముట్టజెప్పిన సదరు వ్యక్తి కూడా తనకు పోస్టు దక్కుతుందనే భరోసాతో ఉన్నట్లు తోటి దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఖరారైన పోస్టు రూ.2 లక్షలు పలుకగా, మరో పోస్టుకు మాత్రం లాభసాటిగా బేరం కుదుర్చేందుకు డబ్బులు పెట్టే సత్తా ఉన్న అభ్యర్థిని వెతుకుతున్నట్లు తెలిసింది. 2 పోస్టులు.. 87 దరఖాస్తులు.. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు పోస్టులకు 87 మంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అదనుగా కీలక అధికారి బేరసారాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టులన్నీ సదరు అధికారి కనుసన్నల్లలోనే భర్తీ కావడంతో అతన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు పోస్టు వచ్చినట్లేనని ప్రచారం బహిరంగంగా జరుగుతోంది. అర్హుల ఎంపికతో నోటీసు... దరఖాస్తుదారుల లిస్టు ప్రకారం అర్హులు, అనర్హుల లిస్టు తయారు చేసి ఈ నెల 14న అధికారులు ఆసుపత్రిలో నోటీసు బోర్డుపై అంటించారు. ఈనెల 17న సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాలుంటే తెలపాలని, లేని పక్షంలో రెండు పోస్టులకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎంఎల్టీ చేసిన వారు అనర్హులట.. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) పూర్తి చేసి పారా మెడికల్ బోర్డునుంచి సర్టిఫైడ్ అయిన వాళ్లని సైతం అనర్హులుగా ప్రకటించారు. పారామెడికల్ బోర్డు ఆక్ట్ నెం.38 ఆఫ్ 2006 ప్రకారం ఎంఎల్టీ చదివిన వారు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాలకు అర్హులు. కానీ ఆసుపత్రిలో మాత్రం కొత్త నిబంధన పెట్టారని పలువురు ఎంఎల్టీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల ఎంపికపై అభ్యంతరం... ఎంఎల్టీ చదివిన వారిని అనర్హులుగా ప్రకటిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై శ్రీనాథ్ అనే దరఖాస్తుదారుడు అభ్యంతరం తెలుపుతూ లిఖిత పూర్వకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు గురువారం లేఖను అందించారు. ఈ లేఖలో మరో వివాదాన్ని సైతం లేవనెత్తారు. నోటిఫికేషన్లో కరీంనగర్ జిల్లాకు చెందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఉన్నప్పటికీ, ఎంపిక నోటీసు వచ్చే సరికి జోనల్ స్థాయి నియామకం అని ఉండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఎల్టీ చదివిన వారికి న్యాయం చేయాలని కోరారు. నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్.. ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ నిబంధనల ప్ర కారమే చేపట్టాం. డీఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ అర్హత ఉన్నవారిని మాత్రమే తీసుకుంటామని నోటిఫికేష న్లో స్పష్టం చేశాం. అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నాం. – డాక్టర్ రత్నమాల, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఆక్సిజన్ కొరతకు అధికారుల చెక్
గన్నవరం: కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్, రెవెన్యూ యంత్రాంగం చూపిన చొరవ సత్ఫలితాలనిచ్చింది. చెన్నై, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను గుర్తించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రులకు 19 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. మొదట చెన్నై నుంచి తెలంగాణలోని ఖమ్మంకు వెళుతున్న క్యూమెన్ ఎయిర్ ప్రొడక్ట్ ఏజెన్సీకి చెందిన ట్యాంకర్ 23 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో గన్నవరం మండలం సూరంపల్లికి వచ్చింది. విజయవాడ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉంగుటూరు తహసీల్దార్ వనజాక్షి సదరు కంపెనీ యజమానితో చర్చలు జరపడంతో 13 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ ఇవ్వడానికి అంగీకరించారు. అదేవిధంగా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్‌ను కూడా అధికారులు ఆపారు. సదరు సంస్థ ప్రతినిధులతో మాట్లాడి 6 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచేందుకు ఒప్పించారు. సీఐ కోమాకుల శివాజీ, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పనిచేయకుండానే 15 ఏళ్లుగా జీతం తీసుకుంటున్న ఉద్యోగి
మీరు ఎప్పుడైనా ఏ కారణం లేకుండా జాబ్ చేయకపోతే మీ కంపెనీ శాలరీ ఇచ్చిందా?. ఒకవేల ఇచ్చిన మహా అయితే 15 రోజులో, నెల రోజులో ఇస్తుంది. కానీ కొన్ని ఏళ్ల పాటు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా?. అసలు ఎప్పుడైనా అలా తీసుకుంటున్న గురుంచి విన్నారా?, నాకు తెలిసి ఉండదు. కానీ, ఒక వ్యక్తి మాత్రం జాబ్ చేయకుండా 15 ఏళ్ల పాటు ప్రతి నెల కచ్చితంగా జీతం తీసుకుంటున్నాడు. ఇలాంటి ఘటన ఇటలీలో జరిగింది. ఇటలీలో ఒక ప్రభుత్వ ఉద్యోగి 2005 నుంచి తాను పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్ళడం మానేశాడు. కానీ, జీతం మాత్రం ప్రతి నెల తీసుకుంటున్నాడు. ఈ వ్యక్తి పేరు సాల్వేటోర్ సుమాస్. ఇతను కాటాన్జారో నగరంలో ఉన్న పుగ్లీసీ సియాసియో ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అయితే, ఈ పదిహేనేళ్ళు ఉద్యోగం చేయకపోయిన అతనికి అందిన జీతం అక్షరాలా 5,38,000 యూరోలు. ప్రస్తుతం ఈయన వయస్సు 67 ఏళ్లు. ఇప్పుడు ఆ విషయం బయటపడటంతో పోలీసులు ఇతన్ని విచారిస్తున్నారు. అతనితో పాటు ఆసుపత్రికి చెందిన ఆరుగురు మేనేజర్లను కూడా ఈ కేసులో బుక్ చేశారు పోలీసులు. సుమాస్ డ్యూటీకి రాకపోయినా హాజరు ఎలా వేశారో అనే విషయంపై వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. పోలీసులు హాజరు, జీతం రికార్డులతో పాటు సహోద్యోగుల నుంచి కొంత సమాచారం సేకరించారు. ఆ సమాచారం ప్రకారం.. 2005లో ఆ ఆసుపత్రి డైరెక్టర్ ను తనపై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేయవద్దని బెదిరించాడు. ఆ గొడవ కారణంగా అతను ఆసుపత్రికి రావడం మానేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ కూడా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్ లేదా మానవ వనరుల విభాగం(హెచ్ఆర్ డిపార్ట్మెంట్) కూడా ఎప్పుడూ సాల్వేటోర్ సుమాస్ హాజరును పట్టించుకోలేదు అని పోలీసులు చెప్పారు. 2016లో ఇటలీ ప్రధాని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కొన్ని కఠినతర చట్టాలను తీసుకొచ్చారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వివరాలనూ పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న అన్ని మోసాలను బయటకు తీయాలని పేర్కొన్నారు. దీంతో జరిపిన విచారణలో ఈ విషయం బయటకు వచ్చింది. -
రాష్ట్రంలో 84 వేల రెమ్డెసివిర్లు రెడీగా..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఈ వైరస్ నియంత్రణకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏప్రిల్ 10 నాటికి 84 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రోజుకు 3 వేల నుంచి 4 వేల ఇంజక్షన్లు వినియోగం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో 20 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు రేట్లు తగ్గడంవల్ల తిరిగి టెండర్లు వేసి మళ్లీ ఆర్డరు ఇవ్వనున్నామన్నారు. 4 లక్షల హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో.. ఇక రాష్ట్రంలో ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందే కరోనా బాధితుల కోసం కాకుండా ఇంట్లోనే (హోం ఐసొలేషన్) చికిత్స పొందే వారికి 4 లక్షల కిట్లు అందుబాటులో ఉంచారు. ఇందులో పారాసెటిమాల్ మొదలుకొని అజిత్రోమైసిన్ వరకూ కరోనా నియంత్రణకు మందులుంటాయి. వీటిని కూడా అవసరమున్న మేరకు అందుబాటులో ఉంచారు. ఇవికాక.. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పారాసెటిమాల్, అజిత్రోమైసిన్ మందులు అందుబాటులో ఉంచారు. దేశవ్యాప్తంగా గ్లౌజుల కొరత ఇదిలా ఉంటే.. ఏపీలోనే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనూ గ్లౌజుల కొరత వేధిస్తోంది. రబ్బరు ధరలు పెరగడం, ముడిసరుకు ఇతర దేశాల నుంచి రావాల్సి ఉండటంతో దేశంలో చిన్నచిన్న యూనిట్లు చాలా మూతపడ్డాయి. దీంతో సకాలంలో గ్లౌజులు రావడంలేదు. రాష్ట్రంలో మరికొద్దిరోజులకు సరిపడా గ్లౌజులు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పటిష్టంగా పీహెచ్‌సీలు, ‘104’ వ్యవస్థ కరోనా నియంత్రణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) పనితీరును కూడా ప్రభుత్వం పునఃసమీక్షించనుంది. దీనిపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్‌సీలోని వైద్యులు, 104లోని వైద్యుడు తన పరిధిలో విధిగా వైద్యసేవలు అందించాలన్నారు. అలాగే, ప్రతీ పీహెచ్‌సీకి అవసరమైన 104 అంబులెన్స్‌లు ఉన్నాయో లేదో పరిశీలించి అవసరమైతే సమకూర్చుకోవాలని కూడా సూచించారు. అంతేకాక.. కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో బెడ్ కోసం 104 కాల్‌సెంటర్‌ను సంప్రదిస్తే గతంలో ఎలా సమకూర్చామో, ఇప్పుడూ అలాగే చర్యలు తీసుకోవాలని.. అధికార యంత్రాంగం మొత్తం ఆ ఒక్క ఫోన్‌కాల్‌కు స్పందించాలన్నారు. అలాగే, 104 నంబర్‌పై మళ్లీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా.. కరోనా నియంత్రణలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై ప్రధానంగా దృష్టి పెట్టాలని.. మాస్క్ పెట్టుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. జిల్లాల్లో కోవిడ్ ఆసుపత్రులను హేతుబద్ధంగా నిర్వహించాలన్నారు. -
సౌకర్యం ఉన్నా..ఫలితం సున్నా..!
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రాణాపాయంలో రక్తం ద్వారా మనిషిని కాపాడవచ్చు. ఎలాంటి ఆస్పత్రుల్లోనైనా మొదటి ప్రాధాన్యత రక్తానిదే. రక్తపు నిల్వలు అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం రక్తపు నిల్వలు లభించడం కష్టతరంగా మారింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాకు రక్తసేకరణ, రవాణా వాహనాన్ని మంజూ రు చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోజూ ఆయా ప్రాంతాల్లో రక్తాన్ని సేకరించి ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రజాదరణ లేక రక్త సేకరణలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అన్ని సౌకర్యాలు కలిగిన వాహనం ఉన్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రూ.48లక్షలతో వాహనం ఏర్పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా దేశంలోని మిగతా జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాకు రక్తసేకరణ, రవాణ వాహనాన్ని మంజూరు చేశారు. ఇందు కోసం రూ.48లక్షలు వెచ్చించారు. 2017 సెప్టెంబర్ 19న ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఏసీతో కూడిన ఈ వాహనంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా ఈ వాహనం పనిచేస్తోంది. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకు డాక్టర్ కవిత వాహన నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాహనానికి ఇరువురు ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు డ్రైవర్ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రూ.19వేలు చొప్పున, డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున వేతనాలు ఇస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరిగినందుకు నెలకు సుమారు రూ.15వేలు డీజల్ ఖర్చు వస్తోంది. నెరవేరని లక్ష్యం నిబంధనల ప్రకారం ఈ వాహనం ద్వారా నెలకు 1500 యూనిట్ల రక్తాన్ని సేకరించాల్సి ఉంది. అయితే ఇందులో సగం యూనిట్ల రక్తం కూడా సమకూరడం లేదని తెలుస్తోంది. 2017లో 1481 యూనిట్లు, 2018లో 3,704 యూనిట్లు మాత్రమే రక్తాన్ని సేకరించారు. కొన్ని నెలల్లో 120 యూనిట్ల రక్తం మాత్రమే సేకరించారు. ప్రధానంగా ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సేకరించిన రక్తాన్ని ప్రతి నెల పులివెందుల, ప్రొద్దుటూరు, కడపలోని మదర్ బ్లడ్‌బ్యాంకులకు అందించాల్సి ఉంది. వీటి ద్వారా జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో రక్తాన్ని నిల్వ చేస్తారు. ప్రతి నెల ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి 500 యూనిట్లు, రిమ్స్‌కు 2వేల యూనిట్లు రక్తపు నిల్వలు అవసరమని సమాచారం. అయితే తగినంత రక్తపు నిల్వలు రాకపోవడంతో ప్రాణాపాయంలో ఉన్న వారు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో రక్తం తీసుకోవాలంటే తప్పనిసరిగా బదులు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
ఏసీ ఫెయిల్..ఐదుగురి మృతి
కాన్పూర్: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఎయిర్ కండీషనింగ్ పనిచేయకపోవడం వల్ల 24 గంటల వ్యవధిలో ఐదుగురు వృద్ధులు మృతిచెందారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలోని లాలా లజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ కారణంగా ఇంద్రపాల్(75), గంగా ప్రసాద్ యాదవ్(75), రసూల్ భక్ష్, మురారీ లాల్(65) అనే వృద్ధులతో పాటు మరో వృద్ధుడు కూడా మృతిచెందారు. వీరిలో ఇద్దరు గుండె ఆగిపోవడం వల్ల మరణించగా..మరో ముగ్గురు దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ చనిపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా.. ఎయిర్ కండీషనింగ్(ఏసీ)లో సమస్యలు ఉన్నట్లు తమకు తెలుసునని, రెండు రోజుల క్రితమే మెడిసిన్ డిపార్ట్మెంట్ ఐసీయూలో ఏసీ ప్లాంట్‌ను మూసివేశామని ఐసీయూ ఇంచార్జ్ సౌరవ్ అగర్వాల్ తెలిపారు.నిన్న ఏసీ ప్లాంట్‌లో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఉన్న సమస్యను పరిష్కరించామని, కానీ మళ్లీ సమస్య ఉత్పన్నమైందని ఆసుపత్రి పిన్సిపల్ నవనీత్ కుమార్ తెలిపారు. పరిస్థితి విషమించిన రోగులు మాత్రమే ఐసీయూలో ఉన్నారని, కేవలం ఏసీ ఫెయిల్ కావడం వల్లే రోగులు చనిపోలేదని ఆయన అన్నారు. ఈ సంఘటన గోరఖ్ పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఘటనను తలపిస్తోంది. గత సంవత్సరం ఆక్సిజన్ కొరత వల్ల సుమారు 60 మంది శిశువులు వారం వ్యవధిలో చనిపోయారు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టంతో ఈ గొడవ సద్దుమణిగింది.ఏసీ ఫెయిల్ సంఘటనపై నలుగు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశిస్తున్న కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ తెలిపారు. -
వంద పడకలు.. వేయి సమస్యలు
సాక్షి, కుప్పం: కుప్పం వంద పడకల ఆస్పత్రిలో అన్ని సదుపాయాలున్నా.. రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ పనిచేసే సిబ్బందికి పాలకపక్షం మధ్య నెలకొన్న రాజకీయ విభేధాలే కారణం. ప్రస్తుతం ఈ విభేధాల వల్ల వైద్యాధికారులు రెండు గ్రూపులుగా విడిపోయి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. సోమవారం ‘సాక్షి’ విజిట్‌చేయగా.. ప్రసూతి విభాగంలో గర్భవతులకు నరకం తప్పడం లేదు. ఇక్కడి సిబ్బంది గర్భిణులను తీవ్రంగా దుర్భాషలాడుతూ.. ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లకు వెళ్లాలని సూచిస్తున్నారు. విద్యుత్ సమస్యతో రోగులకు వైద్యం అందడం ఆలస్యమవుతోంది. సోమవారం 356 మంది ఓపీకి వచ్చారు. శ్రీకాళహస్తిలో గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో.. చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో రోగులకు సకాలంలో నాణ్య మైన వైద్యసేవలు అందడం లేదు. సోమవారం ఓపీకి 1454 మంది వచ్చారు. ఆప్తమాలజీ ఓపీలో గంట పాటు వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. డయాలసిస్ విభాగం పని చేయడం లేదు. -
ఖర్మాసుపత్రులు
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పాట ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. దవాఖానాల దుస్థితికి నిత్య దర్పణం ఆ పాట. దానిని దాదాపు ప్రతినిత్యం ఎక్కడో దగ్గర వింటున్నా.. ప్రభుత్వాల కళ్లు తెరచుకోవడంలేదు. ప్రభుత్వాసుపత్రులపై పాలకులు నేటికీ అదే నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. అరకొర వైద్య సేవలు, చాలీచాలని వసతులు, సౌకర్యాల లేమి, మందుల కొరత.. ఇలా అనేక సమస్యలు సర్కారీ ఆసుపత్రులను పట్టి పీడిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో సోమవారం చేసిన ‘సాక్షి’ విజిట్‌లో ఇటువంటివే అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అరకొరగానే ఉన్నాయి. దీంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని విభాగాలకైతే డాక్టర్లు లేక వైద్యం అందని దుస్థితి నెలకొంది. ఇక కొన్ని విభాగాల్లో ఒకే మంచంపై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్న దుర్భర పరిస్థితి నెలకొంది. పేద రోగులకు అందించాల్సిన మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై సోమవారం చేసిన ‘సాక్షి’ విజిట్‌లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.∙కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) బోధనాసుపత్రి కూడా. ఇక్కడ పడకల కొరత తీవ్రంగా ఉంది. అనేక విభాగాల్లో ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. కీలకమైన కార్డియాలజీ విభాగానికి పూర్తిస్థాయి వైద్యులు లేరు. ప్రస్తుతం గుండె వ్యాధుల చికిత్స నిపుణునిగా సేవలందిస్తున్న డాక్టర్ చలం మూడు రోజులు కాకినాడ జీజీహెచ్‌లో, మూడు రోజులు విశాఖ కేజీహెచ్‌లో సేవలు అందిస్తున్నారు. దీంతో ఇక్కడ అరకొర వైద్యసేవలే దిక్కవుతున్నాయి. ప్రధానమైన బీ కాంప్లెక్స్ నుంచి గుండె జబ్బులు, న్యూరాలజీ, కీళ్లనొప్పులతోపాటు కాల్షియం మాత్రలు కూడా ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి. చెవి, కంటికి సంబంధించి వేసే డ్రాప్స్ కూడా మూడు నాలుగు నెలలుగా సరఫరా కావడంలేదు. ఆసుపత్రి డ్రగ్స్ బడ్జెట్ రూ.1.82 కోట్లు. ఇది ఆరు నెలలకు కూడా సరిపోవడం లేదు.∙రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఓపీ చీటీలు రాసేచోట సరైన సిబ్బంది లేరు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారిని పారిశుద్ధ్య సిబ్బందిగా, ట్రైనీ నర్సులుగా నియమిస్తుంటారు. ఇక్కడ పని చేస్తున్న 69 మందిని ఒకేసారి బదిలీ చేయడంతో పలు విభాగాల్లో సకాలంలో సరైన వైద్య సేవలు అందడంలేదు. ఒకేసారి సీనియర్ సిబ్బందిని బదిలీ చేయడంతో గైనిక్ వైద్య సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డెలివరీ కూడా సకాలంలో చేయడం లేదని రోగులు వాపోతున్నారు. ఏడాదికి రూ.1.62 కోట్ల మేర డ్రగ్స్ బడ్జెట్ కేటాయించినా అది చాలడంలేదు. దీనిని రూ.3 కోట్లకు పెంచాల్సిన అవసరం ఉంది.∙అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కన్ను, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వైద్యం అందే పరిస్థితి లేదు. కోనసీమలోని కిడ్నీ రోగులను ఈ ఆసుపత్రి ఆదుకోలేకపోతోంది. డయాలసిస్ యూనిట్ లేక కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారు. ఇక్కడ కూడా మందుల కొరత ఉంది. దాదాపు రూ.70 లక్షల బడ్జెట్ అవసరం కాగా, కేవలం రూ.51.52 లక్షల మేరకే ప్రభుత్వం ఇస్తోంది. ∙తుని ఏరియా ఆసుపత్రిలో చీటీలు తీసుకున్న రోగులు సంబంధిత డాక్టరు గది వద్దకు వెళ్లి క్యూలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఇక్కడ మూడు ఎక్స్‌రే మెషీన్లు ఉండగా ఒకటి మాత్రమే పని చేస్తోంది. నెలలు నిండిన మహిళలు పురుడు కోసం వస్తే చేయి తడపందే వైద్యులు కత్తెర పట్టుకోవడం లేదు. డ్రగ్స్ కొరత ఉంది. ప్రభుత్వం కేటాయించిన రూ.52.65 లక్షల బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదు. రూ.75 లక్షల మేర అవసరం ఉంది.∙మూడు నియోజకవర్గాలకు ఏరియా ఆసుపత్రిగా ఉన్న రామచంద్రపురంలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సహితం ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక వెనుదిరగాల్సి వస్తోంది. గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, చంటిపిల్లల వైద్యులు లేకపోవటంతో మహిళా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్డియాలజిస్టు పోస్టు లేకపోవడంతో గుండెపోటుకు గురైనవారికి అత్యవసర చికిత్స అందించే పరిస్థితి లేదు. ముఖ్యమైన సామగ్రి అందుబాటులో లేకపోవటంతో ఆర్థోపెడిక్ ఆపరేషన్లు అవసరమైన వారిని కాకినాడ తరలిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ఏటా రూ.35.80 లక్షల మేర డ్రగ్స్‌కు కేటాయిస్తున్నా సరిపోవడం లేదు. మందుల కొరత తీరాలంటే రూ.55 లక్షల మేరకు అవసరం ఉంది. జిల్లాలోని ఇతర ఆసుపత్రుల్లోనూ దాదాపు ఇదే దుస్థితి నెలకొందిగొంతుకు ఎక్స్‌రే తీయమంటే చెస్ట్‌కు తీశారుకాకినాడ జగన్నాథపురానికి చెందిన 12 ఏళ్ల రాముడుకు గొంతులో కాయ ఏర్పడింది. శనివారం ఎక్స్‌రే తీయాల్సిందిగా వైద్యులు సూచించారు. తీరా అన్నీ చేసి సోమవారం ఆస్పత్రికి వచ్చాక గొంతుకు తీయాల్సిన ఎక్స్‌రే చెస్ట్‌కు తీశారని వైద్యులు తేల్చారు. ఎక్స్‌రే సరిగా లేనందున మళ్లీ తీయించుకురమ్మని చెప్పడంతో ఉసూరుమంటూ మండుటెండలో అతడి తల్లి చక్కా రాఘవ ఎక్స్‌రే విభాగం వైపు పరుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాను ఇబ్బంది పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.. మందులు లేవు కాకినాడకు చెందిన ఓలేటి అప్పారావుకు అకస్మాత్తుగా కాళ్లు, చేతులు పడిపోయాయి. చేపల వేట చేస్తూ జీవనం సాగించే అప్పారావు చికిత్స నిమిత్తం నాలుగు రోజుల క్రితం జీజీహెచ్‌లో చేరాడు. చికిత్స అందించేందుకు అవసరమైన ఇమ్యునోగ్లోబ్లెన్స్ అందుబాటులో లేవని సిబ్బంది తేల్చేశారు. ఇది ఉంటేనే కానీ రోగికి మెరుగైన వైద్యం అందించలేని పరిస్థితి. మందులు అందుబాటులో లేని దుస్థితి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మందు బయట కొనలేకపోతున్నామని రోగి బంధువు చెప్పాడు. అతడిని ఆసుపత్రిలోనే ఉంచి సాధారణ చికిత్స అందిస్తున్నారు. -
మందుల్లేవ్..?
సాక్షి, ఆదిలాబాద్: సర్కారు దవాఖానాలకు ప్రభుత్వం నుంచి సరఫరా చేసే మందుల కోటా ప్రతీ ఏడాది మిగిలిపోయి ల్యాప్స్ అవుతున్నాయి. మరో పక్క ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు అత్యవసరంలో 20 శాతం మందులు బయట నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి. అయినప్పటికీ ధర్మాస్పత్రుల్లో సాధారణ మందులు కూడా లభించకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. కోటాలో మందులు మిగిలిపోతాయి.. అత్యవసరం పేరిట ఆస్పత్రి వర్గాలు మందులు కొనుగోలు చేస్తాయి.. అయినా పేద రోగులకు మాత్రం ఆస్పత్రిలో సాధారణ మందులు కూడా లభించవు. దీంతో బయట మెడికల్‌లో పేద రోగులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డబ్బులు లేకనే చికిత్స, మందులు ఉచితంగా లభిస్తాయని రిమ్స్‌కు వస్తే ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నిత్యం కనిపిస్తోంది. పేద రోగులకు చికిత్స, మందులు పూర్థి స్థాయిలో ఉచితంగా అందజేయాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు. ప్రతీ ఏడాది ఇదే పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో డ్రగ్స్ రూ.14.66 కోట్లకు గాను రూ.10.95 కోట్లు వినియోగించారు. రూ.3.70 కోట్ల విలువైన డ్రగ్స్ ల్యాప్స్ అయ్యాయి. రూ.4.04 కోట్లు సర్జికల్ ఐటమ్స్గాను రూ.3.31 కోట్లు వినియోగించగా, రూ. 72.92 లక్షల విలువైన సర్జికల్ ఐటమ్స్ మిగిలిపోయాయి. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా ఏప్రిల్‌లో మందుల కోటాను విడుదల చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి, భైంసా, మంచిర్యాల, నిర్మల్ ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్), ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, సిర్నూర్, ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ), నిర్మల్‌లోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్), ఉమ్మడి జిల్లాలోని 72 పీహెచ్‌సీలు, పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లకు ప్రతి ఏడాది మందుల కోటా టీఎస్ఎంఎస్ఐడీసీ నుంచే మంజూరు అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు మందుల సరఫరా జరుగుతుంది. గత ఏడాది పరిస్థితే మళ్లీ జిల్లాలో కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా కేటాయించిన మందుల కోటా మిగిలిపోతుండగా ఆస్పత్రుల్లో మాత్రం పేదలకు మందులు లభించని పరిస్థితి. ఈ తారతమ్యాన్ని పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే మందుల కోటాను పెంచాల్సి ఉంది. ఈ–ఔషధి, ఈ–ఆస్పత్రి పేరిట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటునప్పటికీ పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య చికిత్సలతోపాటు మందులు లభించినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. మందుల కొనుగోలులో అక్రమాలు ప్రతి ఏడాది మూడు నెలలకు ఓసారి నాలుగు కోటాల్లో మందులను ఆస్పత్రులకు విడుదల చేస్తారు. ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిల్లో ఈ మందులను విడుదల చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి కావాల్సిన మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో అందుబాటులో లేని పక్షంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు కోటాపై 20 శాతం మందులు బయట నుంచి కొనే అవకాశం ఉంది. బయట నుంచి కొనే మందుల విషయంలో ఆస్పత్రిల్లో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఒక ఆస్పత్రికి డిమాండ్ ఉన్న మందులు, మరో ఆస్పత్రిలో అవే మందులు వృథాగా ఉంటే ఆ ఆస్పత్రి నుంచి ఈ ఆస్పత్రికి మందులను తరలించే చెయిన్ సిస్టమ్ ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గిరిజనులు అత్యధికంగా ఉండే ఆసిఫాబాద్, ఖానాపూర్, ఉట్నూర్ వంటి ఆస్పత్రుల్లోనూ మందుల కోటా పెద్ద ఎత్తున మిగిలిపోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంత అవసరమో అంతే కొంటాం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో అందుబాటులో లేని మందులను బయట నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎంత అవసరమో అంత మేరకే కొంటాం. రిమ్స్ కొనుగోలు కమిటీ అనుమతి మేరకు మందులను కొనుగోలు చేస్తాం. కోటాపై 20 శాతం కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. మందుల వినియోగం పై ప్రతి ఏడాది ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. – డాక్టర్ అశోక్, రిమ్స్ డైరెక్టర్ -
రాయికల్ ఆస్పత్రికి రాజకీయ గ్రహణం
రాయికల్(జగిత్యాల) : రాయికల్‌లోని 30 పడకల ఆస్పత్రికి రాజకీయ గ్రహణం పట్టింది. రాజకీయ జోక్యంతో వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. విధులు నిర్వర్తించేందుకు వెనుకాడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ప్రజాప్రతినిధులు ఆధిపత్య పోరులో డాక్టర్లు బలవుతున్నారు. రాయికల్ మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని 2009లో అప్‌గ్రేడ్ చేశారు. మల్లాపూర్, మేడిపల్లి, జగిత్యాల మండలాల నుంచి రాయికల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో 823 ప్రసవాలు జరుగగా రికార్డుస్థాయిలో జనవరి నెలలోనే 130 ప్రసవాలు జరిగాయి. ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ స్త్రీ,వైద్యనిపుణురాలు చైతన్య, దంత వైద్య నిపుణురాలు ప్రవీణ్‌చంద్ర, సిబ్బంది సహకారంతో రాయికల్ ఆస్పత్రి ప్రసవాలలో జిల్లాలోనే మొదటిస్థానంలో నిలిపారు. ఆధిపత్యపోరు.. ఆస్పత్రి వ్యవహారాల్లో కొన్ని రోజులుగా ఎంపీపీ, జెడ్పీటీసీ అతిగా జోక్యం చేసుకుంటున్నారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 30 పడకల ఆస్పత్రికి ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీవో రాయికల్‌లో అమలుకావడంలేదు. ఎంపీపీ ఆస్పత్రి చైర్మన్ అంటూ టీఆర్ఎస్ వర్గాలు ఆస్పత్రి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. ఇదే వ్యవహారంలో తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చైర్మన్ అంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీ గోపి మాధవి, ఎంపీటీసీలు కట్కం సులోచన, ఎద్దండి సింధుజ, తలారి నాగమణి జోక్యం చేసుకుంటూ ఒకరిపై ఒకరు అభివృద్ధి పనుల్లో , సమావేశాల్లో ఆరోపణలు చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం 102 వాహన ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సంజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, సమావేశంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ నూతన జీవో ప్రకారం ఆస్పత్రి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అని ప్రస్తావించారు, సంజయ్‌కుమార్ జోక్యం చేసుకుని జీవో చూపించాలని, అప్పటి వరకు ఎంపీపీ చైర్మన్ అంటూ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్‌పై సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపం చెందిన వైద్యాధికారి శ్రీనివాస్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. కలెక్టర్‌ను కలవనున్న వైద్యులు.. రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు మెడికల్ పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ చైతన్యసుధ, దంతవైద్య నిపుణుడు ప్రవీణ్‌చంద్ర విధులు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ క్షయ, టీబీ జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డాక్టర్ వెంకన్న, అవంతి వెళ్లడంతో కేవలం రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ముగ్గురు వైద్యులే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో తమతో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించడం కష్టతరంగా ఉందని, ఈ విషయంపై కలెక్టర్ శరత్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా డీఎంహెచ్‌వో సుగంధిని యుద్ధప్రతిపాదికన స్పందించి రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రి చైర్మన్ ఎవరు, ఆస్పత్రికి పట్టిన రాజకీయ గ్రహణాన్ని విడిపించేలా చర్యలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు. -
నవజాత శిశువులకు బేబీకేర్ కిట్స్
జూలై 1 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమయ్యే పసికందులకు జూలై 1వ తేదీ నుంచి బేబీకేర్ కిట్స్‌ను అందించనున్నారు. ఈ మేరకు బుధ వారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్యులు విడుదల చేశారు. పసికందులకు దోమతెర, చేతుల పరిశుభ్రం చేసుకునే స్క్రబ్, బేబిని గుడ్డలో చుట్టి ఉంచేందుకు రెండు బేబిరేపర్లు, ప్లాస్టిక్కిట్ బ్యాగ్ మొత్తం రూ.600 ఖరీదు చేసే కిట్‌ను అందిస్తారు. నేషనల్ హెల్త్ మిషన్, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు సంయుక్తంగా ఈ కిట్లను అందించనున్నారు. పుట్టకతో సంభవించే శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కిట్లను అందిస్తుంది. ఏడాదిలో సుమారు ఐదు లక్షల కాన్పులు జరుగుతాయని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ధారణ చేసి రూ.10 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, రూ.20 కోట్లు కార్మికశాఖ సంక్షేమ బోర్డు ద్వారా విడుదల చేయనున్నారు. -
హైవే టెర్రర్!
* రోజుకు సగటున ముగ్గురి ప్రాణాలు హరీ * మరో 200 మందికిపైగా తీవ్ర గాయాలు * క్షతగాత్రులకు అందని తక్షణ వైద్యం * అందుబాటులో ఉండని అంబులెన్స్‌లు * సకాలంలో హాజరు కాని వైద్యులు * ఎక్కడ ప్రమాదం జరిగినా గుంటూరు తరలించాల్సిందే * జాతీయ రహదారిపై మోగుతున్న మృత్యుఘంటికలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా పరిధిలోని జాతీయ రహదారి(ఎన్‌హెచ్-5)పై జరుగుతున్న ప్రమాదాల్లో సగటున రోజుకు ముగ్గురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. సుమారు 200 మందికిపైగా తీవ్రంగా గాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు తక్షణ వైద్య సౌకర్యం లభించకపోవడం, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సౌకర్యాలు లేకపోవడం ఈ దుస్థితికి కారణమవుతోంది. క్షతగాత్రులను తరలించే అంబులెన్స్‌ల సంఖ్య పరిమితంగా ఉండడం, జాతీయ రహదారికి సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రులు పెద్దగా లేకపోవడం, ఉన్నప్పటికీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. తక్షణ వైద్య సహాయం అందుబాటులోకి వస్తే కొందరి ప్రాణాలనుకాపాడే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మృతి చెందే వారి సంఖ్య పెరుగుతోంది. * జిల్లాలో జాతీయ రహదారి నిడివి 85 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. విజయవాడ కనకదుర్గ వారిధి నుంచి (తాడేపల్లి మండలం) నుంచి చిలకలూరిపేట రూరల్ పరిధి మార్టూరు వరకు జాతీయ రహదారి విస్తరించి ఉంది. మంగళగిరి, తాడేపల్లిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లోని బాధితులను అక్కడకి 25 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. అంబులెన్స్ లేదా ఇతర రవాణా సౌకర్యాలతో క్షతగాత్రులను గంటలోపు ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంటుంది. దీనికితోడు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకుతోపాటు వైద్యులు రాత్రి సమయాల్లో అందుబాటులో ఉండడంతో కొంత వరకు మృతుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. * కాజ, పెదకాకాని తదితర ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో కొందరి ప్రాణాలైనా నిలబెడుతున్నారు. * చిలకలూరిపేట, చిలకలూరిపేట రూరల్ పరిధిలోని తాతపూడి, ప్రకాశం జిల్లా మార్టూరు పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లోని క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. మార్టూరు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. మార్గమధ్యలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నప్పటికీ, అక్కడకు తరలించడం లేదు. 30 పడకల ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు అందుబాటులో లేదు. వైద్యులు కూడా ఎక్కువ మంది గుంటూరు నుంచి డైలీ సర్వీస్ చేసే వారే అధికంగా ఉన్నారు. క్షతగాత్రులు వచ్చిన సమయంలో అందుబాటులో ఉండకపోవడంతో ఎక్కువ మందిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రాథమిక చికిత్స లభించినప్పటికీ, క్షతగాత్రులను గుంటూరు తరలించడానికి గంటన్నర సమయం పడుతుండడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. * జాతీయ రహదారి సంస్థ పరిధిలో అంబులెన్స్‌లు, కాజా టోల్‌ప్లాజ్ వద్ద ఉన్న అంబులెన్స్‌లు కూడా ప్రమాద సమయాల్లో ఉపయోగపడిన సందర్భాలు తక్కువగానే ఉంటున్నాయి. సృ్పహలేని స్థితిలో ఉన్న బాధితులను గుంటూరు ఆసుపత్రికి తరలిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి లోని 3 అంబులెన్స్‌లు స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లోని క్షతగాత్రులను ఇతర వాహనాల్లోనే ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తాడేపల్లి వద్ద ఉన్న మణిపాల్, మంగళగిరి వద్ద ఉన్న ఎన్ఆర్ఐ, చౌడవరం వద్ద ఉన్న కాటూరి మెడికల్ కళాశాల అసుపత్రులు పరిధిలోని అంబులెన్సులు క్షతగాత్రుల కోరిక మేరకు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.