నిజామాబాద్ సిటీ : జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి లో పేషెంట్ల పట్ల సిబ్బంది తీరు మారలేదు. ఆపరేషన్ అయిన బాలుడు ఇంటికి వెళ్తుండగా కేర్ టేకర్లు కనీసం పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరానికి చెందిన పదేళ్ల బాలుడికి కడుపులో నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. గురువారం బాలు డిని డిశ్చార్జి చేశారు. ఆస్పత్రి గేట్ వరకు వీల్‌చైర్‌లో తీసుకెళ్లవలసిన పేషంట్ కేర్ టేకర్ ఎవరూ అందుబాటులో లేకపోవటంతో బాలుడిని తల్లి గేట్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లింది. అదే సమయంలో వీల్‌చైర్‌లో ఆస్పత్రి సిబ్బంది వాటర్ బాటిల్‌ను తీ సుకెళ్లటం కనిపించింది. ఆస్పత్రిలో కేర్ టేకర్లు, వీల్ చైర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేదని పేషెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఆస్పత్రి వైద్యులు నాణ్యమైన సేవలందిస్తూ గుర్తింపు పొందుతుంటే సిబ్బంది మాత్రం రోగులతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment