
ఓపీ కోసం వేచివున్న రోగులు
సాక్షి, కుప్పం: కుప్పం వంద పడకల ఆస్పత్రిలో అన్ని సదుపాయాలున్నా.. రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ పనిచేసే సిబ్బందికి పాలకపక్షం మధ్య నెలకొన్న రాజకీయ విభేధాలే కారణం. ప్రస్తుతం ఈ విభేధాల వల్ల వైద్యాధికారులు రెండు గ్రూపులుగా విడిపోయి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. సోమవారం ‘సాక్షి’ విజిట్‌చేయగా..
ప్రసూతి విభాగంలో గర్భవతులకు నరకం తప్పడం లేదు. ఇక్కడి సిబ్బంది గర్భిణులను తీవ్రంగా దుర్భాషలాడుతూ.. ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లకు వెళ్లాలని సూచిస్తున్నారు. విద్యుత్ సమస్యతో రోగులకు వైద్యం అందడం ఆలస్యమవుతోంది. సోమవారం 356 మంది ఓపీకి వచ్చారు. శ్రీకాళహస్తిలో గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు.
చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో..
చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో రోగులకు సకాలంలో నాణ్య మైన వైద్యసేవలు అందడం లేదు. సోమవారం ఓపీకి 1454 మంది వచ్చారు. ఆప్తమాలజీ ఓపీలో గంట పాటు వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. డయాలసిస్ విభాగం పని చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment