జూలై 1 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ
గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమయ్యే పసికందులకు జూలై 1వ తేదీ నుంచి బేబీకేర్ కిట్స్‌ను అందించనున్నారు. ఈ మేరకు బుధ వారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్యులు విడుదల చేశారు. పసికందులకు దోమతెర, చేతుల పరిశుభ్రం చేసుకునే స్క్రబ్, బేబిని గుడ్డలో చుట్టి ఉంచేందుకు రెండు బేబిరేపర్లు, ప్లాస్టిక్‌కిట్ బ్యాగ్ మొత్తం రూ.600 ఖరీదు చేసే కిట్‌ను అందిస్తారు.
నేషనల్ హెల్త్ మిషన్, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు సంయుక్తంగా ఈ కిట్‌లను అందించనున్నారు. పుట్టకతో సంభవించే శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కిట్‌లను అందిస్తుంది. ఏడాదిలో సుమారు ఐదు లక్షల కాన్పులు జరుగుతాయని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ధారణ చేసి రూ.10 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, రూ.20 కోట్లు కార్మికశాఖ సంక్షేమ బోర్డు ద్వారా విడుదల చేయనున్నారు.
నవజాత శిశువులకు బేబీకేర్ కిట్స్
Published Thu, Jun 16 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM
Advertisement