మానవుడు జీవించాలంటే ప్రతిక్షణం శ్వాస ఎంతో ముఖ్యం. నీరు, ఆహారం లేకపోయినా కొన్నిరోజుల వరకు జీవించగలరు. కానీ కొన్ని క్షణాలు శ్వాస లేకపోతే శరీరం నిర్జీవమే. స్వచ్ఛమైన గాలి ద్వారా చాలావరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆస్తమా వలన వారి దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏవైనా వాతావరణ మార్పులు, ఆహారంలో మార్పులు, కాలుష్యం, పొగ త్రాగడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఎక్కడికి వెళ్లాలన్నా అభద్రత భావానికి లోనవుతారు. 2005 లెక్కల ప్రకారం 115 మిలియన్లు అంటే ప్రపంచంలో 1/3 జనాభా ఇండియాలో ఉన్నారు. సుమారు 300 మిలియన్ల జనాభా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆస్తమా అంటే స్వేచ్ఛ లేని శ్వాస. ‘ఊపిరితిత్తులు దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా శ్వాసకోశాలు, ఊపిరితిత్తులలో గాలిమార్గం అడ్డుకొని శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనపడతాయి
శ్వాసకోశ మార్గంలో వాపు, ఎరుపుదనం, శ్వాసనాళాలు కుంచించుకుపోవడం.
బ్రాంకియల్ కండరాల స్పాసమ్ వలన శ్వాసమార్గ ప్రక్రియలో ఇబ్బందులు కూడా కనిపిస్తాయి.
రోగ నిర్ధారణ
వంశానుగత చరిత్ర, అలర్జీలు, ఎగ్జిమా, చర్మవ్యాధులు, చిన్నతనంలో శ్వాసకోశ జబ్బులు
శారీరక పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతి పరీక్షలు
ఎక్స్-రే కఫం పరీక్ష పీఎఫ్‌టీ
అలర్జీ చర్మ పరీక్షలు: అలర్జెన్స్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి రియాక్షన్ చూడటం స్పైరోమెట్రి : శ్వాసమీటర్ ద్వారా పరీక్ష
గుండె ఊపిరితిత్తులు, రక్తలోపం, కిడ్నీ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఏవైనా ఉంటే వాటి నిర్ధారణ.
ఆస్తమాతో జీవించడమెలా?
ఆస్తమాతో బాధపడేవారు కూడా సాధారణ వ్యక్తుల్లాగే తమ రోజువారీ పనులు చేసుకోవచ్చంటూ ప్రోత్సహించాలి.
రాత్రి, పొద్దున్న వచ్చే శ్వాస ఇబ్బందులను నివారించటం, నిర్మూలించం, తగ్గించటం.
ఎక్కువ శారీరక శ్రమలేని ఉపాధి చేసుకోవడం.
దుమ్ము ధూళి, పొగ, చల్లటి వాతావరణాల నుండి దూరంగా ఉండటం.
ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్ బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్‌షీట్స్, బెడ్స్, బ్లాంకెట్స్‌లో డస్ట్‌మైట్స్ (చిన్న పరాన్నజీవులు) ఉంటాయి కాబట్టి రోజుకొకసారి ఎండలో వేయటం, తరచూ నీటితో శుభ్రం చేయటం.
పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి.
ఎక్కువ తేమ శాతం ఉంటే డస్ట్‌మైట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుందని గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలి.
రోగ నివారణ
బ్రాంకోడయలేటర్స్, కార్టికో స్టెరాయిడ్స్, ఆంటీబయాటిక్స్, స్ప్రేస్, మందులు... వీటివలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాని వ్యాధి మళ్ళీ తిరగబెడుతుంది. దీర్ఘకాలికంగా వాడటం వలన మందుల సైడ్‌ఎఫెక్ట్స్, పిల్లల పెరుగుదల లోపాలు, మానసిక ఆందోళన, జ్ఞాపకశక్తి తరుగుదల, బరువు పెరగడం వంటివి కలగవచ్చు.
ఆస్తమాను ఎలా నివారించవచ్చు?
మెడిటేషన్, యోగా వలన చాలా వరకు నివారించవచ్చును.
టొబాకో, పొగత్రాగడం, కాలుష్యపదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా.
స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం ద్వారా.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే... వాళ్లకు ఆ ప్రదేశం వల్ల ఆస్తమా వస్తోందని గుర్తించి అక్కడి నుండి వేరే ప్రదేశానికి మారడం.
హోమియో వైద్యం
హోమియో వైద్యం ద్వారా ఆస్తమాకు చక్కటి చికిత్సను అందించవచ్చు. ముఖ్యంగా పిల్లలలో కలిగే అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు, శారీరక, మానసిక విశ్లేషణ ద్వారా వారి కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్‌ను గుర్తించి తగిన చికిత్స జరిపి, వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చును.
వాడదగిన మందులు
ఆంటీమ్‌టార్ట్, యాంటీమోనియమ్ అర్స్, ఆర్సినిక్ ఆల్బ్, స్పాంజియా, లోబిలియా, నేట్రంసల్ఫ్, ఆరీలియా, కార్బొవెజ్
ఆస్తమాకు ముఖ్య కారణాలు
చల్లగాలి (చల్లటి వాతావరణం)
దుమ్ము ధూళి పొగ (సిగరెట్)
అలర్జెన్స్, గడ్డిచెట్లు, ఫంగస్, పొల్యూషన్
కెమికల్ పర్‌ఫ్యూమ్స్ (ఘాటు వాసనలు)
వైరల్ ఇన్‌ఫెక్షన్
పిల్లి, గుర్రం, కుక్క వంటి పెంపుడు జంతువుల విసర్జన పదార్థాలు
శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్స్ ముఖ్యంగా పిల్లలలో.
డాక్టర్ మురళి అంకిరెడ్డి,
ఎం.డి (హోమియో),
స్టార్ హోమియోపతి,
సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
రాజమండ్రి, కర్ణాటక
www.starhomeo.com
ph: 7416107107 / 7416109109
ఆస్తమా - నివారణ హోమియో చికిత్సలు
Published Sat, Nov 9 2013 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement