Homoeo treatment
-
హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 32 ఏళ్లు. గత రెండు మూడు రోజుల నుంచి చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది. వెంటనే తుమ్ములుకూడా ఎక్కువగా వస్తున్నాయి. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. అలర్జిక్ రైనైటిస్ అన్నారు. మందులు వాడాను. కానీ బాధలు అలాగే కొనసాగుతున్నాయి. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ►కారణాలు: ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. ►లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►చికిత్స: హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. సయాటికాబాధతగ్గుతుందా? నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో బాధపడుతున్నాను. ఎమ్మారై తీసి, డిస్క్ బల్జ్‌తో పాటు సయాటికా అన్నారు. హోమియోలో వైద్యం ఉందా? ఇటీవల సయాటికా అనే పదాన్ని వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. సయాటికాను గురిచి సరైన సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని హోమియో చికిత్స చేఇంచుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలోని నరాలన్నింటిలోనూ పొడవైనది సయాటికా. ఇది వీపు కింది భాగం నుంచి పిరుదుల మీదుగా పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 – 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ►కారణాలు: ∙ఎముకల్లో ఏర్పడే స్పర్శ వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది ∙దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరంపై వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది ∙గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది ∙శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు. ►లక్షణాలు: ∙కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం ∙కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం ∙రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి రావడం ∙బరువులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►నిర్ధారణ పరీక్షలు: ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై ►చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు ఈ అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది. ఆటిజమ్‌కు చికిత్స ఉందా? మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవడలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. -
ఇప్పటికీ పక్క తడుపు తున్నాడు...
హోమియో కౌన్సెలింగ్స్ మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్న వయసు నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. వాడి సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్సతో వాడి సమస్యను పరిష్కరించవచ్చా? – ఎస్కె. నూర్‌బాషా, గుంటూరు మీ బాబు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే ఈ అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఈ సమస్య చిన్న పిల్లల్లోనే గాక కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతపడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు. కారణాలు: నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు (ముఖ్యంగా డౌన్‌సిండ్రోమ్), ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువ సార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. చికిత్స: పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలను దండించకూడదు. హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కాళ్ల మీద రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి? నా వయసు 47 ఏళ్లు. పట్టుమని పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు విపరీతంగా లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. – డి. కౌసల్య, కొత్తగూడెం మీరు వేరికోస్ వెయిన్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: ’ కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? – ఎస్. రమేశ్‌బాబు, మహబూబ్‌నగర్ మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటి? తగ్గుతుందా? ఫ్యామిలీ డాక్టర్
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 46 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – టి. రామకోటేశ్వరరావు, విజయవాడ జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: ∙20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ హైపో థైరాయిడిజమ్ సమస్య నయమవుతుందా? నా వయసు 37 ఏళ్లు.ఈ మధ్య నేను బరువు పెరుగుతున్నాను. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో డాక్టర్‌ను సంప్రదిస్తే టీఎస్‌హెచ్ పరీక్ష చేయించారు. హైపోథైరాయిడిజమ్ అని తెలిసింది. హోమియోలో ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? – ఒక సోదరి, నిజామాబాద్ మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙బరువు పెరగడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ రుమ టాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుందా? నా వయసు 57 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉంటున్నాయి. కీళ్లవద్ద ఎర్రగా మారుతోంది. హోమియోలో పరిష్కారం ఉందా? – వెంకటేశ్వరరావు, కర్నూలు సొంత రోగనిరోధక శక్తే దెబ్బతీసే ఆటోఇమ్యూన్ వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే వారిలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు బయటపడతాయి. ఇది మహిళలు, పురుషులు, కొన్ని సందర్భాల్లో పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాలు: ఈ వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే ఉండకపోవచ్చు. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేవు. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
గౌట్‌తో ఎంతో బాధ..
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 45 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. విపరీతమైన నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎమ్. అహ్మద్‌బాషా, కందుకూరు గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఇది వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టమౌతాయి. ఆ కండిషన్‌నే ‘గౌట్’ అంటారు. కారణాలు: ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు:తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి.చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది.మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది.ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మూత్రంలో మంట... తగ్గేదెలా? నా వయసు 37 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. – సోదరి, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో ఇవి చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే హెచ్ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం. హోమియోపతి చికిత్స: రోగిలో మళ్లీ మళ్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి హోమియో మందులు తోడ్పడతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలు, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ వెన్ను నొప్పి తగ్గుతుందా? నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? వివరించగలరు. – డి. బాలసుందరం, పెనుగంచిప్రోలు ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన సమస్య. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరతావన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి హోమియోలో కోబాల్ట్ లాంటి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పిలకు ఆస్కు్కలస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
పీసీఓడీ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – భద్రారెడ్డి, చిత్తూరు గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగి భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: హోమియోలో సరైన కాన్స్టిట్యూషన్ సిమిలియం విధానంలో హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ హైపోథైరాయిడిజమ్‌కు చికిత్స ఉందా? నా వయసు 36 ఏళ్లు. ఈ మధ్య నేను బరువు పెరుగుతున్నాను. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? – ఒక సోదరి, మిర్యాలగూడ మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హోమియో విధానంలో హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే చాలా రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్ర విసర్జన సమయంలో మంట! నా వయసు 30 ఏళ్లు. ఇటీవల మూత్రం వెంటవెంటనే వస్తోంది. అంతేకాదు విసర్జన సమయంలో చాలా మంటగానూ ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి. – కె. లలిత, కాకినాడ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. ఇవి మహిళల్లో చాలా ఎక్కువే. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ∙అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. ∙లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లోని దాదాపు 90 శాతం కేసుల్లో ఈ సమస్యకు ప్రధానంగా కారణం ఈ–కొలై అనే బ్యాక్టీరియా. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స: హోమియోలో వ్యా«ధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి మందులను సూచిస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఎంతో కాలంగా మెడనొప్పి...
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 54 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? – కె. దశరథ్ కుమార్, అనంతపురం మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో బ్యాలెన్స్ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్నుంచి విముక్తి ఎలా? నా వయసు 39 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? – ఎస్. దయాకర్‌రావు, నిజామాబాద్ సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్ నయమవుతుందా? నా వయసు 62 ఏళ్లు. నాకు మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని, ఆపరేషన్ తప్పదంటున్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – వేణుగోపాలరావు, సంగారెడ్డి మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. ఆహారంలో పీచుపదార్థాలు తగ్గడం వల్ల మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇటీవల మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రకమైన సమస్యలు చాలా మందిలో గతంలో కంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. అయితే హోమియో వైద్య విధానంలో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేసే అవకాశం ఉంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట వంటివి కనిపిస్తాయి. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే నయం చేయవచ్చు. ఏ సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పీసీవోడీకి చికిత్స ఉందా?
నా భార్య వయసు 35 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – టి. లక్ష్మణ్‌రావు, విజయనగరం రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మావాడికి ఆస్తమా... తగ్గుతుందా? ఇప్పుడు మా కొడుకు వయసు 22 ఏళ్లు. వాడికి పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. మావాడికి ఉన్న ఉబ్బసం ఎలా తగ్గుతుంది? – మోహన్ ప్రసాద్, కొత్తగూడెం ఉబ్బసం (ఆస్తమా) అనేది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన దీర్ఘకాలిక మొండి వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. దాదాపు 80 శాతం మంది ఆస్తమా రోగుల్లో ఈ వ్యాధి 18 ఏళ్ల లోపు వయసులోనే మొదలవుతుంది. కారణాలు : ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ మార్పులు, చల్లగాలి ∙ ఇన్ఫెక్షన్స్ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి రేణువులు ∙వంశపారంపర్యం మొదలైనవి. లక్షణాలు : ∙ఆయాసం ∙దగ్గు రాత్రిపూట రావడం ∙గాలి తీసుకోవడం కష్టం కావడం; పిల్లికూతలు ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం. వ్యాధిగ్రస్తులందరిలో ఈ లక్షణాలన్నీ ఉండాలని ఏమీ లేదు. వీటిల్లో కొన్ని లక్షణాలు మాత్రమే ఉండవచ్చు. చికిత్స : ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. హోమియో విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్, స్పాంజియా వంటి మందులను నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
నిద్రలో పక్క తడుపుతున్నాడు.. పరిష్కారం ఏంటి?
హోమియో కౌన్సెలింగ్స్ మా బాబుకు 12 ఏళ్లు. చిన్నప్పటి నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? – సుహాసిని, అశ్వారావుపేట రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే ఈ అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఇది కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్క తడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు. కారణాలు: నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ సమస్యలు, వంశపారంపర్య కారణాల వల్ల, కొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువసార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. చికిత్స: పక్క తడిపే పిల్లలను మందలించడం, దండించడం తగదు. హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మూడేళ్లుగా రుతు సమస్య... పీసీఓడీ అంటున్నారు! నా వయసు 25 ఏళ్లు. మూడేళ్లుగా రుతు సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే పీసీఓడీ అంటున్నారు. పరిష్కారం చెప్పండి. – రమ్య, హైదరాబాద్ ఈమధ్య ఈ సమస్యతో బాధపడే స్త్రీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సరైన జీవనశైలి కొరవడటం, వ్యాయామం చేయకపోవడం, జంక్‌ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి విస్తృతి పెరుగుతోంది. పీసీఓడీ వల్ల మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో సంతానలేమి, రుతుసమస్యలు ముఖ్యమైనవి. ఈ ఒవేరియన్ సిస్ట్ సమస్యలో హార్మోన్ల అసమతౌల్యత వల్ల అండాశయం (ఓవరీ)లో నీటిబుడగలు ఏర్పడతాయి. అండాశయం చుట్టూ దళసరి పొర ఏర్పడుతుంది. వీటి వల్ల రుతుచక్రమంలో అండం విడుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి రుతుక్రమంలో మార్పులు జరిగి సంతానలేమి సమస్యకు దారితీస్తుంది. కారణాలు: అధిక బరువు, జంక్‌ఫుడ్ తినడం ∙హార్మోన్ల అసమతౌల్యత ∙డయాబెటిస్, హైపోథైరాయిడ్ సమస్యలు ∙గర్భనిరోధక మాత్రలు వాడటం... లక్షణాలు: రుతుక్రమం సరిగా రాకపోవడం ∙రుతుక్రమం వచ్చినప్పుడు అధిక రక్తస్రావం ∙అవాంఛిత రోమాలు ∙ముఖంపై మొటిమలు ∙రుతుక్రమం సరిగా ఉన్నా ఒక్కోసారి అండం సరిగా విడుదల కాకపోవడం. వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్ పెల్విక్ ఆర్గాన్ ∙ఎఫ్ఎస్హెచ్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ పరీక్షలు ∙టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్షలు చికిత్స: పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ)కు హోమియోలో మంచి పరిష్కారం ఉంది. వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులు ఇస్తారు. దీనికి సెపియా, గ్రాఫైటిస్, పల్సటిల్లా, కాల్కేరియా కార్బ్, ఇగ్నీషియా, తూజ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సమూలంగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ సోరియాసిస్ సమస్య వేధిస్తోంది... నా వయసు 32 ఏళ్లు. మూడు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎన్ని మందులు వాడినా తాత్కాలికమైన ఉపశమనమే ఉంది. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. దీనికి హోమియోలో మందు ఉందా? – ఎమ్. రాజేశ్వరరావు, గుంటూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. కారణాలు : వంశపారంపర్యం లేదా అధిక ఒత్తిడి ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు సోరియాసిస్‌కు ప్రధాన కారణం. లక్షణాలు: ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది ∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి ∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 42 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా?– సుధారాణి, కర్నూలు గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు: ఇవి ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కాళ్ల మీద రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి! నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి. – శ్రీదేవి, కొత్తగూడెం మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య ఎక్కువ. లక్షణాలు: ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్ర విసర్జన సమయంలో మంట! నా వయసు 28. ఈమధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఒక సోదరి, విజయవాడ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ►అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ►లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ప్రభావితమవుతాయి. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి హోమి యో మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
చల్లగాలి సోకితే చాలు.. ఒకటే తుమ్ములు
నా వయసు 28 ఏళ్లు. గత రెండు మూడు రోజుల నుంచి చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది. వెంటనే తుమ్ములుకూడా ఎక్కువగా వస్తున్నాయి కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. అలర్జిక్ రైనైటిస్ అన్నారు. మందులు వాడాను. కానీ బాధలు అలాగే కొనసాగుతున్నాయి. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? – జయరాజు, నెల్లూరు అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. కారణాలు: ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది ∙ పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఒకవైపే వస్తే... మైగ్రేన్ తలనొప్పి నాకు వారంలో రెండు సార్లు విపరీతమైన తలనొప్పి వస్తోంది. రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ చేయించాను. మైగ్రేన్ అని, జీవితాంతం వస్తుంటుంన్నారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? – వినీత్, విజయనగరం తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత కచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటు, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు ఆహారంలో మార్పులు, ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తెల్లమచ్చలు... నలుగురిలోకి వెళ్లాలంటే... నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది. హోమియో మందులతో తగ్గుతుందా? – నవీన్, కర్నూలు చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లిలో ఈ ఎంజైమ్ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. మెలనిన్ విడుదలకు అంతరాయం వల్ల చర్మం రంగు కోల్పోతుంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం – జన్యుపరమైన కారణాలు – దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు ∙మందులు, రసాయనాలు ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్లలో లోపాలు – వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా మన సొంత వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
నేసల్ పాలిప్స్ తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. కొంతకాలంగా నా ముక్కులో కండలా పెరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. తరచూ జలుబు వంటి సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే నేసల్ పాలిప్స్ అని, శస్త్రచికిత్స చేయాలని అంటున్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో చికిత్స అందుబాటులో ఉందా? – భాస్కర్‌రావు, విజయవాడ సాధారణంగా ముక్కు లోపలి భాగం, సైనస్‌లు (కపాలంలోని గాలితో నిండిన కుహరాలు) ఒక విధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొర ఒక విధమైన పల్చటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కు, సైనస్‌లను తేమగా ఉంచుతూ, ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించే దుమ్ము–ధూళితో పాటు ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల్లాంటి (సీలియా) నిర్మాణాల సహాయంతో గొంతులోకి, ముక్కులోకి చేర్చి... ఆ తర్వాత బయటకు పంపేస్తుంది. ఇది ముక్కులో జరిగే సాధారణ ప్రక్రియ. ముక్కులోని ఆ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్కు గురైతే, అది గురుత్వాకర్షణశక్తి కారణంగా కిందికి వేలాడటం వల్ల పాలిప్స్ ఏర్పడతాయి.ఇవి ఒకటిగా లేదా చిన్న చిన్న పరిమాణాల్లో గుంపుగా ఏర్పడచవచ్చు. అలా ముక్కులో ఉన్న మృదువైన కండ పెరుగుదలనే నేసల్ పాలిప్స్ అంటారు. అవి క్రమంగా పెరిగి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. కారణాలు : ఈ సమస్యకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే తరచూ ఇన్ఫెక్షన్స్ గురికావడం, ఆస్తమా, దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు, అలర్జిక్ రైనైటిస్, వంశపారంపర్య కారణాల వంటి అనేక అంశాలన్నీ ఈ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది; నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి రావడం. గురక రావడం; వాసన, రుచి గుర్తించే శక్తి తగ్గడం.తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. చికిత్స : హోమియోలో నేసల్ పాలిప్ సమస్యతో పాటు మిగతా శ్వాసకోశ సమస్యలన్నింటినీ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం చికిత్స ద్వారా నయం చేయవచ్చు. రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూర్చడం ద్వారా సమస్య మళ్లీ తిరగబెట్టకుండా శాశ్వతంగా సమస్యను తగ్గించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
మహిళలకు ఏ వయసులో గుండెజబ్బులు వస్తాయి?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. నేను మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. గత పదేళ్లుగా కిడ్నీలో, మూత్రనాళంలో రాళ్లతో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించట్లేదు. ఒకసారి ఆపరేషన్ కూడా అయింది. మళ్లీ రాళ్లు ఉన్నాయంటున్నారు. దీనికి హోమియోలో పరిష్కారం ఉంటే చెప్పగలరు. - బి.సురేందర్, ఆదిలాబాద్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఒక సర్వే ప్రకారం మన దేశంలో పురుషుల్లో 10.6 శాతం మంది, స్త్రీలలో 7.1 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, స్థూలకాయం, జన్యుపరమైన ఇన్ఫెక్షన్లు, ఎక్కువగా వేడి వాతావరణంలో ఉండటం, మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, వంశపారంపర్యత, కొన్ని రకాల మందుల వాడకం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా భావించవచ్చు. లక్షణాలు: పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, నీరసం, వికారం, తీవ్రమైన జ్వరం, విపరీతమైన చెమటలు, బరువు తగ్గడం, మూత్రంలో రక్తం పడటం, మూత్రంలో మంటతో కూడిన చీము పడటం. జాగ్రత్తలు * నీటిని ఎక్కువగా తాగడం, నీరుగాని ఇతర ద్రవపదార్థాలు గాని మొత్తం కలిపితే రోజుకు నాలుగు లీటర్లకు తగ్గకుండా తీసుకోవాలి. * కిడ్నీలో ఆక్సలేట్ రాళ్లు ఉంటే, ఆక్సలేట్ ఉండే పదార్థాలు అంటే చాకొలేట్, పాలకూర, సోయా, చిక్కుడు వంటివాటిని బాగా తగ్గించాలి. * కాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి ఇవి శరీరానికి అందేలా ఆహార నియమాలను పాటించడం మంచిది. * కూల్‌డ్రింక్స్‌ను పూర్తిగా మానేయడం మంచిది. నిర్థారణ: కిడ్నీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, కిడ్నీ పరీక్ష, రక్తపరీక్ష, మూత్రపరీక్ష హోమియో చికిత్స హోమియోపతిలో శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా కిడ్నీ రాళ్ల పరిమాణం, అవి ఏ వైపున ఏర్పడ్డాయో, వాటి ఆధారంగా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బెరి బెరి వల్గారిస్, సారస్పరిల్లా, కాల్కేరియా కార్బ్, కోలోసింత్ మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. స్టార్ హోమియోపతిలో రోగిలోని రోగ నిరోధక శక్తిని పెంచుతూ, ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లూ లేకుండా, శస్త్రచికిత్సతో అవసరం లేకుండా కిడ్నీలు, మూత్ర నాళాలలోని రాళ్లను తొలగించే మందుల వాడకం ద్వారా సమస్యకు శాశ్వత చికిత్స లభిస్తుంది. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. ఇటీవల నా భర్తకు ఛాతీలో నొప్పి వచ్చిందని ఆసుపత్రికి తీసుకెళ్తే గుండె రక్తనాళాల్లో పూడిక ఏర్పడిందని చెప్పి స్టెంట్ వేశారు. తర్వాత మా ఆయన మళ్లీ సాధారణ జీవితం గడపగలుగుతున్నారు. ఇటీవల మా ఆయనకు వచ్చినట్లే నాకు కూడా ఛాతీలో నొప్పి వస్తోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఎక్కువ సేపు నడిచినప్పుడు నొప్పి ఎక్కువవుతోంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ సాధారణంగా అవుతోంది. అయితే నా వయసు గల మహిళలకు గుండెజబ్బులు రావని తెలిసిన వాళ్లు అంటున్నారు. నాకు గుండెజబ్బు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. - మాధవి, కర్నూలు ఒకప్పుడు మహిళలకు త్వరగా గుండె జబ్బులు వచ్చేవి కావు. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగాలు చేసే మహిళల్లో గుండెజబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్యాలయలలో పనిభారంతో పాటు ఇంట్లో పనిభారం కూడా పెరిగిపోవడంతో మహిళలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మీ కుటుంబంలోగానీ, మీ వంశంలోగాని ఎవరికైనా గుండెజబ్బులు ఉన్నా, మీకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఏమైనా ఉన్నా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎన్ని రోజులుగా ఛాతీలో నొప్పి వస్తోందో మీరు తెలపలేదు. మీరు రాసిన లక్షణాలను బట్టి గుండెజబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మీ ఆరోగ్యపరిస్థితిని బట్టి చికిత్స ప్రారంభిస్తారు. ఒకవేళ మీకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నా భర్త వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఏడాది అయ్యింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. మేమేమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా? - సరళ, హైదరాబాద్ గర్భధారణ కోరుకుంటున్నప్పుడు అందుకోసం ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ప్రధానం. ముందుగా మీరిద్దరి సాధారణ ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. మీకు డయాబెటిస్, హైబీపీ, గుండె సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలుంటే ముందుగానే డాక్టర్‌కు చూపించుకోవాలి. ఒకవేళ ఏమైనా సమస్యలుంటే గర్భధారణ సమయంలో వాటివల్ల వచ్చే కాంప్లికేషన్లు ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పటికే ఏమైనా మందులు వాడుతున్నట్లయితే, గర్భధారణ సమయంలో తల్లికీ, బిడ్డకూ అవి సురక్షితమేనా అని డాక్టర్ ద్వారా సరిచూసుకోవాలి. సాధారణంగా చాలామంది దంపతుల్లో తాము ప్లాన్ చేసుకున్న ఆర్నెల్లలో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇక శరీర బరువు మరో ప్రధానమైన అంశం. మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) గనక 35 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా లేదా 19 కంటే తక్కువ ఉన్నా గర్భధారణ జరగడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. అందుకే ఆరోగ్యకరంగా ఉండాల్సిన బరువు ఉంటూ బీఎమ్ఐను ఆ విలువల మధ్య ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మీ భర్తకు పొగతాగే అలవాటు ఉంటే అది గర్భధారణపైన దుష్ర్పభావం చూపవచ్చు. మీ భర్తకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మానేయమని చెప్పండి. ఎందుకంటే ఆల్కహాల్ వీర్యకణాల నాణ్యతను తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడి నుంచి ఇద్దరూ దూరంగా ఉండండి. ఎందుకంటే ఒత్తిడి కూడా గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. ఇక అన్నిటి కంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రతిరోజూ 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకొండి. దీనివల్ల బిడ్డ మెదడు ఎదుగుదల బాగుండటంతో పాటు బిడ్డలో వెన్నుపాము సంబంధించిన లోపాలు రాకుండా ఉంటాయి. మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మీ డాక్టర్‌ను సంప్రదించండి. -
ఎముక క్యాన్సర్‌కు హోమియో వైద్యం
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించి, అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని ఆధ్వర్యంలో చికిత్స జరిగితే వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. కాన్స్టిట్యూషనల్ హోమియోవైద్యం ద్వారా క్యాన్సర్ కణాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటూనే హోమియో చికిత్సనూ అనుసరిస్తే... ఇతర దుష్ర్పభావాలు రాకుండా అరికట్టవచ్చు. కొన్ని ముఖ్యమైన హోమియో మందులు హెక్లాలావా: ‘ఆస్టియోసార్కోమా’ వంటి ఎముక క్యాన్సర్, దవడ ఎముక, చీలమండ లోపలి ఎముక (టిబియా)లో వచ్చే క్యాన్సర్లకు వాడదగిన ఔషధం. హైడ్రాస్టిస్ కెనడెన్సిస్: పూర్తి క్యాన్సర్ దశలో వాడదగిన ఔషధం. ఇది ముఖ్యంగా ఎముకలు, నాలుక, ఉదరం, జననాంగాలపై వచ్చే క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్స తర్వాత వచ్చే కండరాల బలహీనతను అధిగమించడానికి ఉపయోగపడుతూనే కండరాల పటుత్వాన్నీ పెంచుతుంది. కాల్కేరియా ఫాస్: వివిధ రకాల క్యాన్సర్ మందులు పూర్తిస్థాయిలో పనిచేయకుండా ఉన్నప్పుడు వాటిని క్రియాశీలం చేసేందుకు కాల్కేరియా ఫాస్ చక్కగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు లేదా ఎముకల ఫ్రాక్చర్లు త్వరగా తగ్గిపోడానికీ, చిన్నపిల్లల్లో వచ్చే ఎముక క్యాన్సర్లు తగ్గడానికి పనిచేస్తుంది. మెజీరియం: ఇది ఎముక, దాని చుట్టూ ఉండే కవచంపైన ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఎముక నుంచి ఏర్పడే ద్రవంతో కూడిన సిస్టిక్ ట్యూమర్, నుదురు, దవడ ఎముకల్లో వచ్చే చీముగడ్డల నివారణకు ఉపయోగపడుతుంది. సవాయిరోగాన్ని (సిఫిలిస్‌ను) అణచివేయడం వల్ల వచ్చే కపాల వాపు, కపాలంపై వచ్చే కణుతులకు చక్కగా పనిచేస్తుంది. ఫాస్ఫరస్: ఎముక క్యాన్సర్ ముఖ్యంగా తొడ ఎముక (ఫీమర్), కాలిచీలమండ లోపలి ఎముక (టిబియా) పెరుగుదల ఉన్నవారిలో, చీముతో కూడిన కాలి పుండ్లు ఉన్నవారిలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కారణంగా అధిక రక్తస్రావం జరగడం, ఎముక చుట్టూ ఉండే కవచం పుండుగా మారి ఊడిపోవడం... ఎముక గరుకుగా మారడం, మంటతో కూడిన నొప్పులు, జ్వరం, చల్లటిపదార్థాలు తీసుకోవాలనిపించడం, అస్థిమితం వంటి వాటికి ఇది మంచి మందు. రేడియం బ్రోమాటం: మొటిమలు, డర్మటైటిస్ అనే చర్మవ్యాధి కి, ఎముకల్లో నొప్పులు, కీళ్లనొప్పులు, ఎముక క్యాన్సర్‌కు పనిచేస్తుంది. ఆరమ్ మెట్: క్యాన్సర్‌తో మనోవ్యాకులతకు గురై ఆత్మహత్య చేసుకోవాలనిపించేవారికి పనిచేస్తుంది. సింఫైటమ్: అన్నిరకాల ఎముక సంబంధ వ్యాధులు... ముఖ్యంగా ఎముక వాపు, దవడవాపు, సార్కోమా వంటి సమస్యలకు వాడదగిన మందు. అంతేకాకుండా సింఫైటమ్ను ఎముక చీలికలు లేదా ఫ్రాక్చర్లు త్వరగా మానడానికి ప్రథమ చికిత్సగా వాడతారు. నరాల నొప్పి, మోకాలి నొప్పి, టెండన్స్ ఇబ్బందులకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. -
హోమియోతో కిడ్నీలో రాళ్ళకు చెక్
కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణాలు అనేకం. అవి ఎక్కువ కాలం ఉండిపోతే, కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. సర్జరీతో ఒకసారి తొలగించినా అవి ఏర్పడటానికి అసలు కారణమైన శరీరతత్వాన్ని మార్చనంతవరకు అవి మళ్లీ మళ్ళీ వస్తాయి. శరీరతత్వాన్ని మార్చి కిడ్నీలో రాళ్లను శాశ్వతంగా తొలగించడం కేవలం హోమియో వైద్యానికే సాధ్యం అంటున్నారు ప్రముఖ హోమియోనిపుణులు డాక్టర్ వాణీ రవికిరణ్. మూత్రపిండం, పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ల వల్ల తీవ్రనొప్పి వస్తుంటుంది. సాధారణంగా చిన్న రాళ్ళు అయితే వాటంతట అవే బయటకు వస్తుంటాయి. కాని పరిమాణంలో పెద్దగా అంటే కనీసం 2 - 3 మీల్లిమీటర్ల కంటే పెద్దగా ఉన్న రాళ్ళు కిడ్నీలోని వివిధ భాగాల్లో చిక్కుకుపోయి తీవ్ర నొప్పి మొదలవుతుంది. రోగికి వాంతులు కావటం, వికారంగా ఉంటుంది. కారణాలు: 40 ఏళ్లు దాటిన మహిళలు కాల్షియం, విటమిన్ డి 3 టాబ్లెట్లు ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. మాత్రలకు బదులు ప్రకృతి పరంగా లభించే కాల్షియం తీసుకున్నట్లయితే ఎముకలకు మంచిదీ, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. మంచినీరు తక్కువగా తాగటం మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడానికి కారణమవుతుంది. లక్షణాలు: మూత్రపిండంలో రాళ్ల వల్ల భరించలేని నొప్పి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉంటుంది. ఈ నొప్పి వీపు వెనుక భాగంలో నుంచి బయలుదేరి పొత్తికడుపులోకి వస్తుంది. తెంపరలుగా వచ్చే ఈ నొప్పి జననాంగాలలోకి పాకుతుంది. 20 నుంచి 90 నిమిషాల వరకు ఈ నొప్పి ఉంటుంది. తల తిరగటం, వికారం, వాంతులు కావటం, మూత్రంలో మంట రక్తం చీము రావచ్చు. చెమట, జ్వరం, కంగారుగా, కోపంగా ఉండవచ్చు. ఎటువైపు కదలినా, వంగినా నొప్పి నుంచి ఉపశమనం ఉండదు. కొన్నిసార్లు కాళ్లలో వాపు ఏర్పడవచ్చు. పిత్తాశయంలో రాళ్లు పిత్తాశయం అనేది కాలేయం నుంచి వచ్చే పైత్యరసాలను ఒడిసిపట్టే సంచి లాంటిది. ఇందులో ఉండే పైత్యరసాలు మనం తీసుకునే మాంసకృత్తులు, నూనె పదార్థాలను అరిగింపచేయడానికి ఉపయోగపడతాయి. పైత్యరసం గాఢత పెరిగినప్పుడు రాళ్ళు ఏర్పడతాయి. లక్షణాలు: పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ళు కొన్నేళ్ల పాటు లక్షణాలను చూపవు. ఎప్పుడైతే పెద్దవిగా మారుతాయో అప్పుడు లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల పొట్ట నొప్పి ఉంటుంది. కుడివైపు పొట్టలో నొప్పి మొదలై వీపు వెనుకభాగంలోకి చేరుతుంది. దీని వల్ల వికారం, వాంతులు, జ్వరం కనిపిస్తాయి. కారణాలు: పిత్తాశయంలో రాళ్లకు అధిక మాంసాహారం, పీచుపదార్థాలు తగ్గడం, బరువు పెరగడం, వంశపారంపర్యం, బరువు పెరుగతున్నామనే భావనతో ఆహారం తగ్గించడం, అనీమియా, ఆల్కహాల్, ధూమపానం, వేపుడు పదార్థాలు, కాల్షియం, విటమిన్ సి తగ్గడం వంటివి కారణాలు. హోమియో చికిత్స: కిడ్నీ, పిత్తాశయాల్లో రాళ్లను పూర్తిగా నయం చేయాడనికి హోమియోలో అత్యుత్తమ చికిత్స విధానాలు ఉన్నాయి. ఈ మందుల వల్ల రాళ్లు తొలగిపోవడమే కాకుండా భవిష్యత్‌లో మళ్లీ ఏర్పడకుండా చేయవచ్చు. డాక్టర్ వాణి రవికిరణ్, ప్రముఖ హోమియో వైద్యనిపుణులు, మాస్టర్స్ హోమియోపతి, అమీర్‌పేట్, కూకట్పల్లి, హైదరాబాద్, విజయవాడ. ఫోన్: 7842 106 106 / 9032 106 106 -
చిన్నకీళ్లను ప్రభావితం చేసే రుమటాయిడ్ ఆర్థరైటిస్...
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను వాడుకభాషలో వాతం అంటారు. దీని బారిన పడ్డవారు కీళ్లనొప్పులతో బాధపడుతుంటారు. కానీ వారికి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని తెలియదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే జీవక్రియల అసమతౌల్యత వల్ల మన వ్యాధినిరోధకశక్తే మనపట్ల ప్రతికూలంగా పనిచేయడం వల్ల ఇది వస్తుంది. మన శరీరంలోని వివిధరకాల కణజాలాలు, అవయవాలు, కీళ్లు (సైనోవియల్ జాయింట్స్), ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం, రక్తనాళాలు, చర్మంపై ఈ వ్యాధి తాలూకు దుష్ర్పభావం ఉంటుంది. సాధారణంగా కీళ్లనొప్పులు వచ్చిన ప్రతిసారీ నొప్పి నివారణ మందులు వాడి, దాని నుంచి ఉపశమనం పొందుతుంటారు. కానీ మందులు ఆపివేయగానే నొప్పులు మళ్లీ తిరగబెడతాయి. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి చికిత్స చేయించుకుని, వ్యాధిని అంకురం నుంచి సమూలంగా తొలగించుకోకపోతే... వ్యాధి తీవ్రత పెరిగి, కీళ్ల అమరికలో మార్పులు వచ్చి అది వైకల్యానికి దారితీస్తుంది. కాబట్టి సంపూర్ణంగా నయమయ్యేవరకు చికిత్స చేయించుకోవాలి. ఎవరెవరిలో... ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిలోనైనా కనిపించే అవకాశం ఉంది. కానీ యుక్తవయసులో ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మగవారిలో కంటే ఆడవారిలో ఇదివచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. రుతుక్రమం ఆగిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వంశపారంపర్యంగానూ వచ్చే అవకాశాలు ఎక్కువే. అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువినైల్ ఆర్థరైటిస్ అంటారు. లక్షణాలు వ్యాధిప్రభావం మన కణజాలంతో పాటు అవయవాలపై కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా కీళ్లు (సైనోవియల్ జాయింట్స్)పై వ్యాధి మరింతగా ప్రభావం చూపుతుంది. కీళ్లలో ఉండే సైనోవియల్ మెంబ్రేన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్కు గురికావడం వల్ల కీళ్ల వాపు, నొప్పి, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనపడతాయి. శరీరంలోని ఇరుపార్శ్వాలలో ఉండే కీళ్లలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించడం అన్నది ఈ వ్యాధి ముఖ్య లక్షణం. లక్షణాలు ముందుగా చిన్న కీళ్లు అయిన కాలివేళ్లు (మెటాటార్సో ఫాలింజియల్ జాయింట్స్), చేతివేళ్లు (మెటా కార్పో ఫాలింజియల్ జాయిడ్స్, ఇంటర్ ఫాలింజియల్ జాయింట్స్), మణికట్టు ఆ తర్వాత పెద్ద కీళ్లయిన భుజాలు, మోకాలు, తుంటి... ఈ వరసలో వ్యాపిస్తుంటాయి. దీర్ఘకాలం పాటు కీళ్లు ఇన్ఫ్లమేషన్కు గురికావడం వల్ల ఫైబ్రస్ కణజాలం ఏర్పడి, కొన్ని కీళ్లు వైకల్యానికి గురి అవుతాయి. దీన్నే డిఫార్మిటీ(స్) అంటారు. దీనిలో... బౌటనీర్ డిఫార్మిటీ, స్వాన్ నెక్ డిఫార్మిటీ, అల్నార్ డిఫార్మిటీ ముఖ్యమైనవి. వీటివల్ల కీళ్లు తమ సాధారణ అమరికను, కదలికలను కోల్పోతాయి. కీళ్లపై చర్మం లోపల చిన్న చిన్న కణుతులు వస్తాయి. వీటినే ‘రుమటాయిడ్ నాడ్యూల్స్’ అంటారు. ప్లూరా ఇన్ఫ్లమేషన్కు గురి అయి, ఫైబ్రోసిస్ కావడం వల్ల రుమటాయిడ్ లంగ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడ్డవారిలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం (అథెరోస్క్లిరోసిస్) వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. పైన పేర్కొన్న లక్షణాలే కాకుండా సాధారణంగా జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రక్తహీనత మొదలైన ఇతర లక్షణాలూ ఉండవచ్చు. రోగి నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్-ఫ్యాక్టర్, పీఆర్పీ, ఏఎన్ఏ, యాంటీ-సీసీపీ (సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్) మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. హోమియో చికిత్స: చాలారకాల ఆటో-ఇమ్యూన్ జబ్బులు సైకోసొమాటిక్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. అన్నిరకాల సైకోసొమాటిక్ డిజార్డర్స్‌కి హోమియోలో చక్కని పరిష్కారం లభిస్తుంది. అందులో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కూడా హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌కి ఇతర చికిత్స విధానాల్లో శాశ్వత నివారణ లేదు. కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభ్యమవుతుంది. కానీ హోమియోలో పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. అయితే ఈ మందుల్ని రోగి వ్యక్తిగత లక్షణాలు, స్వరూప స్వాభావాల ఆధారంగా నిపుణుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం ఎలా...? ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా చిన్న కీళ్లు దానిబారిన పడతాయి. ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో నొప్పి, వాపు ఉండటాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా చెప్పవచ్చు. ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోయి, సాధారణ కదలికలకూ సాధ్యం కాని విధంగా ఉంటాయి. దాదాపు రెండుగంటల పాటు అలా ఉన్న తర్వాత నిదానంగా అవి వదులవుతాయి. శరీరంలో ఇరువైపులా ఒకేవిధంగా కీళ్లు... నొప్పులకు, వాపునకు గురవుతాయి. చలికాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కీళ్ల ప్రాంతంలో చర్మం కింద ఫైబ్రస్ కణజాలం పెరగడంతో అది బయటకు చిన్న కణుతుల్లా కనిపిస్తుంటాయి. దీర్ఘకాలికంగా వ్యాధి ఉన్నప్పుడు కీళ్లనొప్పులతోపాటు కీళ్ల వైకల్యం (జాయింట్ డిఫార్మిటీ) రావచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ -
ఆస్తమా - నివారణ హోమియో చికిత్సలు
మానవుడు జీవించాలంటే ప్రతిక్షణం శ్వాస ఎంతో ముఖ్యం. నీరు, ఆహారం లేకపోయినా కొన్నిరోజుల వరకు జీవించగలరు. కానీ కొన్ని క్షణాలు శ్వాస లేకపోతే శరీరం నిర్జీవమే. స్వచ్ఛమైన గాలి ద్వారా చాలావరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆస్తమా వలన వారి దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏవైనా వాతావరణ మార్పులు, ఆహారంలో మార్పులు, కాలుష్యం, పొగ త్రాగడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఎక్కడికి వెళ్లాలన్నా అభద్రత భావానికి లోనవుతారు. 2005 లెక్కల ప్రకారం 115 మిలియన్లు అంటే ప్రపంచంలో 1/3 జనాభా ఇండియాలో ఉన్నారు. సుమారు 300 మిలియన్ల జనాభా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆస్తమా అంటే స్వేచ్ఛ లేని శ్వాస. ‘ఊపిరితిత్తులు దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా శ్వాసకోశాలు, ఊపిరితిత్తులలో గాలిమార్గం అడ్డుకొని శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనపడతాయి శ్వాసకోశ మార్గంలో వాపు, ఎరుపుదనం, శ్వాసనాళాలు కుంచించుకుపోవడం. బ్రాంకియల్ కండరాల స్పాసమ్ వలన శ్వాసమార్గ ప్రక్రియలో ఇబ్బందులు కూడా కనిపిస్తాయి. రోగ నిర్ధారణ వంశానుగత చరిత్ర, అలర్జీలు, ఎగ్జిమా, చర్మవ్యాధులు, చిన్నతనంలో శ్వాసకోశ జబ్బులు శారీరక పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతి పరీక్షలు ఎక్స్-రే కఫం పరీక్ష పీఎఫ్‌టీ అలర్జీ చర్మ పరీక్షలు: అలర్జెన్స్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి రియాక్షన్ చూడటం స్పైరోమెట్రి : శ్వాసమీటర్ ద్వారా పరీక్ష గుండె ఊపిరితిత్తులు, రక్తలోపం, కిడ్నీ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఏవైనా ఉంటే వాటి నిర్ధారణ. ఆస్తమాతో జీవించడమెలా? ఆస్తమాతో బాధపడేవారు కూడా సాధారణ వ్యక్తుల్లాగే తమ రోజువారీ పనులు చేసుకోవచ్చంటూ ప్రోత్సహించాలి. రాత్రి, పొద్దున్న వచ్చే శ్వాస ఇబ్బందులను నివారించటం, నిర్మూలించం, తగ్గించటం. ఎక్కువ శారీరక శ్రమలేని ఉపాధి చేసుకోవడం. దుమ్ము ధూళి, పొగ, చల్లటి వాతావరణాల నుండి దూరంగా ఉండటం. ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్ బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్‌షీట్స్, బెడ్స్, బ్లాంకెట్స్‌లో డస్ట్‌మైట్స్ (చిన్న పరాన్నజీవులు) ఉంటాయి కాబట్టి రోజుకొకసారి ఎండలో వేయటం, తరచూ నీటితో శుభ్రం చేయటం. పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి. ఎక్కువ తేమ శాతం ఉంటే డస్ట్‌మైట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుందని గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలి. రోగ నివారణ బ్రాంకోడయలేటర్స్, కార్టికో స్టెరాయిడ్స్, ఆంటీబయాటిక్స్, స్ప్రేస్, మందులు... వీటివలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాని వ్యాధి మళ్ళీ తిరగబెడుతుంది. దీర్ఘకాలికంగా వాడటం వలన మందుల సైడ్ఎఫెక్ట్స్, పిల్లల పెరుగుదల లోపాలు, మానసిక ఆందోళన, జ్ఞాపకశక్తి తరుగుదల, బరువు పెరగడం వంటివి కలగవచ్చు. ఆస్తమాను ఎలా నివారించవచ్చు? మెడిటేషన్, యోగా వలన చాలా వరకు నివారించవచ్చును. టొబాకో, పొగత్రాగడం, కాలుష్యపదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా. స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం ద్వారా. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే... వాళ్లకు ఆ ప్రదేశం వల్ల ఆస్తమా వస్తోందని గుర్తించి అక్కడి నుండి వేరే ప్రదేశానికి మారడం. హోమియో వైద్యం హోమియో వైద్యం ద్వారా ఆస్తమాకు చక్కటి చికిత్సను అందించవచ్చు. ముఖ్యంగా పిల్లలలో కలిగే అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు, శారీరక, మానసిక విశ్లేషణ ద్వారా వారి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్‌ను గుర్తించి తగిన చికిత్స జరిపి, వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చును. వాడదగిన మందులు ఆంటీమ్టార్ట్, యాంటీమోనియమ్ అర్స్, ఆర్సినిక్ ఆల్బ్, స్పాంజియా, లోబిలియా, నేట్రంసల్ఫ్, ఆరీలియా, కార్బొవెజ్ ఆస్తమాకు ముఖ్య కారణాలు చల్లగాలి (చల్లటి వాతావరణం) దుమ్ము ధూళి పొగ (సిగరెట్) అలర్జెన్స్, గడ్డిచెట్లు, ఫంగస్, పొల్యూషన్ కెమికల్ పర్ఫ్యూమ్స్ (ఘాటు వాసనలు) వైరల్ ఇన్ఫెక్షన్ పిల్లి, గుర్రం, కుక్క వంటి పెంపుడు జంతువుల విసర్జన పదార్థాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా పిల్లలలో. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
సైనసైటిస్ హోమియో చికిత్స
వాతావరణ మార్పులు జరిగే వర్షాకాలం, శీతాకాలం ప్రవేశించినప్పుడు సైనస్ అనే మాటను, ఆ వెంటే... సైనసైటిస్ వస్తే ఇక ఆపరేషనే శరణ్యం అని తరచు వింటూ వుంటాం. అయితే ఆపరేషన్ తరువాత కూడా ఇది మరల మరల వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తుందని దీని బారిన పడినవారు అంటూ వుంటారు. ఒక్క యూఎస్‌లోనే 24 మిలియన్ కు పైన దీనిబారిన పడుతుంటారు. దీనిని మూడు విభాగాలుగా మనం చూడవచ్చు. Acute వచ్చి ఒకవారం రోజులు ఉంటుంది Sub acute 48 వారాలు ఉంటుంది. Chronic- దీర్ఘకాలిక సైనసైటిస్. ఇది 8-10 వారాల పైన ఉంటుంది. సైనసైటిస్... ఇది 90 శాతంమందిలో కనిపించే సాధారణ సమస్య. దాదాపుగా ప్రతిమనిషి జీవనకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సైనసైటిస్ ఇన్ఫెక్షన్ వలన, వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్ఫ్లుయెంజా వలన వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నివారించడమే కాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నిరోధించవచ్చు. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగం ఇన్ఫెక్షన్లతో వాచిపోవడాన్ని ‘సైనటైసిట్’ అంటారు. సైనస్ రకాలు... ఫ్రంటల్ పారానాసల్ ఎత్మాయిడల్ మాగ్జిలరీ స్ఫినాయిడల్. ఇవి కుడి, ఎడమగా రెండు జతలుంటాయి. కారణాలు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శ్వాసకోశ వ్యాధులు ముక్కులో దుర్వాసన ముక్కులో దుర్వాసన పెరుగుదల అలర్జీ పొగ విషవాయువుల కాలుష్యం వాతావరణ కాలుష్యం అకస్మాత్తుగా వాతావరణ మార్పులు చలికాలం, వర్షాకాలం గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం మంచు ప్రదేశాలు: కొడెకైనాల్, ఊటీ, జమ్ముకాశ్మీర్, మనాలి, ముస్సోరి వంటి చోట్లకు వెళ్లడం నీటిలో ఈదటం జలుబు, గొంతునొప్పి పిప్పిపన్ను టాన్సిల్స్ వాపు రోగనిరోధకశక్తి తగ్గటం. వ్యాధి లక్షణాలు ముఖంలో భారంగా ఉండటం, తలనొప్పి, బరువు, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు దురద, నీరు కారటం, గొంతులోనికి ద్రవం కారటం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము, కోపం, మానసిక స్థైర్యం కోల్పోవటం, అలసట, విసుగు పనిపై శ్రద్ధ లేకుండటం, హోరు, దగ్గు. వ్యాధి నిర్ధారణ ఎక్స్‌రే ముఖ్యంగా ఇతర వ్యాధులతో కలిసి సైనసైటిస్ రావచ్చు. సైనస్ భాగంలో నొక్కితే నొప్పి సీటీ స్కాన్ ఇతర దుష్పరిణామాలు దీర్ఘకాలికంగా సైనసైటిస్ వ్యాధితో బాధపడేవాళ్లలో కనురెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరిగినట్లుండటం, కంటినరం దెబ్బతిని, తద్వారా చూపు కోల్పోవటం, వాసనలు తెలియకపోవటం, తరచు వచ్చే జ్వరం, ఎదుగుదల లోపాలు రావచ్చు. మానసికంగా ధైర్యం కోల్పోవటం జరగవచ్చు. సైనసైటిస్‌ను ఇలా నివారించవచ్చు నోటిని తరచు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండడం. అలర్జీకి సంబంధించిన దుమ్ము, ధూళికి దూరంగా ఉండి, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని చుట్టూ నీరు, బురద లేకుండా ఉంచుకోవడం. ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీస్తాయి. చల్లని పదార్థాలు తీసుకోవద్దు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవటం, వేడి ఆవిరి పట్టడం వలన కొంతవరకు నివారించవచ్చు. హోమియో చికిత్స హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కాలిబైక్, కాలిసల్ఫ్, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్ న్యురియా, లెమ్నా మైనర్, స్పైజిలియా వంటి మందులు ఉన్నాయి. హోమియోపతి ద్వారా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా సైడ్ఎఫెక్ట్స్ లేకుండా సమూలంగా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స ఉంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ అలర్జీ సెంటర్ ద్వారా ఎన్నో కేసుల్లో పూర్తిగా స్వస్థత కలిగించాం. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 9030081875 / 903000 8854 -
చెవి, ముక్కు, గొంతు సమస్యలు-హోమియో చికిత్స
చెవి, ముక్కు, గొంతు సమస్యలు కూడా ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యలు అన్ని కూడా రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన, మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన సమస్య తీవ్రత పెరిగి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది. 3)తల తిరగటం: ఇది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో గమనిస్తూనే ఉంటాము. ముఖ్యంగా పడుకున్నప్పుడు గాని, పడుకుని చాలా తొందరగా లేచినప్పుడు, సడెన్‌గా పైకి చూసినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవటం వలన కూడా ఇది వస్తుంది. 4) మీనియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో ముఖ్యంగా తల తిరగటం, సరిగ్గా వినిపించక పోవటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. 5) ఎకోస్టిక్ న్యూరోమా: ఇది చెవిలోపల ఒక కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరుమని శబ్దాలు, నడిచేటప్పుడు కూడా సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవటం, మొహం అంతా తిమ్మిరి రావటం వంటి లక్షణాలు వస్తాయి. కఖఐ పరీక్ష చేయించుకుంటే కణితి సైజ్ ఎలా ఉన్నది తెలుస్తుంది. 6) ల్యాబరింథైటిస్, వెస్టిబ్యులార్ మ్యారైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వలన ఈ సమస్య వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వలన వస్తుంది. చెవి మధ్యపొర నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో కూడా ముఖ్యంగా తల తిరగటం, వికారం, వినికిడిలోపం వంటివి ఉంటాయి. 7) ఓటో స్ల్కీరోసి్‌స్, టినిటస్ లాంటి సమస్యలు: ఇవి చెవిలోపల సర్వ సాధారణంగా గమనిస్తుంటాము. ఇదేవిధంగా ముక్కు లోపల కూడా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించి, ఎలర్జీ వంటి సమస్యలు వస్తూంటాయి. అవి... ఎలర్జిక్ సైనసైటిస్ ఎపిస్టాక్సిస్ సైనసైటిస్. ఈ పైన చెప్పిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తి క్షీణించటం వలన, సాధారణమైన జలుబు, తుమ్ములు, ముక్కు నుంచి విపరీతంగా నీరు కారటంతో మొదలయి, సరైన రీతిలో చికిత్స తీసుకోక, విపరీతమైన కఫం లేదా శ్లేష్మం గాలి రంధ్రాలలో పేరుకుపోయి, వాటికి వాపు వస్తుంది. ఈ సమస్యను సైనసైటిస్ అంటారు. దీనిలో తలబరువు, వికారం, వాంతులు, వాసన తెలియకపోవటం, నీరసం, అలసట, ఎవరి పనులు వారు చేసుకోలేక పోవటం వంటి సమస్యలు వస్తాయి. చెవి, ముక్కుకు వచ్చే సమస్యలు గొంతు సమస్యలకు కూడా దారి తీస్తుంటాయి. వీటిలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి రోజురోజుకి తగ్గి మొత్తం చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏర్పడుతుంటాయి. సాధారణంగా వచ్చే గొంతు సమస్యలు: స్వరపేటికలో వచ్చే సమస్యలు: ఇవి ముఖ్యంగా, గొంతు ఎక్కువగా వాడటం వలన అంటే ఎక్కువగా మాట్లాడే వారిలో, పాటలు పాడే వాళ్ళలో, హైపోథైరాయిడిజమ్, సైనసైటిస్‌తో ఎక్కువ కాలంగా బాధపడుతున్న, విపరీతమైన దగ్గు ఉండే వాళ్ళల్లో వస్తుంది. అరుగుదల సమస్య ఉండే వాళ్ళల్లో కూడా గొంతు దగ్గర మంట, నొప్పి, తీసుకున్న ఆహారం మింగలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’కు దారి తీస్తాయి. చెవిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఇవి 1) చెవి వెలుపలి పొర 2) మధ్య భాగంలో ఉండే పొర 3) లోపలి పొర. సాధారణంగా ఈ 3 పొరలకు ఇన్ఫెక్షన్స్ గాని, వేరే ఇతర వ్యాధులు గాని రావటం జరుగుతుంది. సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు 1) చెవి వెలుపలి పొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: దీనివలన దురద, నొప్పి, వాపుతో కూడి చెవి నుంచి స్రావం వస్తుంది. ఆ స్రావం ఒక్కొక్కసారి నీరు లేదా చీముతో కూడిన స్రావం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవటం వలన, ఒక్కొక్కసారి త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా కూడా చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. త్వరితంగా వచ్చేవి అంటే ఎక్యూట్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా అని అంటారు. ఇన్ఫెక్షన్స్ తీవ్రతను బట్టి అది ఎక్యూట్ లేదా క్రానిక్ అని గుర్తించి, చికిత్స చేయాల్సి ఉంటుంది. 2) మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: ఇది ముఖ్యంగా ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అంతే గాకుండా ఎలర్జీ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తరచుగా ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. దీనిలో ఉండే ముఖ్య లక్షణాలు: చెవినొప్పి సరిగ్గా వినబడకపోవటం చెవి అంతా పట్టేసినట్లు ఉండడం జ్వరం తలంతా బరువుగా ఉండి ఏ పనిచెయ్యాలని అనిపించకపోవటం తల తిరగటం. పాజిటివ్ హోమియోపతిలో పేషెంట్ తత్త్వాన్ని బట్టి మందులు ఇచ్చి, వ్యాధి యొక్క మూలకారణాన్ని ఎనాలసిస్ చేసుకుని ‘జెనిటిక్ కానిస్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఆపడమే కాకుండా, పూర్తిస్థాయిలో చికిత్స ఇవ్వడం జరుగుతుంది. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com -
సర్వైకల్ స్పాండిలోసిస్
సర్వైకల్ స్పాండిలోసిస్ సాధారణంగా మెడకు సంబంధించి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మెడ వెన్నుపూసలో మార్పులు రావటం వలన వివిధ రకాల లక్షణాలు కనిపిస్తాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ పురుషులలో తొందరగా, ఎక్కువగా వస్తుంది. వయసు మీరిన కొద్దీ వృద్ధులలో 90 శాతం పైన వెన్నుపూసలలో మార్పులు చూస్తాము. దీని గురించి 1992లో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం... 40 సంవత్సరాలు దాటిన పురుషులలో ఈ వెన్నుపూసకు సంబంధించిన మార్పులు సర్వసాధారణం. వెన్నుపూసలో మార్పుల వలన నరాల మీద ఒత్తిడి ఏర్పడి మెడనొప్పి, మెడ పట్టి వేయటం, తలనొప్పి, కళ్ళు తరగడం, భుజాలు, చేతులు నొప్పి, తిమ్మిర్లు చూస్తాము. మెడ ఆకృతి చూస్తే మెడలోని ఏడు వెన్నుపూసలు, కండరాలు, పైన రెండు లిగమెంట్స్ మెడ వెన్నుపూస... మెడ అటు ఇటు తిరగటానికి, మిగిలినవి పటుత్వానికి ఉపయోగపడతాయి. వెన్నుపూసల మధ్యగా వెళ్లే వెన్నుపాము మన శరీరంలో జరిగే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. మెడకు దెబ్బ తగలడం వలన, వెన్నుపూసలో మార్పుల వలన నరం మీద ఒత్తిడి పెరిగి సమాచారం చేరడంలో లోపం వలన తలతిరగడం, తిమ్మిర్లు, నడకలో తేడా రావచ్చు. మెడనొప్పి ముఖ్యంగా 40 సం॥దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. నేటి నవీన యుగంలో ద్విచక్ర వాహనం ఎక్కువగా నడిపేవారిలో సైకిలు తొక్కేవారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులలో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు 20-30 సం॥వయస్సు వారిలో కూడా ఈ వ్యాధి చూస్తున్నాము. పెరిగిన నాగరికత, నవీన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో ఇది స్త్రీ, పురుషులలో ఇద్దరికీ వస్తుంది. పురుషులలో చిన్నవయస్సులో, స్త్రీలలో 40॥తర్వాత రావడం సాధారణం. కారణం ఎముకలు అరగడం, ఎముకలలోపల జిగురు పదార్థం (కార్టిలేజ్) తగ్గడం వలన ఎముకల బలం సాంద్రత తగ్గుతుంది. ఎముకలు అరుగుట వలన ఎగుడు, దిగుడు bone spurs తయారవుతాయి. దాంతో కండరాల నొప్పి, మెడ తిప్పడంలో ఇబ్బంది, చేతులు లాగడం, మెడనొప్పి వలన పైకి చూస్తే కళ్ళు తిరగడం, ఛాతి భాగంలో నొప్పి, సూదులు పొడిచినట్లుగా నొప్పి, మంటలు, నడకలో తూలినట్లు కావడం, కండరాల రిఫ్లెక్సెస్లో మార్పులు, మలమూత్ర విసర్జనపై అదుపు కోల్పోవడం. రోగ నిర్థారణ: 1. X-Ray, 2. MRI చేయకూడనివి పరుగెత్తడం ఎక్కువసేపు టీవీ చూడటం, అదేపనిగా కంప్యూటర్‌పై పనిచేయడం, స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్ చేయడం నిటారుగా కూర్చోవడం రోజూ చిన్న చిన్న మెడ ఎక్సర్సైజ్ వైద్యుని సలహాపై మాత్రమే చేయాలి. నివారణ మెడ వ్యాయామం, ఫిజియోథెరపి, ట్రాక్షన్, వేడి, చల్లటి ప్యాడ్స్ వాడటం ద్వారా స్పాండిలోసిస్ను తగ్గించవచ్చు. దీనితోపాటు సరైన కుర్చీ వాడటం, నిటారుగా కూర్చోవటం పెద్ద దిండు వాడకుండా, ఎప్పుడూ ఛ్ఛిటఠిజీఛ్చి ఞజీౌఠీ వాడటం మెడకు సపోర్టు ఇవ్వటం ఎక్కువసేపు అదేపనిగా కంప్యూటర్, మౌస్‌ను వాడకుండా ఉండటం మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గించుకోవటం. హోమియో చికిత్స హోమియోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఖచ్చితమైన చికిత్స ఉంది. ఇది ఓపికగా కొన్ని నెలలు వాడితే వెన్నుపూసలో జరిగే మార్పులను అదుపు చేస్తూ, కండరాలకు బలం చేకూర్చుతూ, దానివలన కలిగే అనర్థాలను నివారించవచ్చు. ఆపరేషన్ వరకు వెళ్ళకుండా నివారించవచ్చు. ముఖ్యంగా హోమియోపతిలో కల్కేరియా గ్రూపుకు చెందిన మందులు అయిన కల్కేరియా ఫాస్, కల్కేరియా ప్లోర్, కాల్మియా, బ్రెవొనియా, స్పెజిలియ, హైపరికం జెల్సిమియం, రుస్టక్స్, కోనియం సాంగనురియ, యాసిడ్‌ఫాస్ మంచి మందులు. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
థైరాయిడ్‌కు హోమియో చికిత్స
మన శరీరంలో ఉండే గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి అతి ముఖ్యమైన గ్రంథి. దీని ప్రభావం అన్ని జీవవ్యవస్థలపైన ఉంటుంది. ఈ గ్రంథి గొంతు భాగంలో థైరాయిడ్ కార్టిలేజ్ అనే మృదులాస్థి పైన ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి టి -3, టి - 4, టి3-ట్రైఅయోడో థైరాక్సిన్, టి4-థైరాక్సిన్ అని రెండు హార్మోన్లు ఉత్పత్తి చేయాలంటే హైపోథైలమస్ పిట్యుటరీ, గ్రంథి నుంచి వచ్చే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టి.ఎస్.హెచ్.) థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరచాలి. థైరాయిడ్ హార్మోన్లో అయోడిన్ అనే మూలకం పాత్ర అతి ముఖ్యమైనది. థైరాయిడ్ హార్మోన్ అన్ని జీవ వ్యవస్థలయిన ...........కార్బోహైడ్రేట్. కొవ్వుపదార్థాల జీవవ్యవస్థలు, బేసల్ మెటబాలిక్ రేట్ (బీఎమ్మార్) శ్వాస వ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, ముఖ్యంగా సంతాన ఉత్పత్తి వ్యవస్థపైన, దీని ప్రభావం ఉంటుంది. పిండదశలోనూ, పుట్టిన తరవాత మొదటి 4- 5 నెలలో దీని ఆవశ్యకత చాలా కీలకమైనది. హైపోథైలమస్ పిట్యుటరీ థైరాయిడ్ వ్యవస్థలలో మార్పు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి ప్రక్రియలో మార్పులు సంభవించి అధిక (హైపర్ థైరాయిడ్), తక్కువ (హైపోథైరాయిడ్ ) వంటివి వస్తాయి. కారణాలు: నేటి మానవ జీవన విధానం ప్రకృతి విరుద్ధంగా ఉండటం, అధిక ఒత్తిడి, సరియైన శారీరక వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహార లోపం వలన థైరాయిడ్ వ్యవస్థలో మార్పులు సంభవించి థైరాయిడ్ బారిన పడతారు. వంశపారంపర్యంగా థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి అయోడిన్ లోపం వలన పార్షియల్ థైరాయిడక్టమీ పిట్యుటరీ గ్రంథిలో వచ్చే వ్యాధుల వలన కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. రకాలు 1) హైపోథైరాయిడిజం: ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్ వ్యాధి. శరీరంలో కావలసినదాని కంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఇది వస్తుంది. ఏ వయసులో ఉన్న వారైనా ఈ హైపోథైరాయిడిజానికి గురి కావచ్చు. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు పిల్లల్లో: బుద్ధిమాంద్యం, ఎదుగుదల లోపం, జ్ఞాపకశక్తి లేకపోవడం, మలబద్దకం, చురుకుదనం కోల్పోవడం, వయసుకి మించి లావుగా ఉండటం. యుక్తవయస్కులలో: ఒంట్లో నీరు చేరి బరువు పెరగడం, బిఎంఆర్ తగ్గిపోవడం, రజస్వల (మెనార్కి) ఆలస్యం కావడం, ఋతుచక్రం ఆలస్యం కావడం, అమెనోరియా, నెలసరిలో అధిక రక్తస్రావం/ అల్ప రక్తస్రావం ఉండటం, సంతానలేమి, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలటం, బద్దకంగా ఉండి పనిచేయాలనిపించక పోవడం, చలి తట్టుకోలేకపోవడం. ఆడవారిలో రోజూ వేసుకునే దుస్తులు, గాజులు బిగుతు కావడం, అల్వికేరియా అనే చర్మ సంబంధిత వ్యాధుల వంటి లక్షణాలతో హైపోథైరాయిడ్‌ను సులువుగా గుర్తించవచ్చు. 2) హైపర్ థైరాయిడజమ్: థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్‌ను విడుదల చేయడం వలన వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ అంటారు. లక్షణాలు : ఆహారం సరియైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, అధిక చెమట, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, నెలసరి త్వరగా రావడం, ఋతుచక్రంలో అధిక రక్తస్రావం జరగడం 3) హషిమోటోస్ థైరాయిడైటిస్: ఇది జీవనక్రియల అసమతుల్యత వలన వచ్చే థైరాయిడ్ (ఆటో ఇమ్యూన్). దీనిలో థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ఉత్పన్నమై, థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పని చేయనివ్వవు. ఇందులో హైపో మరియు హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. గాయిటర్: థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి కావడాన్ని గాయిటర్ అంటారు. కొన్ని సందర్భాలలో దీని పరిమాణం కంటే రెండింతల పరిమాణం వాపు వచ్చి స్వరపేటిక పైన ఒత్తిడి చేయడం వల్ల వాయిస్‌లో మార్పు వస్తుంది. గాయిటర్‌లో థైరాయిడ్ హార్మోన్లు టి - 3, టి - 4 సాధారణస్థితిలో ఉన్నప్పటికీ గాయిటర్ లేనట్టుగా నిర్థారించలేం. కారణాలు: అతి ముఖ్యమైన కారణం... అయోడిన్ అనే మూలకలోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. గ్రేవ్స్ డిసీజ్ పిట్యుటరీ గ్రంథి ట్యూమర్స్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు గొంతు కింద వాపు వచ్చి మింగడానికి కష్టంగా ఉంటుంది స్వరంలో మార్పులు రావడం ఎక్సా ఆప్తల్మిక్ గాయిటర్ అనగా కనుగుడ్లు బయటికి పొడుచుకు వచ్చినట్టుగా ఉండటం టిబియల్ విక్సెడిమా. నిర్థారణ పరీక్షలు థైరాయిడ్ ప్రొఫైల్ టి-3, టి-4, టిఎస్హెచ్ యాంటీ థైరాయిడ్ యాంటీ బాడీస్ యూఎస్ ఈ ఆఫ్ థైరాయిడ్ గ్రంథి గొంతు యొక్క సీటీ స్కాన్ హోమియో చికిత్స చాలామంది పేషెంట్లకు దీనిపై అవగాహన తక్కువ. థైరాయిడ్‌కు మందులు లేవు, జీవితాంతం థైరాక్సిన్ వాడడం తప్ప మరో మార్గం లేదనుకుంటారు. అదేవిధంగా చాలామందికి హోమియో వైద్యంపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అలా అనుకుంటారు. తాము తీసుకునే థైరాక్సిన్ అనేది ట్రీట్మెంట్ కాదు, సప్లిమెంట్ అని తెలియదు. హోమియో వైద్యంలో రోగి శరీర తత్త్వాన్ని బట్టి సరైన చికిత్స ఇస్తే తప్పక అనతికాలంలో నయం చేయవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్ రోగి శరీరతత్త్వాన్ని బట్టి జెనిటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమం విధానం ద్వారా హైపోథైలమస్ పిట్యుటరీ థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం వలన థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చును. -
కీళ్ళనొప్పులు వాటి కారణాలు ఆధునిక హోమియో చికిత్స
నేటి ఆధునిక జీవనం కీళ్ళ పైన మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్ళ జబ్బులను పెంచుతాయి. వీటన్నింటికీ తోడు కొన్నిరకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకురావచ్చు. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది. నడవడమే కష్టం... ఎందుకంటే? కీళ్ళలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగం విపరీతమైన నొప్పి, వాపు, బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలి నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తరువాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్నిరకాల పనులు చేయలేం. కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది. ఎందుకా వాపు - కీళ్ళలో జరిగే మార్పులు కీళ్ళు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. కీళ్ళసమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితమైనా ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడుతుంది. ఫలితంగా కీళ్ళ కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్కభాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన చోట కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోఫైట్స్ కీళ్ళను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డలుగా తయారవుతుంది. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురుపదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ లేకుండా హోమియోలో చికిత్స కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్థారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
కీళ్ళనొప్పులు వాటి కారణాలు - హోమియో చికిత్స
నేటి ఆధునిక జీవనం కీళ్ళపైన మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్ళ జబ్బులను పెంచుతాయి. వీటన్నింటికి తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకురావచ్చు. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది. నడవడమే కష్టం... ఎందుకంటే? కీళ్ళలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగం విపరీతమైన నొప్పి, వాపు బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తరువాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్నిరకాల పనులు చేయలేము. కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది. ఎందుకా వాపు - కీళ్ళలో జరిగే మార్పులు కీళ్ళు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. కీళ్ళసమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితం అయినా ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడుతుంది. ఫలితంగా కీళ్ళ కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్కభాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోఫైట్స్ కీళ్ళను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డలుగా తయారవుతుంది. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురుపదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ లేకుండా హోమియోలో చికిత్స కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్థారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
కీళ్ళనొప్పులు వాటి కారణాలు ఆధునిక
నేటి ఆధునిక జీవనం కీళ్ళపైన మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్ళ జబ్బులను పెంచుతాయి. వీటన్నింటికి తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకురావచ్చు. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది. నడవడమే కష్టం... ఎందుకంటే? కీళ్ళలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగం విపరీతమైన నొప్పి, వాపు బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తరువాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్నిరకాల పనులు చేయలేము. కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది. ఎందుకా వాపు - కీళ్ళలో జరిగే మార్పులు కీళ్ళు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. కీళ్ళసమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితం అయినా ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడుతుంది. ఫలితంగా కీళ్ళ కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్కభాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోఫైట్స్ కీళ్ళను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డలుగా తయారవుతుంది. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురుపదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ లేకుండా హోమియోలో చికిత్స కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్థారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
జిరియాట్రిక్స్ - ఆధునిక హోమియో చికిత్స
సత్యమూర్తి అనే స్కూల్ హెడ్మాస్టర్ రిటైర్ అయ్యే సమయం... హుందాగా సన్మానం చేసి, పూలదండలు వేసి అభిమానంతో పలకరిస్తూ ఉంటే... సత్యమూర్తిగారి ఆనందానికి అవధులు లేవు. దానితోపాటు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని బాధతో నిండిన మనసుతో వీడ్కోలు తీసుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో సమయం అంటే తెలియక కాలం గడిచిపోయింది. కొంతకాలం తరువాత ఒకరోజు సత్యమూర్తి కుర్చీలోంచి హఠాత్తుగా లేవబోయి కాలు కింద మోపలేక కింద పడిపోయారు. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారుపడి వైద్యుడి దగ్గరకు పరుగులు తీశారు. సత్యమూర్తిని పరీక్షించిన డాక్టరు ఆస్టియోపోరోసిస్ వల్ల కాలు ఫ్రాక్చర్ అయ్యిందని నిర్థారణ చేశారు. అప్పటి నుంచి సత్యమూర్తి మంచానపడ్డారు. ఆస్టియోపోరోసిస్- ఆస్టియో ఆర్థరైటిస్-జిరియా ట్రిక్స్ సంబంధమేమిటి? ఇది వృద్ధులలో ఎందుకు ఎక్కువ అన్నది తెలుసుకుందాం. జిరియాట్రిక్స్ అంటే ఏమిటి? వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునే దానిని జిరియాట్రిక్స్ అంటారు. ఈ పదం గ్రీకు భాష నుంచి కనుగొనబడింది. Geron అంటే old man. Iatros అంటే heals అని అర్థం. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవ టం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం, వచ్చిన వ్యాధులకు మంచి చికిత్స ఇవ్వటం దీని ముఖ్య ఉద్దేశం. అరవైఐదు ఏళ్ళు పైబడినవారికి శరీరంలో వచ్చే మార్పుల వల్ల సరిగ్గా నిలబడలేక పోవటం, నడవలేకపోవటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, విసర్జనాలను ఆపుకోలేకపోవటం, చూపు మందగించ టం, వినికిడి తగ్గిపోవటం వంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. అంతేకాకుండా డిలిరియమ్, మానసిక ఒత్తిడికి గురి కావటం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం. కొంతమందిలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోవచ్చు. కొంతమంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండొచ్చు. ఈ సమస్యలన్నీ జిరియాట్రిక్స్ అనే విభాగంలో పొందుపరచబడతాయి. వృద్ధులకు మంచి చికిత్స ఇవ్వటానికి ఒక ప్రత్యేక వైద్యుని నియమిస్తారు. వారినే Geriatrician అంటారు. ఈ విభాగం మొదటిసారిగా 1942లో అమెరికాలో స్థాపించబడినది. ఆస్టియో ఆర్థరైటిస్ : ఎముకలలో ఉండే Cartilage కీళ్ళ మధ్య ఒక కుషన్లాగ పనిచేస్తుంది. వయస్సులో వచ్చే మార్పుల వల్ల కార్టిలేజ్ తరిగిపోవటం degenerative మార్పుల వల్ల రెండు ఎముకలు ఒక దానికొకటి రాసుకోవటం జరిగి కీళ్ళనొప్పికి దారి తీస్తుంది. దీనినే ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇది ఎక్కువగా వృద్ధులలో వచ్చే సమస్య. అందుకే దీనిని ‘ఓల్డ్పర్సన్స్ ఆర్థరైటిస్’ అని కూడా అంటారు. ఎముకలు ఇన్ఫ్లమేషన్కి గురై ఎక్కువ బరువు మోపటంతో కీళ్ళ నొప్పి వస్తుంది. అంతేకాకుండా కాలు కదపలేకపోవటం జరుగుతుంది. ఇది ఎక్కువగా 45 ఏళ్ళు పైబడిన వారిలో మగవారి కంటే స్త్రీలలో ఎక్కువ, అంతేకాకుండా కీళ్ళకు దెబ్బలు తగిలి ఇన్ఫ్లమేషన్ రావటం, యాక్సిడెంట్స్ వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఊబకాయం వల్ల ముఖ్యంగా మోకాళ్ళు, కీళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్‌కి గురవుతున్నాయి. వంశానుగత కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. లక్షణాలు: 85 శాతం మందిలో ఏ లక్షణాలూ లేకుండా ఉన్నా ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్థారణ అవుతుంది. 35-50 శాతం మందిలో వ్యాధి లక్షణాలు తక్కువ నుంచి విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చేతి కీళ్ల నొప్పులతో స్త్రీలు పనిచెయ్యడానికి ఇబ్బంది పడుతుంటారు. బరువు మోపే కీళ్ళు... knees, hips, feet and the back ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. మొదట ఒకటి రెండు కీళ్ళలో నొప్పి ఉండి స్టిఫ్‌గా ఉంటాయి. కదలికలు కష్టంగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువసేపు నిలబడలేకపోవటం, ఎక్కువ దూరం నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేక పోవటం, రాత్రిపూట నొప్పి ఎక్కువ, చల్లగాలికి నొప్పులు ఎక్కువ అవ్వటం కింద కూర్చోనివ్వలేక పోవడం వీటి ముఖ్య లక్షణాలు. ఆస్టియో పోరోసిస్: వృద్ధాప్యం వల్ల ఎముకలల్లో ఉన్న సాంద్రత (bone mass) కోల్పోయి, కణజాలం ఆకృతి, నాణ్యతను కోల్పోయి, ఎముకలలో ఉండే శక్తి తగ్గిపోతుంది. దీనినే ఆస్టియో పోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్‌లో ఎముకలు ఎక్కువగా ఫ్రాక్చర్‌కు గురవుతాయి. ఎముకల బలహీనత, bone mass తగ్గిపోవటం మగవాళ్ళ కన్నా స్త్రీలలో ఎక్కువ, 35 శాతం స్త్రీలలో నెలసరి ఆగిపోయిన తరువాత కొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. మగవారిలో స్త్రీల కంటే bone mass ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరగటంతో రక్తంలో టెస్టోస్టిరాన్, గ్రోత్ హార్మోన్స్, అడ్రినల్ యాండ్రోజెన్స్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనితోపాటు వారి జీవన విధానం, న్యూట్రిషనల్ డెఫీషియన్సీ ముఖ్యంగా క్యాల్షియం, ప్రోటీన్ డెఫీషియన్సీ, బోన్ మాస్ తగ్గించటానికి కారణమవుతాయి. లక్షణాలు: కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండక ఎముక బలహీనత వల్ల ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదముంది. అదే మన సత్యమూర్తికి జరిగిన ప్రమాదం. ముఖ్యంగా wrist, humerus, hip, ribs ఎముకలు ఫ్రాక్చర్స్‌కు గురవుతున్నాయి. వెన్నుపూస ఎముకల బలహీనత వల్ల నడుమునొప్పి రావటం దీని ముఖ్య లక్షణం. మోకాళ్ళ కీళ్ళలో బోన్ మాస్ తగ్గి నొప్పి, ఎక్కువ దూరం నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, కొంతమందిలో వెన్నుపూస వంగిపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధారణ చెయ్యవచ్చు: స్త్రీల నెలసరి ఆగిపోయిన తర్వాత తమ జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకొనవలసిన అవసరం ఉంది. 40-50 ఏళ్ళు పైబడినవారు వైద్యుడిని సంప్రదించటం వలన ఆస్టియో పోరోసిస్ రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకొని కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. హోమియో చికిత్స హోమియో చికిత్స వలన ఆస్టియో పోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్‌లను అరికట్టే అవకాశం ఉంది. ఇప్పుడు స్టార్హోమియోపతిలో ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ మీద రీసెర్చ్ చేసి గొప్ప అనుభవం ఉన్న సీనియర్ డాక్టర్లచే రోగి యొక్క శారీరక, మానసిక లక్షణాలను, వ్యాధి లక్షణాలను పరిశోధన చేసి వారికి సరిపడే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వబడుతుంది. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ శరీరంలోని క్యాల్షియం డెఫీషియన్సీని, ప్రొటీన్ డెఫీషియన్సీ, హార్మోన్స్‌ను సరైన క్రమంలో జరుగుటకు, బోన్ మాస్, బోన్ స్ట్రెంగ్త్‌ని పెంచడానికి దోహదపడతాయి. వీటితో పాటు ఆహార నియమాలు, అవసరమైన వ్యాయామాలు, మంచి సలహాలు ఇవ్వబడతాయి. హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని కాల్కేరియా గ్రూపునకు సంబంధించినవి. ఎక్కువగా ఎముకలు, కీళ్ళ మీద ప్రభావం చూపి ఎముకల పటుత్వానికి దోహదపడతాయి. నేట్రమ్ గ్రూపు, ఫాస్ఫరస్, రస్టాక్స్ మొదలైనవి ఎక్కువగా ఎముకల మీద ప్రభావం చూపి బోన్ స్ట్రెంగ్త్ పెంచుతాయి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ను చాలావరకు పరిష్కరించవచ్చు. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 903000 8854 / 90300 81875