హోమియోతో కిడ్నీలో రాళ్ళకు చెక్ | Who rocks therefore check | Sakshi
Sakshi News home page

హోమియోతో కిడ్నీలో రాళ్ళకు చెక్

Published Sun, Dec 29 2013 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

Who rocks therefore check

కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణాలు అనేకం. అవి ఎక్కువ కాలం ఉండిపోతే, కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. సర్జరీతో ఒకసారి తొలగించినా  అవి ఏర్పడటానికి అసలు కారణమైన శరీరతత్వాన్ని మార్చనంతవరకు అవి మళ్లీ  మళ్ళీ వస్తాయి.  శరీరతత్వాన్ని మార్చి కిడ్నీలో రాళ్లను శాశ్వతంగా తొలగించడం కేవలం హోమియో వైద్యానికే సాధ్యం అంటున్నారు ప్రముఖ హోమియోనిపుణులు డాక్టర్ వాణీ రవికిరణ్.

 మూత్రపిండం, పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ల వల్ల తీవ్రనొప్పి వస్తుంటుంది. సాధారణంగా చిన్న రాళ్ళు అయితే వాటంతట అవే బయటకు వస్తుంటాయి. కాని పరిమాణంలో పెద్దగా అంటే కనీసం 2 - 3 మీల్లిమీటర్ల కంటే పెద్దగా ఉన్న రాళ్ళు కిడ్నీలోని వివిధ భాగాల్లో చిక్కుకుపోయి తీవ్ర నొప్పి మొదలవుతుంది. రోగికి వాంతులు కావటం, వికారంగా ఉంటుంది.
 
 కారణాలు: 40 ఏళ్లు దాటిన మహిళలు కాల్షియం, విటమిన్ డి 3 టాబ్లెట్‌లు ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. మాత్రలకు బదులు ప్రకృతి పరంగా లభించే కాల్షియం తీసుకున్నట్లయితే ఎముకలకు మంచిదీ, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. మంచినీరు తక్కువగా తాగటం మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడానికి కారణమవుతుంది.
 
లక్షణాలు: మూత్రపిండంలో రాళ్ల వల్ల భరించలేని నొప్పి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉంటుంది. ఈ నొప్పి వీపు వెనుక భాగంలో నుంచి బయలుదేరి పొత్తికడుపులోకి వస్తుంది. తెంపరలుగా వచ్చే ఈ నొప్పి జననాంగాలలోకి పాకుతుంది. 20 నుంచి 90 నిమిషాల వరకు ఈ నొప్పి ఉంటుంది. తల తిరగటం, వికారం, వాంతులు కావటం, మూత్రంలో మంట రక్తం చీము రావచ్చు. చెమట, జ్వరం, కంగారుగా, కోపంగా ఉండవచ్చు. ఎటువైపు కదలినా, వంగినా నొప్పి నుంచి ఉపశమనం ఉండదు. కొన్నిసార్లు కాళ్లలో వాపు ఏర్పడవచ్చు.
 
 పిత్తాశయంలో రాళ్లు
 పిత్తాశయం అనేది కాలేయం నుంచి వచ్చే పైత్యరసాలను ఒడిసిపట్టే సంచి లాంటిది. ఇందులో ఉండే పైత్యరసాలు మనం తీసుకునే మాంసకృత్తులు, నూనె పదార్థాలను అరిగింపచేయడానికి ఉపయోగపడతాయి. పైత్యరసం గాఢత పెరిగినప్పుడు రాళ్ళు ఏర్పడతాయి.
 
 లక్షణాలు: పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ళు కొన్నేళ్ల పాటు లక్షణాలను చూపవు.  ఎప్పుడైతే పెద్దవిగా మారుతాయో అప్పుడు లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల పొట్ట నొప్పి ఉంటుంది. కుడివైపు పొట్టలో నొప్పి మొదలై వీపు వెనుకభాగంలోకి చేరుతుంది. దీని వల్ల వికారం, వాంతులు, జ్వరం కనిపిస్తాయి.
 
 కారణాలు: పిత్తాశయంలో రాళ్లకు అధిక మాంసాహారం, పీచుపదార్థాలు తగ్గడం, బరువు పెరగడం, వంశపారంపర్యం, బరువు పెరుగతున్నామనే భావనతో ఆహారం తగ్గించడం, అనీమియా, ఆల్కహాల్, ధూమపానం, వేపుడు పదార్థాలు, కాల్షియం, విటమిన్ సి తగ్గడం వంటివి కారణాలు.
 
 హోమియో చికిత్స: కిడ్నీ, పిత్తాశయాల్లో రాళ్లను పూర్తిగా నయం చేయాడనికి హోమియోలో అత్యుత్తమ చికిత్స విధానాలు ఉన్నాయి. ఈ మందుల వల్ల రాళ్లు తొలగిపోవడమే కాకుండా భవిష్యత్‌లో మళ్లీ ఏర్పడకుండా చేయవచ్చు.
 
 డాక్టర్ వాణి రవికిరణ్,
 ప్రముఖ హోమియో వైద్యనిపుణులు, మాస్టర్స్ హోమియోపతి,
 అమీర్‌పేట్, కూకట్‌పల్లి, హైదరాబాద్, విజయవాడ.
 ఫోన్: 7842 106 106 / 9032 106 106

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement