చెవి, ముక్కు, గొంతు సమస్యలు కూడా ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యలు అన్ని కూడా రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన, మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన సమస్య తీవ్రత పెరిగి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది.
3)తల తిరగటం: ఇది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో గమనిస్తూనే ఉంటాము. ముఖ్యంగా పడుకున్నప్పుడు గాని, పడుకుని చాలా తొందరగా లేచినప్పుడు, సడెన్‌గా పైకి చూసినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవటం వలన కూడా ఇది వస్తుంది.
4) మీనియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో ముఖ్యంగా తల తిరగటం, సరిగ్గా వినిపించక పోవటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
5) ఎకోస్టిక్ న్యూరోమా: ఇది చెవిలోపల ఒక కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరుమని శబ్దాలు, నడిచేటప్పుడు కూడా సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవటం, మొహం అంతా తిమ్మిరి రావటం వంటి లక్షణాలు వస్తాయి. కఖఐ పరీక్ష చేయించుకుంటే కణితి సైజ్ ఎలా ఉన్నది తెలుస్తుంది.
6) ల్యాబరింథైటిస్, వెస్టిబ్యులార్ మ్యారైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వలన ఈ సమస్య వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వలన వస్తుంది. చెవి మధ్యపొర నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో కూడా ముఖ్యంగా తల తిరగటం, వికారం, వినికిడిలోపం వంటివి ఉంటాయి.
7) ఓటో స్ల్కీరోసి్‌స్, టినిటస్ లాంటి సమస్యలు: ఇవి చెవిలోపల సర్వ సాధారణంగా గమనిస్తుంటాము. ఇదేవిధంగా ముక్కు లోపల కూడా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించి, ఎలర్జీ వంటి సమస్యలు వస్తూంటాయి. అవి...
ఎలర్జిక్ సైనసైటిస్
ఎపిస్టాక్సిస్
సైనసైటిస్.
ఈ పైన చెప్పిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తి క్షీణించటం వలన, సాధారణమైన జలుబు, తుమ్ములు, ముక్కు నుంచి విపరీతంగా నీరు కారటంతో మొదలయి, సరైన రీతిలో చికిత్స తీసుకోక, విపరీతమైన కఫం లేదా శ్లేష్మం గాలి రంధ్రాలలో పేరుకుపోయి, వాటికి వాపు వస్తుంది. ఈ సమస్యను సైనసైటిస్ అంటారు. దీనిలో తలబరువు, వికారం, వాంతులు, వాసన తెలియకపోవటం, నీరసం, అలసట, ఎవరి పనులు వారు చేసుకోలేక పోవటం వంటి సమస్యలు వస్తాయి.
చెవి, ముక్కుకు వచ్చే సమస్యలు గొంతు సమస్యలకు కూడా దారి తీస్తుంటాయి. వీటిలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి రోజురోజుకి తగ్గి మొత్తం చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏర్పడుతుంటాయి.
సాధారణంగా వచ్చే గొంతు సమస్యలు:
స్వరపేటికలో వచ్చే సమస్యలు: ఇవి ముఖ్యంగా, గొంతు ఎక్కువగా వాడటం వలన అంటే ఎక్కువగా మాట్లాడే వారిలో, పాటలు పాడే వాళ్ళలో, హైపోథైరాయిడిజమ్, సైనసైటిస్‌తో ఎక్కువ కాలంగా బాధపడుతున్న, విపరీతమైన దగ్గు ఉండే వాళ్ళల్లో వస్తుంది.
అరుగుదల సమస్య ఉండే వాళ్ళల్లో కూడా గొంతు దగ్గర మంట, నొప్పి, తీసుకున్న ఆహారం మింగలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’కు దారి తీస్తాయి.
చెవిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఇవి 1) చెవి వెలుపలి పొర 2) మధ్య భాగంలో ఉండే పొర 3) లోపలి పొర. సాధారణంగా ఈ 3 పొరలకు ఇన్‌ఫెక్షన్స్ గాని, వేరే ఇతర వ్యాధులు గాని రావటం జరుగుతుంది.
సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు
1) చెవి వెలుపలి పొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: దీనివలన దురద, నొప్పి, వాపుతో కూడి చెవి నుంచి స్రావం వస్తుంది. ఆ స్రావం ఒక్కొక్కసారి నీరు లేదా చీముతో కూడిన స్రావం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవటం వలన, ఒక్కొక్కసారి త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా కూడా చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. త్వరితంగా వచ్చేవి అంటే
ఎక్యూట్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా దీర్ఘకాలికంగా అంటే
క్రానిక్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా అని అంటారు. ఇన్ఫెక్షన్స్ తీవ్రతను బట్టి అది ఎక్యూట్ లేదా క్రానిక్ అని గుర్తించి, చికిత్స చేయాల్సి ఉంటుంది.
2) మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: ఇది ముఖ్యంగా ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అంతే గాకుండా ఎలర్జీ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తరచుగా ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి.
దీనిలో ఉండే ముఖ్య లక్షణాలు:
చెవినొప్పి
సరిగ్గా వినబడకపోవటం
చెవి అంతా పట్టేసినట్లు ఉండడం
జ్వరం
తలంతా బరువుగా ఉండి ఏ పనిచెయ్యాలని అనిపించకపోవటం
తల తిరగటం.
పాజిటివ్ హోమియోపతిలో పేషెంట్ తత్త్వాన్ని బట్టి మందులు ఇచ్చి, వ్యాధి యొక్క మూలకారణాన్ని ఎనాలసిస్ చేసుకుని ‘జెనిటిక్ కానిస్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను ఆపడమే కాకుండా, పూర్తిస్థాయిలో చికిత్స ఇవ్వడం జరుగుతుంది.
డా॥టి. కిరణ్‌కుమార్
పాజిటివ్ హోమియోపతి
అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
www.positivehomeopathy.com
చెవి, ముక్కు, గొంతు సమస్యలు-హోమియో చికిత్స
Published Thu, Oct 24 2013 11:18 PM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement
Advertisement