చిన్నప్పుడూ చేసే పిచ్చిచేష్టల కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటాం. ఆ సమయంలో మన తల్లిందండ్రులు సకాలంలో స్పందించి కాపాడితే ఏ సమస్య ఉండదు. అదే సమయంలో వాళ్లు చూడకపోయినా లేదా మనం ప్రమాద బారిన పడిన విషయం గురించి ఇంట్లో వాళ్లక చెప్పకపోయినా..ప్రాణాంతక సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చిన్నతనంలో ఆకతాయి పనులతో ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. అయితే అతడి తల్లి సకాలంలో స్పందించి రక్షించే యత్నం చేసింది కూడా. అక్కడితో ఆ సమస్య సమూలంగా పరిష్కారంగాక పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడి ఇబ్బంది పడ్డాడు. గమ్మత్తుగా ఆ సమస్య ఇటీవల పరిష్కారమయ్యింది. ఊహించని విధంగా ఏదో ఫన్నీగా ఆ సమస్య నుంచి బయటపడితే ఆ ఆనందం మాటకందనిది కదా. అలాంటి ఫీల్‌ని అనుభవిస్తున్నాడు అరిజోనా వ్యక్తి..
ఏం జరిగిందంటే..అరిజోనాకు చెందిన 32 ఏళ్ల ఆండీ నార్టన్ అనే వ్యక్తి ఇన్నాళ్ల నుంచి పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గల కారణం తెలుసుకుని విస్తుపోయాడు. ఆ అనుభవాన్ని ఇన్‌స్టావేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఆరేళ్లప్రాయంలో జరిగిన ఘటన కారణంగా ఇన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో అసౌకర్యానికి గురయ్యానా..అని తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యాడు. స్లీప్ అప్పియా, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో మొన్నటివరకు చాలా ఇబ్బంది పడ్డాడు.
అయితే ఒకరోజు అనుకోకుండా బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆ సబ్బు నురుగకు పెద్దప్దెగా తుమ్ములు వచ్చాయి. అంతే ఆ తుమ్ముల్లో అతడి అనారోగ్య సమస్యలన్ని కొట్టుకుపోయాయి. ఆ తుమ్ముల కారణంగా ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకొచ్చింది. దాన్ని చూడగానే తన చిన్ననాటి ఘటన స్పురణకు వచ్చింది. 1990లలో జరిగా బాల్యపు ఘటన గుర్తుకొచ్చింది నార్టన్‌కి. లెగో బ్రాండ్‌కి సంబంధించిన చిన్న ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని ముక్కులో పెట్టుకున్నాడు. ఇది గమనించిన వాళ్ల అమ్మ ఆ బోమ్మను తొలగించడం జరిగింది.
అయితే ఆ సమయంలో ఓ చిన్న ముక్కలో అతడి ముక్కులో ఇరుక్కుపోవడంతో దీర్ఘకాలికి అనార్యో సమస్యల బారిన పడ్డాడు. అనుకోని విధంగా వచ్చిన తుమ్ముల కారణంగా ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకు వచ్చి ముక్కు అంతా ఫ్రీగా ఉన్నట్లు అనిపించింది. దాన్ని చూడగానే బాల్యంలో జరిగిన ఘటన గుర్తుకొచ్చి..ఎంత సులభంగా ఈ సమస్య పరిష్కారం అయ్యిందని సంబరపడ్డాడు.
ఆ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎలాంటి సర్జరీలు జరకుండా బయటపడ్డావని తెగ మెచ్చుకున్నారు. దీంతో ఇన్నాళ నుంచి నార్టన్ పడ్డ ఇబ్బందులకు తెరపడింది. హాయిగా ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాడు కూడా.
(చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!)
Comments
Please login to add a commentAdd a comment