throat problems
-
మాట్లాడుతూ.. పదాలతో తడబడుతున్నారా!? అయితే ఇలా చేయండి!
మాటలు ధారాళంగా మాట్లాడటం, పలకడం మనుషులకున్న గొప్ప వరం. ఈ పుడమిలో మరే జీవానికి ఈ అవకాశం లేదు. ఒకవేళ అవి గొంతు చీల్చుకుని అరిచినా, పదాలను మాత్రం పలకలేవు. కానీ మనం మాత్రం పలుకగలం. ఈ క్రమంలో కొందరు మాట్లాడటంలో, అక్షరాలు పలకడంలో ఎంతగానో తడబడుతుంటారు. నాలుక తిరగని పదాలతో లోలోనే సంకోచిస్తూంటారు. ఇకపై ఈ చిన్న ట్రిక్ వాడారో, ఇలాంటి సమస్యల నుంచి దూరం అవ్వడానికి అవకాశం ఉంది. మరదేంటో చూద్దాం! మాటలు సరిగ్గా రానివారి కోసం.. వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయల రసం పోసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత మళ్లీ దంచి మెత్తగా తయారు చేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి, మాటలు ముద్దగా పలికేవారికి, ఆగి ఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి మాటలు స్పష్టంగా వస్తాయి. • లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధాన్ని నాలిక పైన రాస్తున్నా మాటలు త్వరగా వస్తాయి. క్షయరోగానికి.. క్షయ.. అదేనండీ.. టీబీతో ఇబ్బంది పడేవారు అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు బలం చేకూరటమే కాక శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిద్రలేమి కూడా తగ్గుతుంది. గొంతులో కఫం.. వామాకు, తులసాకు, తమలపాకుని రోజూ తింటూ ఉంటే గొంతులో కఫం తగ్గిపోతుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడిని తేనెలో రంగరించి రెండు పూటలా చప్పరించినా గొంతులో గరగర, శ్లేష్మం పడటం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇవి చదవండి: బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు! -
మింగుడుపడని సమస్యా..? కారణాలు, పరిష్కారాలు ఇవిగో..!
మింగే సమయంలో నొప్పి రావడం, మింగడం ఇబ్బందిగా మారడం అనే సమస్యను ఈ ప్రపంచంలోని ఎదుర్కోని వారంటూ ఉండరు. కనీసం జలుబు వల్లనైనా గొంతునొప్పి వంటి సమస్య వచ్చి... ఏదో ఒక సమయంలో మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి ఒకటీ అరా సందర్భాల్లో, సంఘటనల్లో తప్ప... మింగలేకపోవడం అనేది ఎప్పుడూ ఓ సమస్యగా దాదాపుగా ఎవరికీ ఉండబోదు. కానీ చాలామందిలో అనేక కారణాలతో మింగడం ఓ కష్టసాధ్యమైన పని అవుతుంది. అలాంటి ఇబ్బందులు ఎవరెవరిలో, ఏయే కారణాలతో వస్తాయి, పరిష్కారాలేమిటి వంటి అంశాలను తెలుసుకుందాం. మింగడానికి వచ్చే అవరోధాలకు కారణాలు అనేకం. ఉదాహరణకు కొన్ని సమస్యలను చూద్దాం. వైరల్ సమస్యల వల్ల : ∙వైరల్ సమస్య కారణంగా వచ్చే జలుబు లేదా ఫ్లూ ∙ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ (దీన్నే గ్లాండులార్ ఫీవర్ అంటారు. ఈ సమస్య కొందరిలో దాదాపు పదిరోజుల పాటు బాధిస్తుంటుంది) ∙మీజిల్స్ ∙చికెన్‌పాక్స్. ఉపశమనం కోసం ఏం చేయాలి? ∙మసాలాలు చాలా ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. సమస్య తగ్గేవరకు చప్పిడి భోజనం (బ్లాండ్డైట్) తీసుకోవాలి. ∙బాగా విశ్రాంతి తీసుకోవాలి, కంటినిండా నిద్రపోవడం అన్నది త్వరగా తగ్గడానికి చాలా బాగా తోడ్పడుతుంది. ∙గొంతుకు పూర్తి విశ్రాంతినివ్వాలి. గొంతుతో పనిచేసేవారు అంటే ఉదాహరణకు టీచర్లు, లెక్చరర్లు, గాయకులు, ఉపన్యాసకులు వంటి వారు సమస్య తగ్గేవరకు గొంతును వీలైనంతగా ఉపయోగించకపోవడమే మంచిది. ∙తగినన్ని నీళ్లు/ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ∙వీలైనంతవరకు గోరువెచ్చటి లేదా వేడి చేసి, చల్లార్చిన ద్రవాలు తాగాలి. ∙రోజుకు కనీసం మూడు సార్లు ఉప్పు వేసిన గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ∙పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. పై సూచనలు పాటించినప్పటికీ సమస్య తగ్గకపోతే ఓసారి ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అదెప్పుడంటే... ∙గొంతునొప్పి (సోర్ థ్రోట్)తో బాధపడుతూ వారం రోజులకు పైగా గడిచాక కూడా సమస్య తగ్గకపోతే ∙బొంగురుగొంతు సమస్య రెండు వారాలు గడిచాక కూడా తగ్గకపోతే ∙101 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు తగ్గకుండా అదేపనిగా జ్వరం వస్తుంటే... జ్వరం తగ్గకుండా ఉంటే. ∙మింగడంతో పాటు శ్వాస తీసుకోవడమూ కష్టమవుతుంటే. ∙నోరు తెరవడానికే ఇబ్బందిగా ఉంటే, గొంతు పెగలడమూ కష్టమవుతుంటే ∙గొంతునొప్పితో పాటు కీళ్లనొప్పులు, చెవినొప్పి కూడా ఉంటే ∙వికారం, వాంతులు ఉంటే, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఉంటే ∙గొంతసమస్యతో పాటు చర్మంపై ర్యాష్ వస్తుంటే ∙మెడ దగ్గర లింఫ్‌గ్రంథులు వాచి, చేతికి/స్పర్శకు తెలుస్తుంటే ∙టాన్సిల్స్‌ను పరిశీలనగా చూసినప్పుడు వాటిపై తెల్లటి మచ్చలు (వైట్ ప్యాచెస్) కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. గొంతునొప్పిగా ఉండి మింగలేకపోవడం అన్నది తాత్కాలిక సమస్యే. కానీ పైన పేర్కొన్న కండిషన్లు చాలాకాలం కొనసాగుతుంటే మాత్రం ఈఎన్టీ వైద్యుని తప్పక సంప్రదించాల్సిందే. బ్యాక్టీరియల్‌తో పాటు ఇతర సమస్యల వల్ల ∙బ్యాక్టీరియా కారణంగా గొంతుభాగంలో ఇన్ఫెక్షన్లు ∙కోరింత దగ్గు ∙అలర్జీలు ∙వాతావరణం పూర్తిగా పొడిబారి ఉన్నప్పుడు కొందరిలో మింగడం సమస్య అవుతుంది ∙చాలాకాలంగా పొగతాగడం లేదా పొగాకు నమిలేవారిలో ∙కాలుష్యం ∙గొంతులోని కండరాలపై భారం పడటం ∙గొంతు/నోటిలో గడ్డలు ∙టాన్సిల్స్‌లో ఆహారాలు ఇరుక్కుపోయినప్పుడు ∙గొంతుపైన ఏదైనా దెబ్బతగిలినప్పుడు (ఎక్స్టర్నల్ నెక్ ట్రామా) ∙విటమిన్ లోపాలు ∙సర్వైకల్ స్పాండిలోసిస్ ∙హెర్పిస్ ఇవేగాక... గొంతులోని ఫ్యారింగ్స్ అనే భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్ ‘ఫ్యారంజైటిస్’ సైతం దాదాపు మూడు నుంచి ఏడు రోజుల వరకు తీవ్రంగానే బాధించి, మింగడానికి అడ్డంకిగా మారుతుంది. -డాక్టర్ ఇ.సి. వినయ కుమార్, సీనియర్ ఈఎన్టి సర్జన్ -
నోటి నుంచి దుర్వాసన, దగ్గు, పుండ్లతో బాధపడుతున్నారా.. ఇవి పాటిస్తే!
ఇమ్యునిటీ బలహీనంగా ఉంటే సీజనల్ వ్యాధులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఇక జలుబు, దగ్గు వంటి వ్యాధులైతే దాడి చేస్తూనే ఉంటాయి. గొంతు పొడిబారటం, పొడి దగ్గు రావటం వీటి ప్రధాన లక్షణాలు. సాధారణంగా కఫం ఉత్పత్తికాకపోతే దగ్గు వస్తుంది. ఒక్కోసారి అయితే వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వల్ల కూడ దగ్గు వస్తుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే ఆహారం నమలడం, మింగడంలో సమస్యలు తలెత్తుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేషియల్ రీసెర్చ్ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో చికాకు, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలు. మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. అయితే ఇంటిలో సులభంగా తయారు చేసుకునే రెమిడీలతో వీటినుంచి ఉపశమనం పొందవచ్చు! నిపుణులు సూచించిన ఈ చిట్కాల ద్వారా పొడిగొంతు సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చో తెలుసుకుందాం.. తులసి, తేనెలతో టీ పూర్వం నుంచే మన ఆయుర్వేద శాస్త్రంలో తులసి, తేనెలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి అందించే సహజసిద్ధమైన తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. అలాగే తులసిలో కూడా ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంటి వైద్యం, నాటు వైద్యాలలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి, తేనెలతో తయారు చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు కలిపిన పాలు పొడి గొంతు సమస్యలకు, దగ్గు సంబంధిత రుగ్మతలకు ఇది బాగా పనిచేస్తుంది. పసుపును ఆహారంలో భాగంగా తీసుకున్నట్టయితే వ్యాధుల బారి నుంచి కాపాడటమేకాక, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నెయ్యితో మిరియాల పొడి యాంటీ బ్యాక్టీరియల్ (సూక్ష్మజీవుల వినాశక), యాంటీ ఫంగల్ (తాపనివారక) లక్షణాలు నెయ్యిలో అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్ఫూన్ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తినండి. గొంతు తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీనిని తిన్నతర్వాత ఏ విధమైన పానియాలు తాగకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ములేథి లేదా లికోరైస్ మూలిక చూర్ణం లికోరైస్ అనేది ఒక ఆయుర్వేద మూలిక. ఈ ఔషధ మొక్క రుచి తియ్యగా ఉండటం వల్ల దీనిని అతిమధురం అని కూడా అంటారు. ఈ మూలికను చిన్న ముక్కగా తుంచి, నోట్లో వేసుకుని నమలడం వల్ల రోజంతా గొంతును తడిగా ఉంచుతుంది. సాధారణంగా దీనిని శ్వాస, పేగు సంబంధిత రుగ్మతల నివారణకు వినియోగిస్తారు. ఉప్పునీరు పొడి గొంతు సమస్య నివారణకు తేలికైన, అత్యంత ప్రభావవంతమైన మరొక పద్ధతి ఉప్పు నీటి పుక్కిలింత. వేడి నీటిలో ఉప్పు కలిపి రోజుకి కనీసం రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని కరిగించి పలచబరుస్తుంది. తక్షణ ఉపశమనానికి ఇది చక్కని మార్గం. హెర్బల్ టీ కాలుష్యం, దుమ్మూ ధూళి వల్ల గొంతులో చికాకుపుట్టించే సమస్యలకు శ్రేష్ఠమైన పరిష్కారం హెర్బల్ టీ. వీటివల్ల ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి సమాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల కాలుష్యకారకాలైన ధూళికణాలు ఆరోగ్యానికి హాని తలపెట్టకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. మెంతుల డికాషన్ వివిధ రకాల గొంతు రుగ్మతలను నివారించడంతోపాటు, పలు ఆరోగ్య సమస్యల నివారణలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంతవరకు ఉడికించాలి. అనంతరం ఈ డికాషన్‌ను చల్లార్చి, రోజుకు రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారడం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
సర్జరీ తర్వాత మాట సరిగా రావడం లేదు
నాకు ఈమధ్యే గుండెకు సంబంధించిన సర్జరీ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఎంత ప్రయత్నించినా మాట సరిగా రావడం లేదు. ఆ మాట కూడా గాలిలా వస్తోంది. అంతకముందు నాకు ఎప్పుడూ గొంతుకు సంబంధించిన సమస్యలు లేవు. ఇదేగాక... తినేటప్పుడు, తాగేటప్పుడు, మింగే సమయంలో ఇబ్బందిగా ఉంది. గొంతుకు ఏదో అడ్డు పడినట్లుగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి.– కె.వి.జె. రాజు, గుంటూరు మీ సమస్యకు సంబంధించిన వివరాలు పరిశీలించాక మీకు స్వరపేటికలోని ఒక భాగం అయిన ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్ హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్‌లో కొన్నిసార్లు వోకల్ఫోల్డ్కు ఒత్తిడి తగలడం లేదా అది దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువ. మీకు కూడా అలాగే జరిగినట్లుగా అనిపిస్తోంది. దీనివల్ల మీరు చెప్పిన విధంగానే మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు వోకల్ ఫోల్డ్ పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి మొదట మీరు అనుభవజ్ఞులైన ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించండి. మీకు అవసరాన్ని బట్టి లారింగోస్కోపీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అంతేకాదు... మీరొకసారి స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించి అవసరమైన ఎక్సర్సైజ్లు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మాట్లాడుతుంటే నత్తి వస్తోంది... పరిష్కారంచూపండి నేను బీటెక్ చదువుతున్నాను. నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడుతుంటే నాకు నత్తిలా వస్తోంది. వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. నా చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది. భవిష్యత్తులో ఉద్యోగం, కెరియర్ గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంటోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా బాధపడుతున్నాను. నాకు తగిన పరిష్కారం చూపండి.– డి. విశాల్, సికింద్రాబాద్ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్యకారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీరు మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. కొన్ని సార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య ఎక్కువవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ముక్కులోఏదో అడ్డంపడినట్లుగాఉంటోంది... నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఈ సమస్య వదలడం లేదు. చాలా రకాల మందులతో పాటు డాక్టర్ సలహా మేరకు ముక్కులోకి చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు.– డి. శివరామ్, నేలకొండపల్లి ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్నిరకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. తరచూ జలుబు చేస్తోంది... తగ్గేదెలా? నాకు తరచూ జలుబు చేస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు చేసుకోలేక పోతున్నాను. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికితోడు ఈ మధ్య చాలా నీరసంగా కూడా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.– కె.ఆర్. శ్రీనివాసమూర్తి, అమలాపురం మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది అన్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండుభాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్,అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
చెవి, ముక్కు, గొంతు సమస్యలు-హోమియో చికిత్స
చెవి, ముక్కు, గొంతు సమస్యలు కూడా ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యలు అన్ని కూడా రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన, మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన సమస్య తీవ్రత పెరిగి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది. 3)తల తిరగటం: ఇది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో గమనిస్తూనే ఉంటాము. ముఖ్యంగా పడుకున్నప్పుడు గాని, పడుకుని చాలా తొందరగా లేచినప్పుడు, సడెన్‌గా పైకి చూసినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవటం వలన కూడా ఇది వస్తుంది. 4) మీనియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో ముఖ్యంగా తల తిరగటం, సరిగ్గా వినిపించక పోవటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. 5) ఎకోస్టిక్ న్యూరోమా: ఇది చెవిలోపల ఒక కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరుమని శబ్దాలు, నడిచేటప్పుడు కూడా సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవటం, మొహం అంతా తిమ్మిరి రావటం వంటి లక్షణాలు వస్తాయి. కఖఐ పరీక్ష చేయించుకుంటే కణితి సైజ్ ఎలా ఉన్నది తెలుస్తుంది. 6) ల్యాబరింథైటిస్, వెస్టిబ్యులార్ మ్యారైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వలన ఈ సమస్య వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వలన వస్తుంది. చెవి మధ్యపొర నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో కూడా ముఖ్యంగా తల తిరగటం, వికారం, వినికిడిలోపం వంటివి ఉంటాయి. 7) ఓటో స్ల్కీరోసి్‌స్, టినిటస్ లాంటి సమస్యలు: ఇవి చెవిలోపల సర్వ సాధారణంగా గమనిస్తుంటాము. ఇదేవిధంగా ముక్కు లోపల కూడా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించి, ఎలర్జీ వంటి సమస్యలు వస్తూంటాయి. అవి... ఎలర్జిక్ సైనసైటిస్ ఎపిస్టాక్సిస్ సైనసైటిస్. ఈ పైన చెప్పిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తి క్షీణించటం వలన, సాధారణమైన జలుబు, తుమ్ములు, ముక్కు నుంచి విపరీతంగా నీరు కారటంతో మొదలయి, సరైన రీతిలో చికిత్స తీసుకోక, విపరీతమైన కఫం లేదా శ్లేష్మం గాలి రంధ్రాలలో పేరుకుపోయి, వాటికి వాపు వస్తుంది. ఈ సమస్యను సైనసైటిస్ అంటారు. దీనిలో తలబరువు, వికారం, వాంతులు, వాసన తెలియకపోవటం, నీరసం, అలసట, ఎవరి పనులు వారు చేసుకోలేక పోవటం వంటి సమస్యలు వస్తాయి. చెవి, ముక్కుకు వచ్చే సమస్యలు గొంతు సమస్యలకు కూడా దారి తీస్తుంటాయి. వీటిలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి రోజురోజుకి తగ్గి మొత్తం చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏర్పడుతుంటాయి. సాధారణంగా వచ్చే గొంతు సమస్యలు: స్వరపేటికలో వచ్చే సమస్యలు: ఇవి ముఖ్యంగా, గొంతు ఎక్కువగా వాడటం వలన అంటే ఎక్కువగా మాట్లాడే వారిలో, పాటలు పాడే వాళ్ళలో, హైపోథైరాయిడిజమ్, సైనసైటిస్‌తో ఎక్కువ కాలంగా బాధపడుతున్న, విపరీతమైన దగ్గు ఉండే వాళ్ళల్లో వస్తుంది. అరుగుదల సమస్య ఉండే వాళ్ళల్లో కూడా గొంతు దగ్గర మంట, నొప్పి, తీసుకున్న ఆహారం మింగలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’కు దారి తీస్తాయి. చెవిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఇవి 1) చెవి వెలుపలి పొర 2) మధ్య భాగంలో ఉండే పొర 3) లోపలి పొర. సాధారణంగా ఈ 3 పొరలకు ఇన్ఫెక్షన్స్ గాని, వేరే ఇతర వ్యాధులు గాని రావటం జరుగుతుంది. సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు 1) చెవి వెలుపలి పొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: దీనివలన దురద, నొప్పి, వాపుతో కూడి చెవి నుంచి స్రావం వస్తుంది. ఆ స్రావం ఒక్కొక్కసారి నీరు లేదా చీముతో కూడిన స్రావం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవటం వలన, ఒక్కొక్కసారి త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా కూడా చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. త్వరితంగా వచ్చేవి అంటే ఎక్యూట్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా అని అంటారు. ఇన్ఫెక్షన్స్ తీవ్రతను బట్టి అది ఎక్యూట్ లేదా క్రానిక్ అని గుర్తించి, చికిత్స చేయాల్సి ఉంటుంది. 2) మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: ఇది ముఖ్యంగా ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అంతే గాకుండా ఎలర్జీ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తరచుగా ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. దీనిలో ఉండే ముఖ్య లక్షణాలు: చెవినొప్పి సరిగ్గా వినబడకపోవటం చెవి అంతా పట్టేసినట్లు ఉండడం జ్వరం తలంతా బరువుగా ఉండి ఏ పనిచెయ్యాలని అనిపించకపోవటం తల తిరగటం. పాజిటివ్ హోమియోపతిలో పేషెంట్ తత్త్వాన్ని బట్టి మందులు ఇచ్చి, వ్యాధి యొక్క మూలకారణాన్ని ఎనాలసిస్ చేసుకుని ‘జెనిటిక్ కానిస్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఆపడమే కాకుండా, పూర్తిస్థాయిలో చికిత్స ఇవ్వడం జరుగుతుంది. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com