కీళ్ళనొప్పులు వాటి కారణాలు - హోమియో చికిత్స | Homeo treatment for arthritis | Sakshi
Sakshi News home page

కీళ్ళనొప్పులు వాటి కారణాలు - హోమియో చికిత్స

Published Thu, Aug 29 2013 12:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

కీళ్ళనొప్పులు వాటి కారణాలు - హోమియో చికిత్స

కీళ్ళనొప్పులు వాటి కారణాలు - హోమియో చికిత్స

 నేటి ఆధునిక జీవనం కీళ్ళపైన మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్ళ జబ్బులను పెంచుతాయి. వీటన్నింటికి తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకురావచ్చు. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది.
 
నడవడమే కష్టం... ఎందుకంటే?

కీళ్ళలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగం విపరీతమైన నొప్పి, వాపు బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం  వచ్చే అవకాశం ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తరువాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్నిరకాల పనులు చేయలేము. కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది.
 
 ఎందుకా వాపు - కీళ్ళలో జరిగే మార్పులు


 కీళ్ళు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. కీళ్ళసమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితం అయినా ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడుతుంది. ఫలితంగా కీళ్ళ కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్కభాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోఫైట్స్ కీళ్ళను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డలుగా తయారవుతుంది. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురుపదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది.
 
 ఆపరేషన్ లేకుండా హోమియోలో చికిత్స

కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్థారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్‌ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
 
 డాక్టర్ మురళి అంకిరెడ్డి,
 ఎం.డి (హోమియో),
 స్టార్ హోమియోపతి,
 సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్,  కూకట్‌పల్లి,
 విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి,
 రాజమండ్రి, కర్ణాటక
 www.starhomeo.com
 ph: 7416107107 / 7416109109

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement