మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారం చేసిన ప్రభుత్వ టీచర్
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సదరు మహిళ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారం ఒడిగట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోతు సునీల్‌కుమార్ జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అతడు భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 2018 నుంచి ఆ మహిళతోనే ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు భర్త లేడు. ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వారిని చదివించుకుంటూ సునీల్‌కుమార్‌తోనే ఉంటోంది.
తల్లితో సహజీవనం చేస్తూ.. ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం..
జాటోతు సునీల్‌కుమార్ కన్ను ఆ మహిళ కుమార్తెలపై పడింది. వారిని ఎలాగైనా లొంగతీసుకోవాలనే కోరికతో కొద్దిరోజులుగా ముగ్గురికి నిద్రమాత్రలు ఇస్తూ సదరు మహిళ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే చంపేస్తానని బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. ఓ రోజు సదరు మహిళ చూస్తుండగానే ఆమె కుమార్తెపై సునీల్‌కుమార్ అత్యాచారం చేస్తుండగా వెంటనే కేకలు వేసి అతడి చెర నుంచి విడిపించింది.
పోక్సో కేసు నమోదు...
సదరు మహిళ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 5వ తేదీన సునీల్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సునీల్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. సునీల్‌కుమార్ తనను తనను పెళ్లి కూడా చేసుకున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
ఉపాధ్యాయుడికి హెచ్‌ఐవీ..?
సునీల్‌కుమార్‌కు హెచ్‌ఐవీతో పాటు పలు సుఖ వ్యాధులు ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేసి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేసి హెచ్‌ఐవీ టెస్ట్ చేయిస్తామని పట్టణ సీఐ తెలిపారు. అదేవిధంగా సదరు మహిళకు, ఆమె కుమార్తెలకు కూడా సోమవారం హెచ్‌ఐవీ పరీక్షలు చేయించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment