Coexistence
-
‘‘గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’’, నూయార్క్‌కు చేరుకున్న గజరాజులు
భారతీయ కళాకారులు రూపొందించిన అపురూపమైన ‘‘గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’’ 100 ఏనుగుల కళాశిల్పాలు న్యూయార్క్ చేరుకున్నాయి. ప్రతి ఏనుగును తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ నుండి 200 మంది దేశీయ కళాకారులతో కూడిన ది కోఎక్సిస్టెన్స్ కలెక్టివ్ రూపొందించింది. ఈ అద్భుతమైన కళాఖండాల త తయారీకి ఐదేళ్ళు పట్టింది. ఇవి అమెరికా అంతా పర్యటించి సహజీవనం సందేశాన్ని వ్యాప్తి చేయనున్నాయి. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.Look ! Indian Elephants have finally arrived in New York. Titled as the 'Great Elephant Migration' a travelling herd of 100 stunning life size elephant sculptures have reached NYC. These elephant sculptures have been made by local tribal artisans from Gudalur in Nilgiris, Tamil… pic.twitter.com/AVolGQLDtJ— Supriya Sahu IAS (@supriyasahuias) September 6, 2024తమిళనాడులోని నీలగిరిలోని గూడలూర్‌కు చెందిన స్థానిక గిరిజన కళాకారులచే లాంటానా జాతికి చెందిన కలుపు మొక్కల చెక్క నుంచి ఈ కళాకృతులను రూపొందించారు. ‘‘మానవ-వన్యప్రాణుల సహజీవన ప్రాజెక్టుల’’ కోసం మిలియన్ల డాలర్లను సేకరించాలనే లక్ష్యంతోపాటు, ‘‘భూమి, నదులు, ఆకాశం మరియు మహాసముద్రాల మీదుగా అద్భుతమైన ప్రయాణాలు చేసే వలస జంతువులను రక్షించడం’’ఈ శిల్పాలను ఎవరు రూపొందించారు?బెట్టకురుంబ, పనియా, కట్టునాయకన్ , సోలిగ కమ్యూనిటీలకు చెందిన కళాకారులు కలిసి ప్రతి జీవం-వంటి, శరీర నిర్మాణపరంగా ఎలాంటి తేడా లేకుండా క్లిష్టమైన ఏనుగు శిల్పాలను రూపొందించారు. అక్టోబర్ 20 వరకు న్యూయార్క్ నగరంలో తర్వాత ఆర్ట్ బాసెల్ మయామికి వెళతాయి. లాస్ ఏంజిల్స్‌లో, బ్లాక్ఫీట్ నేషన్ మధ్య మోంటానాలోని బ్రౌనింగ్లోని బఫెలో ,పరిరక్షణ బృందం హ్యూస్టన్ , గ్లేసియర్ నేషనల్ పార్క్, ఈ శిల్పాలు 13 నెలల పాటు అమెరికా వివిధ ప్రాంతాలలో కొలువుదీరతాయి. -
యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ
నైనిటాల్: సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) ఇంకా అమల్లో రాలేదు. అయినప్పటికీ ఈ చట్టం కింద 48 గంటల్లోగా రిజిస్టర్ చేసుకున్న పక్షంలో పిటిషన్‌దారుగా ఉన్న జంటకు ఆరు వారాలపాటు రక్షణ కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్ల డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున జూనియర్ న్యాయవాది హాజరయ్యారు. రాష్ట్రంలో యూసీసీ అమలుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదనే విషయం ఆయనకు తెలియదు. అవగాహనా లోపం వల్ల ఇలా జరిగింది. దీనిపై హైకోర్టులో రీ కాల్ పిటిషన్ వేస్తాం. హైకోర్టు ఈ తీర్పును సవరించి, మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తుంది’అని చెప్పారు. అదే సమయంలో, ఆ జంటకు పోలీసులు రక్షణ కల్పిస్తారని కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. వేర్వేరు మతాలకు చెందిన తమ కుటుంబాల నుంచి ముప్పుందంటూ సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల హిందూ మహిళ, 21 ఏళ్ల ముస్లిం యువకుడు వేసిన పిటిషన్ ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిపాదించిన యూసీసీ ప్రకారం యువ జంటలు తాము సహజీవనం చేస్తున్న రోజు నుంచి నెల రోజుల్లోగా అధికారుల వద్ద నమోదు చేసుకోకుంటే జరిమానా విధించొచ్చు. -
‘డిజైన్డ్’ సంసారం! సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి!!
కలిసి జీవనం ప్రారంభించడం, బాధ్యతలు, వ్యయాలు సమానంగా పంచుకోవడం, పరస్పర వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గౌరవించుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించకపోవడం, ఇష్టమున్నంత కాలం కలిసి ఉండడం, ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నా సింపుల్‌గా ‘బై..బై’ చెప్పేయడం.. ఇదే ‘లివిన్’. సహజీవనంతో మరింత బలపడిన అనుబంధాన్ని పెళ్లితో చట్టబద్దం చేసుకుంటున్నవారూ లేకపోలే దు.. అయితే కొంతకాలం అనుబంధం తర్వాత విడిపోయి కూడా ఫ్రెండ్స్‌గా కొనసాగే వారూ ఉన్నారు.ఇటీవల యువ అనుబంధాలపై లయన్స్ గేట్ ప్లే అనే సంస్థ స్వతంత్ర అధ్యయనం నిర్వహించింది. ‘లయన్స్‌గేట్ ప్లే రిలేషన్ షిప్ మీటర్’ పేరిట విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో అత్యధికులు లివిన్ రిలేషన్ షిప్స్‌కి జై కొడుతున్నారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరోశాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడానికి బదులు వారు లివిన్ రిలేషన్ షిప్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలనే ఆధునికులు ఎంచుకుంటున్నారు. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి పెళ్లికన్నా లివిన్ రిలేషన్ షిప్లో ఉండటం మేలని 50 శాతం మంది అంటున్నారు. ఈ రిలేషన్ షిప్లో ఉండటానికి తల్లిదండ్రులు అంగీకరిస్తారని 34% మంది భావిస్తున్నారు.భార్య, భర్త కాదు.. ఓన్లీ ఫ్రెండ్స్..ప్రేమను కొనసాగించడానికి స్నేహమే మూలమని నవతరం నమ్ముతున్నారు. ఆ మధ్య ప్రేమ అంటే స్నేహం అని అర్థం చెప్పిన బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ అభిప్రాయం సరైనదేనని 87 శాతం మంది పురుషులు 92 శాతం మహిళలు భావిస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగొచ్చు అంటూ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ మాజీ ప్రియుడితో స్నేహం చేయడం మంచిదంటున్నారు. కేవలం 30% మంది భారతీయులు మాత్రమే తమ భాగస్వామి అపోజిట్ సెక్స్‌కి చెందిన క్లోజ్ ఫ్రెండ్‌ని కలిగి ఉండటం పట్ల అసౌకర్యంగా ఉన్నారు.ఎంపికలో కీలకం ఇవే..భాగస్వామి ఎంపికలో భావోద్వేగ సంబంధం కన్నా అందానికే 50 శాతం మంది పురుషులు ప్రాధాన్యత ఇస్తుండగా మహిళలు 35 శాతం మంది మాత్రమే లుక్స్‌కి విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా సురక్షితంగా ఉండే రిలేషన్ షిప్‌లోకి మాత్రమే ప్రవేశించాలని 72 శాతం మంది భావిస్తున్నారు. ఇంటి ఖర్చులను జంటగా పంచుకోవాలని 50 శాతం మంది మహిళలు అంటుంటే 37 మంది పురుషులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.బ్రేకప్.. వాట్ నెక్ట్స్?అనుబంధాలు ముక్కలయ్యాక ఏమిటి పరిస్థితి? హృదయం ముక్కలైపోతుందేమోనని, ఒంటరిగా ఉండడం కష్టమని, మళ్లీ ప్రేమ దొరకదేమోననే భయాల్లో 60 శాతం మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో పురుషులు ఎమోషనల్‌గా కనిపిస్తుండగా, మహిళలు ఆచరణాత్మకమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. 53% మంది మహిళలు ‘మాజీని మరచిపోయి ముందుకు సాగుదాం’ అనే వైఖరిని కలిగి ఉన్నారు. కానీ 66% మంది పురుషులు తమ మొదటి ప్రేమకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.అలాగే 37% మంది విడిపోయిన తర్వాత కూడా భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో నివసించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. అయితే రిలేషన్‌ను తిరిగి నిర్మించుకోవడం కంటే ముగించుకోవడమే సులభమని 33 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల వారిలో 72% మంది 27 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల వారిలో 67% మంది అంగీకరిస్తున్నారు. అలాగే అనుబంధం ముగిశాక ముందుకు సాగడానికి కొత్త బంధాన్ని ప్రారంభించడం ఉత్తమమని 48% మంది భావిస్తున్నారు.తారా పథంలో..ఫ్యాషన్ల నుంచి ఎమోషన్ల వరకూ దేనికైనా సరే అపరిమితమైన ఫాలోయింగ్ రావాలంటే.. దాన్ని సెలబ్రిటీ ఆదరించాలి. ఈ లివిన్ రిలేషన్íÙప్ విషయంలో కూడా అదే జరిగింది. చాలామంది నటీనటులు ఇలా ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. దాన్ని అనుసరిస్తూ కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పెళ్లికి ప్రత్యామ్నాయంగా యువత ఈ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. అప్పట్లో హాలీవుడ్లో బ్రాడ్‌పిట్, ఏంజెలినా జోలి నుంచీ ప్రీతిజింతా, సుస్మితాసేన్, సంజయ్‌దత్‌లతో పాటు కరీనా–సైఫ్ అలీఖాన్ ఇంకా ఎందరెందరో ఈ కల్చర్‌ని కలర్ఫుల్గా మార్చారు.నగరంలో స్థిరపడిన సంస్కృతి..వుయ్ ఆర్ మ్యారీడ్ అన్నంత సహజంగా వుయ్ ఆర్ ఇన్ రిలేషన్ షిప్ అంటున్నాయి జంటలు. ఆ అనుబంధం పేరే లివిన్. ‘లివింగ్ టు గెదర్’ తెలుగీకరిస్తే ‘సహజీవనం’. వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, స్త్రీ–పురుషుడు కలిసి ఉండడమే ‘లివిన్ రిలేషన్íÙప్’. భిన్న సంస్కృతుల నిలయమైన నగర జీవనంలో వైవాహిక బంధానికి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త సంస్కృతి స్థిరపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.పెరుగుతున్న మోసాలు.. గతంలో మహిళా కమిషన్ వర్గాలు వెల్లడించిన డేటా ప్రకారం.. లివ్ ఇన్‌కు సంబంధించిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, తెలంగాణలోని రంగారెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అగ్రగామిగా హైదరాబాద్ నిలిచింది. లివిన్ చీటింగ్ కేసుల్లో 47 శాతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా కౌన్సిలింగ్ కేంద్రాలకు ఒక్క ఏడాదిలోనే 2వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.జాగ్రత్తలు తప్పనిసరి..ఏదేమైనా తప్పుకాదనుకునో, తప్పనిసరిగానో ఈ అనుబంధంలోకి అడుగుపెడుతున్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భాగస్వామి మరణించినా, మరే కారణం చేత దూరమైనా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ‘లివిన్’ కొనసాగుతున్నప్పుడు అర్జించిన ఉమ్మడి ఆదాయాలకి సంబంధించిన ఒప్పందాలు, స్థిర, చరాస్తుల పంపకాలకు సంబంధించిన ఒప్పందాలను ముందుగానే రాసుకోవడం మంచిదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.పుట్టిన పిల్లలకు కూడా మున్ముందు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. అనూహ్యమైన ప్రమాదాలతో భాగస్వామి ఆస్పత్రి పాలైతే అవసరమైన సేవలు అందించడానికి, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బాధితవ్యక్తి తల్లిదండ్రులు, బంధువుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. మెడికల్ పవర్ ఆఫ్ అటారీ్నని ముందుగా రాయడం ద్వారా అధిగమించవచ్చు.‘లివిన్’కు కారణాలెన్నో..నగరం ఈ తరహా బంధాలకు నెలవుగా మారుతోంది. సినిమా, మోడలింగ్, ఎంటర్టైన్మెంట్, టీవీ, మీడియా, ఐటీ, సాఫ్ట్వేర్.. రంగాలకు చెందిన యువతీ యువకులు ఈ అనుబంధంవైపు తేలికగా ఆకర్షితులవుతున్నారు.మహిళలు, పురుషులు ఎవరికి వారు వ్యక్తిగత కెరీర్‌ను, విజయాలను కోరుకోవడం, కెరీర్‌ను కొనసాగిస్తూనే భావోద్వేగపూరిత బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నారు.వ్యక్తిగత ఖర్చులు భరించలేక రూమ్ షేర్ చేసుకోవడంతో మొదలై ‘లివిన్’గా మారుతోంది.పబ్స్ నుంచి క్లబ్స్ వరకూ ‘స్టాగ్స్ నాట్ అలవ్డ్’ అని బోర్డు పెడతారు. దీంతో రోజుకొకర్ని వెంటేసుకుని వెళ్లేకన్నా.. స్థిరంగా ఉండే బాయ్‌ఫ్రెండ్/గరల్ ఫ్రెండ్ మిన్న అని భావించడం.పెళ్లిద్వారా పరస్పరం సంక్రమించే హక్కుల పట్ల భయం.చట్టబద్దమైన బంధంలోకి వెళ్లే ముందుగా తమ భాగస్వామిని అర్థం చేసుకోవాలనుకోవడం.ఈ కొత్త తరహా జీవనశైలి మానసిక సంఘర్షణకు, తీవ్ర ఒత్తిడికీ దారి తీస్తాయి. అద్దె ఇంటి దగ్గర్నుంచి ఆఫీసు వ్యవహారాల వరకూ పెళ్లికాని కాపురం చేయాలనుకునే యువత చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వివాహం కంటే బలమైన అనుబంధం తమ మధ్య ఉందనుకున్నప్పుడు మిగిలిన విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అలాగే ఆవేశంలోనో, ఫ్యాషన్‌గానో, సహజీవనంలోని లోతుపాతులు తెలియకుండా అడుగుపెట్టడం సహజీవనంలోకి అడుగుపెట్టడం మంచిది కాదు’ అంటారు రచయిత్రి ఓల్గా. ఫిర్యాదులు ఇలా..నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఫిబ్రవరి 18న ఈవెంట్ ఆర్గనైజర్ సేవలు అందించే 30ఏళ్ల మహిళ తన భాగస్వామి ఖాలిద్ చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.గత ఏప్రిల్ 1న గచ్చి»ౌలిలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న లివ్ ఇన్ కపుల్ మధ్య వ్యక్తిగత విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మాయిది చత్తీస్‌గఢ్ కాగా అబ్బాయిది బీహార్ కావడం గమనార్హం.అనురాథారెడ్డి అనే మహిళ తనకన్నా వయసులో చిన్నవాడైన చంద్రమోహన్ అనే వ్యాపారితో రిలేషన్ షిప్లో ఉంటూ హత్యకు గురయ్యారు. ముక్కలైన ఈమె మృతదేహాన్ని గతేడాది మే 25న పోలీసులు కనుగొన్నారు.లివిన్ రిలేషన్ షిప్లో ఉంటూ తమ జల్సాలు తీర్చుకోవడం కోసం మ్యాట్రిమోనియల్ పేరిట అబ్బాయిలకు వలవేస్తున్న యువతిని, ఆమె లివిన్ పార్ట్నర్ని రాచకొండ పోలీసులు 2022 డిసెంబరు 18న అరెస్ట్ చేశారు.గతేడాది జూలై 23న ఫిలింనగర్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్ శివకుమార్ తన లివిన్ పార్ట్నర్తో వచి్చన విబేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మహిళల పక్షపాతిగా మారిన కొన్ని చట్టాలు అబ్బాయిల్ని పెళ్లికి విముఖులుగా మార్చి, ఈ బంధం వైపు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.ఆడవాళ్లకే నష్టం ఎక్కువ..ఏదేమైనా, ఇందులో పార్ట్నర్స్ ఇద్దరికీ ఎటువంటి హక్కులూ ఉండవు. ‘సహజీవనం’ విఫలమై మా వద్దకు వస్తున్న మహిళలు కొంత కాలం కలిసి జీవించాక విడిపోతే మనోవర్తి వస్తుందా? అని అడుగుతున్నారు. ఈ బంధానికి చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల ఆడవాళ్లకే నష్టం ఎక్కువ జరుగుతోంది. – నిశ్చలసిద్ధారెడ్డి, హైకోర్టు అడ్వకేట్ఇవి చదవండి: స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం.. -
సహజీవనం చేస్తున్న ఇద్దరి ఆత్మహత్య
కోటపల్లి: మండలంలోని సర్వాయిపేట గ్రా మానికి చెందిన ఇద్దరు ఉరేసుకుని మృతిచెందిన ఘటన మండలంలో సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేటకు చెందిన కోట రాజేశ్ (40), నాయిని చీకటి (28) కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. వెలమపల్లి జాతీయ రహదారి పక్కన గల ఇటుకల కంపెనీలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాలో వీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఇటుకల కంపెనీలో పనిచేసే మిగతా కూలీలు సామగ్రి భద్రపరిచేందుకు వెళ్లి గుర్తించారు. స్థానికులకు, కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబీకులు ఇరువురి మృతిపై అనుమానం వ్యక్తం చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక ఇతర కారణలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బౌద్ధవాణి...సమజీవనం
వసంత రుతువు వచ్చేసింది. వనమంతా పూలతో పరిమళిస్తోంది. హిమాలయ ప్రాంంతంలో కోలియులకు చెందిన కక్కరవస్తు నగరం అది. ఆ నగర సమీప వనంలో విశాలమైన రావిచెట్టు కింద కూర్చొని ఉన్నాడు బుద్ధుడు తన భిక్షు సంఘంతో. కోలియ యువకుడు దీర్ఘజాణుడు కూడా వచ్చి బుద్దుని దగ్గరే కూర్చుని తన సందేహాలు తీర్చుకుంటున్నాడు. ‘భగవాన్! లోకంలో హితకారి, సుఖకారి అయిన నాలుగు ధర్మాల గురించి చెప్పండి?’ అని అడిగాడు. ఆ ప్రశ్నతో అక్కడ ఉన్న భిక్షువులందరూ సర్దుకు కూర్చున్నారు. అంతలో కొద్దిదూరంలో రైతులు లయబద్ధంగా అరిచే అరుపులు వినిపించాయి. కావళ్ళకు ధాన్యం మోపులు కట్టుకుని, భుజాన మోస్తూ, వేగంగా నడుస్తూ ఉన్నా రైతులు ‘ఓహోం.. ఓహోం..’’ అంటూ అరుస్తూ, ఆ వూపులో వేగంగా పోతున్నారు. వారి మధ్యలో ఉన్న రైతు కావడిని కాస్త ముందుకు సర్దుకున్నాడు. దానితో వెనుక బలం పెరిగింది. గట్టు దాటే సమయంలో వెనక్కు పడిపోయాడు. మరలా లేచి కావడిబద్దను భుజానికి ఎత్తి, ముందూ, వెనుకల బరువులు సర్దుకుని వారితో నడక సాగించాడు. కానీ, వెనుకపడ్డాడు. రైతులు వెళ్ళిపోయారు. ‘‘దీర్ఘజాణా; ఈ లోకంలో హితాన్ని, సుఖాన్ని కూర్చే ఉత్థాన సంపద, ఆరక్ష సంపద, కళ్యాణ మిత్రత, సమజీవనం– అనే నాలుగు సంపదలు ఉన్నాయి’’ అన్నాడు. ‘‘భగవాన్! వాటి గురించి చెప్పండి’’ అడిగాడు దీర్ఘజాణుడు నమ్రతగా. ‘‘దీర్ఘజాణూ! వృత్తి ద్వారా సంపాదించేది ఉత్థాన సంపద. పశుపాలనం, వ్యవసాయం, వాణిజ్యం, శిల్పకళ, ఉద్యోగం... సోమరితనాన్ని వీడి ఈ వృత్తులు నిర్వహించడంలో నేర్పరి అవుతారు. ఇలా సాధించుకున్నదే ఈ సంపద’’ ‘‘అలాగే! ఒకరు తమ కండబలాన్ని ఉపయోగించి, నిరంతరం శ్రమించి, కష్టపడి చమటోడ్చి, సంపద కూర్చుకుంటాడు. తాను శ్రమించి పొందిన ఈ సంపదని రాజులు, దొంగలు కాజేయకుండా, అగ్నికి ఆహుతి కాకుండా, వరదపాలు కాకుండా రక్షించుకుంటాడు. దీన్నే ఆ రక్ష సంపద అంటారు. ‘‘మరి, దీర్ఘజాణూ! మిత్రులు కూడా మనకు సంపదే! శీలవంతులు, సదాచారులు, శ్రద్ధావంతులు, ప్రజ్ఞానులు, త్యాగబుద్ధి కలిగిన మిత్రులు ఉంటే... మనం కూడా వారిలా శీలసంపద పొందుతాం. శ్రద్ధాసంపద సాధిస్తాం. సదాచారులై జీవిస్తాం. ఇలా శీల, జ్ఞాన సంపదలు మనకు మంచి మిత్రుల వల్ల వస్తాయి. అందుకే కల్యాణ(మంచి) మిత్రులు కూడా మనకు ఒక సంపదే. ఇక, సమజీవనం అంటే అన్నింటికంటే మనకు హితకారి. కొందరు ఆడంబరాల కోసం తమ ఆదాయానికి మించి వ్యయం చేస్తారు. ఇంకొందరు ఎక్కువ ధనం ఉన్నప్పటికీ పిసినారితనం చూపుతారు. వీరిద్దరూ మోసే కావడి ఏదో ఒకవైపు బరువు పెరిగో, తరిగో సమతుల్యత కోల్పోతుంది. దానివల్ల మోసేవాడి భుజం పట్టు తప్పుతుంది. కావడి పడిపోతూ... మోసేవారినీ పడేస్తుంది.’’ ‘‘దీర్ఘజాణూ..! అలా కాకుండా ఆదాయ వ్యయాలను సరితూచుకుంటూ జీవించే వారే ‘సమజీవనం’ సాగించేవారు. విలాసాలూ, విందులూ, ఇతరులతో పోల్చుకుని అతిగా వ్యయం చేయడం మాని, అవసరాల మేరకు జీవిస్తే... కొద్దిగా ఆదాయం కూడా సమకూరుతుంది. వారి జీవితం నిశ్చింతగా సాగుతుంది; దీర్ఘజాణూ! సకల గృహస్తులకు ఈ సమజీవనం చాలా అవసరం! ఎందుకంటే... ఇదే హితం! ఇదే సుఖం!’’ అన్నాడు బుద్ధుడు. దూరం నుండి రైతులు కావళ్ళు మోస్తూ లయబద్ధంగా అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి! ధీర్ఘజాణు వంగి బుద్ధుని పాదాలకు నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ప్రియురాలి మోసం.. తీసింది ప్రాణం
కర్ణాటక: సహజీవనం చేస్తున్న ప్రియురాలు మోసం చేసిందనే బాధతో యువకుడు (29) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బెంగళూరు పరప్పన అగ్రహార నివాసి అన్బరసన్. గతనెల 15 తేదీన తన అపార్టుమెంట్ ఫ్లాటులో ఉరివేసుకున్న స్థితిలో చనిపోయాడు. అయితే ఆ కేసు ఇప్పుడు మలుపు తిరిగింది. మృతుని మొబైల్ఫోన్లో ఆడియోలను ఆలకించిన అతని తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. విద్య, సంతోష్ అనే ఇద్దరిపై కేసు పెట్టారు. అన్బరసన్ గత ఆరునెలలనుంచి విద్య అనే యువతిని ప్రేమించి సహజీవనం చేస్తున్నాడు. ఇతడ ఈ కామర్స్ సంస్థలో మేనేజర్. ఐటీ ఇంజినీరుగా పనిచేసే విద్య, భర్తకు విడాకులిచ్చి అన్బరసన్ అద్దెకు తీసుకున్న ఇంట్లో ఉండేది. మరోవైపు ఆమె సంతోష్ అనే వ్యక్తితోనూ చనువుగా ఉంటోంది. అన్బరసన్ ఇది కనిపెట్టి విద్యతో గొడవపడి తరువాత ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
యువకుల ప్రేమ.. సహజీవనం.. ప్రేమ కోసం అమ్మాయిగా మారితే.. షాకిచ్చిన యువకుడు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇద్దరు యువకులు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. ఇరుగు పొరుగువారి నుంచి ఛీత్కారం ఎదురైంది. తమలో ఒకరు అమ్మాయిగా మారితే ఇరుగుపొరుగువారి నుంచి ఇబ్బందులు ఉండవని ఓ యువకుడు భావించాడు. జీవితాంతం స్నేహితుడితోనే కలిసి ఉండొచ్చని ఆశపడ్డ అతను లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే ఆపరేషన్ చేయించుకుని ఆమెగా మారిన అతడిని స్నేహితుడు మోసగించాడు. పెళ్లి చేసుకోనంటూ ఇంటి నుంచి గెంటేశాడు. మోసపోయిన ఆమె ఫిర్యాదు చేయడంతో కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. పెనమలూరుకు చెందిన ఎ.పవన్, కృష్ణలంకకు చెందిన ఇ.నాగేశ్వరరావు 2017–19 మధ్య కాలంలో బీఈడీ చేసే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్ని నెలల తరువాత ఆ ఇష్టం ప్రేమగా మారడంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. బీఈడీ పూర్తయ్యాక 2019 నుంచి కృష్ణలంకలోని సత్యంగారి హోటల్ సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించి, బతుకుదెరువు కోసం అక్కడే ట్యూషన్ సెంటర్ నిర్వహించారు. ఇద్దరి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి మాటలు తట్టుకోలేక, విడిపోయి ఉండలేక మానసిక వేదన అనుభవించారు. తమలో ఒకరు అమ్మాయిగా మారితే కలిసి జీవించేందుకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవనే నిర్ణయానికి వచ్చారు. పవన్ ఢిల్లీ వెళ్లి రూ.లక్షలు వెచ్చించి లింగమార్పిడి ఆపరేషన్ చేయించు కుని యువతిగా మారి భ్రమరాంబికగా సమాజంలోకి అడుగుపెట్టాడు. అయితే భ్రమరాంబిక సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రేమి కుడు ఆమెను మోసగించి పరారయ్యాడు. పోలీస్ స్టేషన్‌కు చేరిన కథ నాగేశ్వరరావు కోసం తన జీవితాన్నే త్యాగం చేశానని, అతను తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ భ్రమరాంబిక ఈ నెల పదో తేదీన కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటాడని నమ్మి నాగేశ్వరరావుకు పలు విడతలుగా రూ.26 లక్షల నగదు, 11 నవర్సల బంగారం ఇచ్చానని, 2022 డిసెంబర్లో తనను పెళ్లి చేసుకోనని నాగేశ్వరరావు తేల్చిచెప్పి, ఇంటి నుంచి గెంటేసి, మంగళగిరికి మకాం మార్చాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసగించి, తన నగదులో పరారైన నాగేశ్వరరావు, అందుకు కారణమైన అతని తల్లి విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరింది. నాగేశ్వరరావు, అతని తల్లి విజయలక్ష్మిపై చీటింగ్, నమ్మకద్రోహం, ట్రాన్స్ జెండర్ హక్కుల రక్షణ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సహజీవనం చేస్తున్న మహిళను, కుమార్తెను గోదావరిలోకి తోసేసి..
అమలాపురం టౌన్/రావులపాలెం: సహజీవనం చేస్తున్న మహిళను, కుమార్తెను గౌతమీ గోదావరిలోకి తోసేసిన ఘటనలో తల్లీబిడ్డల కోసం గాలింపు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. డయల్ 100 కాల్‌తో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. అమలాపురంలోని తన కార్యాలయంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. తనతో సహజీవనం సాగిస్తున్న తాడేపల్లికి చెందిన మహిళ సుహాసినితో పాటు కుమార్తెలు లక్ష్మీసాయి కీర్తన, ఏడాది పాప జెర్సీని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్ ఆదివారం వేకువజామున రావులపాలెం వంతెనపై నుంచి గోదావరిలోకి నిర్దాక్షిణ్యంగా తోసేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో సుహాసిని, జెర్సీ గోదావరిలో పడి, గల్లంతవగా, కీర్తన వంతెన కేబుల్ పైపు పట్టుకుని 100 నంబర్‌కు సమాచారం ఇవ్వడం, ఆ బాలికను పోలీసులు రక్షించడం విదితమే. గోదావరిలో గల్లంతైన సుహాసిని, జెర్సీల కోసం రావులపాలెం, ఆలమూరు పోలీసులు రెండు ప్రత్యేక బోట్లతో గౌతమీ గోదావరిలో విస్తృతంగా గాలిస్తున్నారని ఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఉదయం నుంచీ గాలింపు సాగుతోందని, సోమవారం సాయంత్రం వరకూ వారి ఆచూకీ తెలియరాలేదని చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడిన సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పెద్దమ్మను రప్పించి.. కాగా, ఈ ఘటనలో రక్షించిన పదమూడేళ్ల లక్ష్మీ సాయి కీర్తనను పోలీసులు సోమవారం ఆమె పెద్దమ్మకు అప్పగించారు. గల్లంతైన సుహాసినికి తెనాలి చించుపేటకు చెందిన పిండం సుజాత సొంత అక్క. కీర్తన ఇచ్చిన ఆధారాలతో సుజాతను రావులపాలెం రప్పించామని ఎస్సై ఎం.వెంకట రమణ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నిందితుడు ఉలవ సురేష్ విజయవాడ భవానీపురంలో తనకు తెలిసిన వారి వద్ద కారు అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సుహాసినిని, తమ కుమార్తె జెర్సీని, ఆమె కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనను ఆ కారులోనే ఎక్కించుకుని రావులపాలెం తీసుకువచ్చారని అంటున్నారు. ఆ కారు నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది. -
8 ఏళ్లుగా సహజీవనం.. చివరికి షాకింగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ : సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా బోట్లవనపర్తికి చెందిన పల్లవి (27) నగరంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఇందిరానగర్‌కు చెందిన సదానందంతో పరిచయం ఏర్పడింది. సదానందం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 8 ఏళ్లుగా అతనితో సహజీవనం చేస్తుంది. అతడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసినా పల్లవి సర్దుకుపోయింది. అయితే సదానందం తరచూ ఆమెను కొట్టేవాడు. ఈ విషయాన్ని పల్లవి పలుమార్లు తల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఈ నెల 22న తల్లికి ఫోన్ చేసి సదానందం వేధింపులు భరించలేకపోతున్నానని ఊరికి వచ్చేస్తానని చెప్పింది. మరుసటి రోజు రాత్రి కూడా సదానందం ఆమెపై దాడి చేయడంతో మనస్తాపానికిలోనైన పల్లవి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన సదానందం బస్తీ వాసులతో కలిసి ఆమెను కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు సదానందంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
సత్యవతితో సహజీవనం.. గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టడంతో..
నరసన్నపేట: స్థానిక బజారువీధిలో నివాసముంటున్న పాయకరావుపేటకు చెందిన దక్కుబల్లి శివ (35) అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టడం వలన శివ మృతి చెందాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట నుంచి నరసన్నపేటకు 15 ఏళ్ల క్రితం వలస వచ్చిన శివ తునికి చెందిన బంగారి సత్యవతితో సహజీవనం చేస్తూ బజారు వీధిలో నివాసముంటున్నారు. మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12న తీవ్ర గాయాలతో ఇంటికి రాగా సత్యవతి స్థానికుల సహాయంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 13న శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు. కాగా, శివ స్నేహితులు మాత్రం ఇది హత్యేనని, కేసు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని కోరుతున్నారు. శివ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినా రాకపోవడంతో సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామ ని ఎస్ఐ సింహాచలం తెలిపారు. -
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్‌ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
భర్త నుంచి విడిపోయి పాండిచ్చేరిలో ప్రియుడితో సహజీవనం.. కుళ్లిన స్థితిలో..
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటున్న వివాహిత మహిళ కుళ్లిన స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ ఎరుమైవెట్టిపాళ్యం గ్రామానికి చెందిన బాబు(36) స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అముద(30). వీరికి కుమార్తె జయశ్రీ(10), కుమారుడు కిషోర్(07) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నుండి విడిపోయిన అముద అదే ప్రాంతానికి చెందిన జగదీశ్వరన్ అనే వ్యక్తితో కలిసి సహాజీవనం చేస్తోంది. పాండిచ్చేరిలో ప్రియుడితో కలిసి ఉన్న అముదను గత 20 రోజుల క్రితం తల్లిదండ్రులు తీసుకొచ్చి బాబుతో కలిపి వెళ్లారు. అయితే వారం రోజుల తరువాత అముద మళ్లీ భర్తను వదిలిపెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో అముద కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు మున్సిపాలిటీలోని పెద్దకుప్పంలో మహిళ మృతదేహాం కుళ్లిన స్థితిలో కనిపించింది. మహిళ మృతదేహాన్ని వైద్యశాలకు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ అముదగా గుర్తించారు. ఈ సంఘటనపై బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..) -
శతక నీతి – సుమతి: సత్సాంగత్య ఫలం
మా చిన్న తనంలో తాగడానికి ఏటినుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చేవారు. ఒక్కొక్కసారి ఏటికి వరదొచ్చేది. అప్పుడు ఏటి నీరు ఎర్రగా ఉండేది. అందులో అంతా బురద మట్టి, చెత్త ఉండేది. ప్రతి ఇంట్లో ఇండుపకాయ గింజలు (చిల్ల గింజలు) ఒక డబ్బాలో పోసి ఉంచుకునేవారు. వాటిని కొద్దిగా అరగదీసి ఆ నీళ్ళబిందెలో పడేసి మూతపెట్టి కొన్ని గంటలు కదపకుండా ఉంచేవారు. తరువాత చూస్తే స్ఫటిక జలం ఎలా ఉంటుందో అలా స్వచ్ఛమైన నీరు పైకి తేలి ఉండేది. మడ్డి అంతా అడుగుకు చేరేది. అలా సత్పురుషుల సహవాసం అనే చిల్ల గింజ పడితే జన్మజన్మలనుంచి అంటుకొని ఉన్న దుర్మార్గపు ఆలోచనలు, గుణాలన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గుణాలు పైకి తేలతాయి. ఒక గ్రంథాలయానికి వెళ్ళి వందల పుస్తకాలు చదవండి. మీలో అంత మార్పు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కానీ సత్పురుషులతో కలిసి ఉంటే ఎన్నో వందలు, వేల పుస్తకాలు తీసుకురాలేని మార్పు మీలో వస్తుంది. తప్పుపని చేయాలనుకున్నవాడు భగవద్గీత కంటిముందు కనిపిస్తున్నా చేస్తాడు. కానీ సత్పురుషుల సమక్షంలో మాత్రం అలా చేయలేడు. ఒక దేశానికి కీర్తిప్రతిష్ఠలు అక్కడున్న భౌతికమైన సంపదలతో రావు. ఆ దేశంలో ఎంతమంది మహాత్ములున్నారన్న దానిని బట్టి కీర్తిప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు ఏర్పడుతుంటాయి. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, త్యాగరాజ స్వామి, ఒక శిబి చక్రవర్తి, ఒక రామచంద్రమూర్తి, ఒక ధర్మరాజు, ఒక చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు, ఒక అబ్దుల్ కలాం .. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది నిస్వార్థమైన పాలకులు.. వారి కారణంగా మనం ఈరోజున తలెత్తుకుని తిరుగుతున్నాం. మనకూ ఆ మర్యాద ఇస్తున్నారు. ‘నా దేశ ప్రజలందరూ నిండుగా బట్ట కట్టుకునేవరకూ వారి ప్రతినిధి అయిన నేను కూడా ఇలాగే కొల్లాయి గుడ్డే కట్టుకుంటాను’ అని లండన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ధైర్యంగా ప్రకటించారు మహాత్మా గాంధీ. అటువంటి నాయకులతో ఆ గడ్డ వైభవోపేతంగా వెలుగుతుంది. అంతేతప్ప తనకోసం బతికేవాడు, ఒక శీలవైభవం లేనివాడు, ఎప్పుడూ దుర్మార్గంగా ప్రవర్తించేవాడూ, పదిమందికి ఆదర్శం కానివాడు, తన జీవితాన్ని తాను అదుపు చేసుకోలేనివాడు, తెల్లవారి లేచింది మొదలు ఎవరిని మోసం చేద్దామా.. ఎవరికి అపకారం చేద్దామా అని ఆలోచించేవాడు, కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకు తిరిగేవాడు, ఈ దేశ పౌరుడిగా సకల సదుపాయాలు అనుభవిస్తూ ప్రాణం పోతున్నా పరులకోసం ఒక రూపాయి ఖర్చుపెట్టని వాడు... ఇటువంటి వారిని ఆకాశానికెత్తి మహాత్ములని పొగుడుతూ, వారిని ఆదర్శంగా తీసుకొని బతికితే... చిట్టచివరకు అధోగతిపాలుకాక తప్పదు. కర్ణుడు ఎంత మంచివాడయినా దుర్యోధనుడితో ఉన్నందుకు సర్వ నాశనమయిపోయాడు. రామచంద్రమూర్తి నీడన ఉన్నందుకు హనుమంతుడికి.. ఇన్ని యుగాలు గడిచినా రాముడికంటే దేవాలయాలు ఎక్కువగా కట్టి నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. రామాలయంలేని ఊరుండదు. హనుమంతుడి గుడిలేని వీథీవాడా ఉండవు. అందుకే దుర్జనులతో కలిసి సహజీవనం చేస్తుంటే... నల్లులు చేరిన మంచం బడితె దెబ్బలు తిన్నట్లుగా బాధలు పడాల్సి వస్తుందన్నది బద్దెనగారి సందేశం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఏం చేద్దాం చెప్పండి?
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, దానితో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కనుక కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో కచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమని సీఎం అన్నారు. వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. (చదవండి: ఉచితం అని చెప్పి పెయిడ్ క్వారంటైన్కా..? ) ‘కరోనాతో పోరాడుతూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాల్సి ఉంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాలు సాగాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్‌లో సడలింపులను ఎలా అమలు చేయాలి? ఏ జోన్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? దేన్ని అనుమతించాలి? దేన్ని అనుమతించకూడదు? హైదరాబాద్ విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి? ఇతర జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఏయే రంగానికి ఏ సడలింపులు ఇవ్వాలి? ఏ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి?’ తదితర అంశాల్లో అధికారులు లోతుగా ఆలోచించి, ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. (చదవండి: జిల్లాల్లో కరోనా ‘సెరో సర్వే’) అత్యుత్తమ సేవలు అందాలి.. ‘కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. వైరస్ వచ్చిన వారికి ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందాలి. కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు జరగాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్ నిబంధనలు పాటించాలి. ఇప్పటికే అన్ని రకాల పరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నం’అని సీఎం కేసీఆర్ అన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. -
సన్మార్గంలోకి మళ్లడమే నిజమైన మార్పు
శాంతియుత సహజీవనం కోసం భారత రాజ్యాంగం తన పౌరులకు కల్పించిన ఒక వెసులుబాటు ఏమిటంటే... మత స్వేచ్ఛ. దీని ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. అయితే మనలోనే కొందరు బలవంతపు మార్పిడి ప్రయత్నాల ద్వారా ఈ హక్కుకు భంగం కలిగిస్తున్నారు. అటువంటి మరొక ప్రయత్నమే... ‘మార్పిడుల పేరిట జరుగుతున్న గందరగోళాన్ని అరికట్టడానికంటూ’ మత మార్పిడి వ్యతిరేక చట్టం తీసుకురావాలని కొందరు చేస్తున్న వాదన! మతం మీద, దైవ చిత్తం మీద సరైన అవగాహన లేనివారే ఇలాంటి ప్రయత్నాలను చేస్తుంటారని మనం గుర్తించాలి. వాస్తవానికి ఒక విశ్వాసాన్ని అవలంబింపజేయాలంటే మతం మార్పించే అవసరం లేదు. అలాగే వ్యక్తి పేరును ఫలానా మతాన్ని గుర్తుకు తెచ్చే విధంగా మార్చుకునే పనీ లేదు. ఎంచేతంటే - ఏ మతము కూడా బాహ్య రూపానికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. అంతర్గత స్వచ్ఛతే దైవానికి కావలసింది. దుష్ట తలంపుల నుండి, దురలవాట్ల నుండి, దుర్మార్గం నుండి పరివర్తన చెంది సన్మార్గంలోకి, దేవుని సన్నిధిలోకి రావడమే నిజమైన మార్పిడి. సన్మార్గమే దేవుని అభిమతం. ప్రతి ప్రబోధకుడు మతాలకు అతీతంగా పౌరుల మనస్సులను సన్మార్గం వైపు మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ప్రస్తుతం భారతీయ సమాజంలో ఏర్పడిన మత అస్థిమితానికి ఆస్కారం ఉండదు. మతం పేరుతో ఒకరి పట్ల ఒకరు విద్వేషాలు పెంచుకోకుండా, పరస్పర గౌరవాభిమానాలతో మెలిగిన నాడు దేవుని దృష్టిలో ప్రశంసలు పొంది, సుఖశాంతులతో జీవించగలుగుతాం. - యస్. విజయ భాస్కర్