
కర్ణాటక: సహజీవనం చేస్తున్న ప్రియురాలు మోసం చేసిందనే బాధతో యువకుడు (29) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బెంగళూరు పరప్పన అగ్రహార నివాసి అన్బరసన్. గతనెల 15 తేదీన తన అపార్టుమెంట్ ఫ్లాటులో ఉరివేసుకున్న స్థితిలో చనిపోయాడు. అయితే ఆ కేసు ఇప్పుడు మలుపు తిరిగింది. మృతుని మొబైల్‌ఫోన్లో ఆడియోలను ఆలకించిన అతని తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
విద్య, సంతోష్ అనే ఇద్దరిపై కేసు పెట్టారు. అన్బరసన్ గత ఆరునెలలనుంచి విద్య అనే యువతిని ప్రేమించి సహజీవనం చేస్తున్నాడు. ఇతడ ఈ కామర్స్ సంస్థలో మేనేజర్. ఐటీ ఇంజినీరుగా పనిచేసే విద్య, భర్తకు విడాకులిచ్చి అన్బరసన్ అద్దెకు తీసుకున్న ఇంట్లో ఉండేది. మరోవైపు ఆమె సంతోష్ అనే వ్యక్తితోనూ చనువుగా ఉంటోంది. అన్బరసన్ ఇది కనిపెట్టి విద్యతో గొడవపడి తరువాత ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment