
ఇద్దరూ మైనర్లేనని గుర్తించిన పోలీసులు
మృతులు రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామ వాసులు
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని కటికి రహదారి కరకవలస గ్రామ సమీపంలోని ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన యువతీ యువకులు ప్రేమికుల జంట అని, ఇద్దరూ మైనర్లని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట గ్రామానికి చెందినవారు. మృతుల వద్ద దొరికిన వివరాలు, వారి స్వస్థలంలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా వారి ఆచూకీని సేకరించారు.
మృతులను చైతన్య (17), జ్యోతి (14)లుగా గుర్తించారు. యువతి 9వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ గత మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారం రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి, ఆదివారం అనంతగిరి మండలం కటికి జలపాతాన్ని సందర్శించి, సాయంత్రం ఓ చెట్టు వద్ద ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలకు సోమవారం అరకు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment