Lovers attempt suicide
-
వారు ప్రేమికులే
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని కటికి రహదారి కరకవలస గ్రామ సమీపంలోని ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన యువతీ యువకులు ప్రేమికుల జంట అని, ఇద్దరూ మైనర్లని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట గ్రామానికి చెందినవారు. మృతుల వద్ద దొరికిన వివరాలు, వారి స్వస్థలంలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా వారి ఆచూకీని సేకరించారు. మృతులను చైతన్య (17), జ్యోతి (14)లుగా గుర్తించారు. యువతి 9వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ గత మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారం రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి, ఆదివారం అనంతగిరి మండలం కటికి జలపాతాన్ని సందర్శించి, సాయంత్రం ఓ చెట్టు వద్ద ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలకు సోమవారం అరకు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రియురాలి మోసం.. తీసింది ప్రాణం
కర్ణాటక: సహజీవనం చేస్తున్న ప్రియురాలు మోసం చేసిందనే బాధతో యువకుడు (29) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బెంగళూరు పరప్పన అగ్రహార నివాసి అన్బరసన్. గతనెల 15 తేదీన తన అపార్టుమెంట్ ఫ్లాటులో ఉరివేసుకున్న స్థితిలో చనిపోయాడు. అయితే ఆ కేసు ఇప్పుడు మలుపు తిరిగింది. మృతుని మొబైల్ఫోన్లో ఆడియోలను ఆలకించిన అతని తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. విద్య, సంతోష్ అనే ఇద్దరిపై కేసు పెట్టారు. అన్బరసన్ గత ఆరునెలలనుంచి విద్య అనే యువతిని ప్రేమించి సహజీవనం చేస్తున్నాడు. ఇతడ ఈ కామర్స్ సంస్థలో మేనేజర్. ఐటీ ఇంజినీరుగా పనిచేసే విద్య, భర్తకు విడాకులిచ్చి అన్బరసన్ అద్దెకు తీసుకున్న ఇంట్లో ఉండేది. మరోవైపు ఆమె సంతోష్ అనే వ్యక్తితోనూ చనువుగా ఉంటోంది. అన్బరసన్ ఇది కనిపెట్టి విద్యతో గొడవపడి తరువాత ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ములుగు మండలం లో ప్రేమజంట ఆత్మహత్య
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలు మృతి
పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం మండలం సందుపాలెంకోడూరులో ఆ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రేమికురాలు మృతి చెందగా, ప్రియుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... సందుపాలెంకోడూరుకు చెందిన యువకుడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ క్రమంలో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలిపారు. ప్రేమ పెళ్లికి తాము అంగీకరించమని పెద్దలు వెల్లడించారు. దాంతో తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆ ప్రేమ జంట భావించారు. దీంతో గత అర్థరాత్రి గ్రామ శివారులో ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ప్రేమికులును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రేమికురాలు మరణించిందని వైద్యులు వెల్లడించారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
నగరంలో కొత్తపేటలో గురువారం ఉదయం ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దాంతో ఆ జంట పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి ఆ జంటను వైద్య సహాయం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రేమ జంట పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇరువురి కుటుంబాలలోని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంగా వారు ఆ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.