ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలు మృతి | Lovers attempt suicide; girl killed, boy critical | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలు మృతి

Published Sun, Jun 15 2014 8:57 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Lovers attempt suicide; girl killed, boy critical

పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం మండలం సందుపాలెంకోడూరులో ఆ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రేమికురాలు మృతి చెందగా, ప్రియుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... సందుపాలెంకోడూరుకు చెందిన యువకుడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ క్రమంలో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలిపారు.

 

ప్రేమ పెళ్లికి తాము అంగీకరించమని పెద్దలు వెల్లడించారు. దాంతో తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆ ప్రేమ జంట భావించారు. దీంతో గత అర్థరాత్రి గ్రామ శివారులో ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ప్రేమికులును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రేమికురాలు మరణించిందని వైద్యులు వెల్లడించారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement